భట్టారిక ఆలయం
భట్టారికా ఆలయం, ఒడిసా రాష్ట్రం, కటక్ జిల్లా, బరంబ గ్రామ పంచాయితీ పరిధిలోని ససంగ శివారు గ్రామంలో ఉంది. ఈ ఆలయం రత్నగిరి పర్వతం వద్ద మహానది నది ఒడ్డున ఉంది.[1]
భట్టారిక ఆలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఒడిషా |
జిల్లా: | కటక్ |
భౌగోళికాంశాలు: | 20°22′6.71″N 85°16′18.16″E / 20.3685306°N 85.2717111°E |
ఆలయ చరిత్ర
మార్చుభట్టారికా ఆలయం ఒడిషాలోని హిందూ దేవాలయం. ఒరిస్సా రాష్ట్రంలో కటక్ జిల్లాలో ఈ ఆలయం ఉంది.ఈ ఆలయం మహానది ప్రక్కన రత్నగిరి వద్ద ఉంది.భట్టారికా ఆలయం పరశురామ్ స్థాపించబడిందని, దేవతల ప్రతిమను అతని బాణం కొనతో చెక్కారు అని నమ్ముతారు. శత్రువులను చంపడానికి,దుర్గాదేవి దయ పొందాలని ఇక్కడ పరశురాం దుర్గాదేవిని ప్రార్థించగా, దుర్గాదేవి పరశురాంకి కావలసిన శక్తి ఇచ్చిందని ఆలయం గురించి రామాయణంలో ప్రస్తావించబడింది.[2] రామ, లక్ష్మణులు సీత వద్దకు వెళ్ళేటప్పుడు భట్టారిక దేవిని ప్రార్థించారని రామాయణంలో వ్రాయబడింది. మహానది నదికి అవతలి వైపున ఉన్న మంకాడగాడియా వద్ద రామ, లక్ష్మణ, సీతమ్మల పాద గుర్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది..భట్టారిక ఆలయంలో భట్టారిక దేవి ఎనిమిది విగ్రహాలు ఉన్నాయి. ఈ ఎనిమిది విగ్రహాలలో ఐదు పద్మాసనంలో, మూడు లలితాసనంలో ఉన్నాయి.ఈ ఆలయం ఒరిస్సా శక్తి పిఠాలలో ఒకటి.ఒరిస్సా ప్రజలు ఈ దేవతను అవతారంగా భావించి పూజలు చేస్తుంటారు.[3][4]
చిత్ర మాలిక
మార్చుమూలాలు
మార్చు- ↑ "Bhattarika Temple Athgarh". Bhattarika Temple Athgarh. Retrieved 2020-01-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-02. Retrieved 2020-04-05.
- ↑ "Bhattarika Temple Athgarh". Bhattarika Temple Athgarh. Retrieved 2020-01-30.
- ↑ "Mahamaya Bhattarika Temple, Sasang" (PDF). Indira Gandhi National Centre For The Arts. www.ignca.gov.in/. Retrieved 17 July 2014.