భట్టారం రామకృష్ణయ్య

భట్టారం రామకృష్ణయ్య తెలుగు పండితుడు, ప్రచురణ కర్త.[1]

భట్టారం రామకృష్ణయ్య
జననం1888 ఏప్రిల్ 11
మరణం1949 ఏప్రిల్ 11
ప్రసిద్ధిరచయిత

జీవిత విశేషాలు మార్చు

జర్నలిస్టుగా పేరొందిన దంపూరు వెంకట నరసయ్య ఏకైక కుమారుడు భట్టారం రామకృష్ణయ్య, బి.ఆర్.కె గా సుపరిచితుడైన అతను 1888 ఏప్రిల్ 11న జన్మించాడు. నాలుగేళ్ళ కుమారుడు రామకృష్ణయ్యను నరసయ్య తన వితంతు సోదరి మీనాక్షమ్మకు దత్తత ఇచ్చాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం, కోర్ట్ వ్యవహారాలూ చూచుకోవడంలోనే రామకృష్ణయ్య బాల్యం గడచిపోయింది. తండ్రివద్ద రాతకోతల్లో తరిఫీదుపొంది సలహాలివ్వగలిగిన స్థాయికి ఎదిగాడు.

రామకృష్ణయ్యకు మైనారిటీ తీరగానే కొన్ని నెలలు కోడూరు గ్రామ మునిసిఫ్ గా పనిచేసి, తమ పొలాలకు సంబంధించిన కోర్ట్ వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చిన తరవాత, వెంకటగిరి టౌన్ ఆర్.వి.ఎం హైస్కూల్లో చదువుతూ వెంకటగిరిలో పీపుల్స్ ఫ్రెండ్ ఆంగ్ల పత్రిక, పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్ కొనసాగిస్తూ, 24 వ ఏట భ్రమరాంబ అనే చిన్న నవల రాసి ప్రచురించాడు.[2]

వెంకటగిరిలో రామకృష్ణయ్యను బి.ఆర్.కె అని వ్యవహరించేవారు. "భ్రమరాంబ ఇది కేవలము కథకాదు, అట్లని పెద్ద నవలయు కాదు. సాంఘికమైన నవల. భ్రమరాంబ అను నాయిక చరిత్ర ఇందు వర్ణించబడెను." అని ఒక పత్రిక రాసింది. రామకృష్ణయ్య విద్యార్థిగా ఉంటూ, ప్రజామిత్ర ప్రచురణ సంస్థ నెలకొల్పి, A Manual of Mathematics, మనుచరిత్ర ముడాశ్వాసాలకు నోట్స్ రచించి ప్రచురించాడు. రామకృష్ణయ్య ట్రైనింగ్ పూర్తిచేసి వెంకటగిరి ముద్దుకృష్ణయ్య హైస్కూల్లో ఉపాధ్యాయుడుగా స్థిరపడ్డాడు. ప్రైవేటుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఎ పాసయ్యాడు. ఇంగ్లీష్ సాహిత్యం చక్కగా చదువుకొన్న పండితుడని, మితభాషి, లౌకిక వ్యవహారాల్లో గట్టివాడని పేరుతెచ్చుకొన్నాడు. చాలాకాలం వెంకటగిరి టౌన్ లో హిందూ, స్వతంత్ర, స్వరాజ్య పత్రికలకు విలేకరిగా పనిచేశాడు. ఈయన తండ్రి ప్రభావంలో మూఢనమ్మాకాలకు దూరంగా ఉన్నాడు. [3]

రామకృష్ణయ్య 1949 లో 60 వ పుట్టినరోజు నాడు మరణించాడు.

మూలాలు మార్చు

  1. "పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/173 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2023-06-30.
  2. భట్టారం రామకృష్ణయ్య 'భ్రమరాంబ' అనే చిన్న నవల, వెంకటగిరి టౌన్ లోని సొంత 'అచ్చుకూటం' పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్ లో 1912 లో ముద్రించబడింది.
  3. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం రచన "ఇంగ్లీషు జర్నలిజంలో తోలి వెలుగు దంపూరు నరసయ్య", సొసైటీ ఫర్ సోషల్ చేంజ్, నెల్లూరు ప్రచురణ, 2007