భట్ట భాస్కరుడు లేదా భాస్కర భట్ట వేద భాష్యకారుడు. ఇతను ఆచార్య సాయణాచార్య యొక్క పూర్వీకుడు. ఇతను కృష్ణ యజుర్వేదానికి చెందిన తైత్తిరీయ సంహిత, తైత్తిరీయ బ్రాహ్మణ ఇంకా తైత్తిరీయ ఆరణ్యకానికి వ్యాఖ్యానం రాశాడు. తన వ్యాఖ్యానానికి 'జ్ఞానయజ్ఞ' అని పేరు పెట్టాడు.

జీవిత విశేషాలు మార్చు

భట్ట భాస్కరుడు ఉజ్జైని నివాసి. ఇతను కౌశిక గోత్రీయ తెలుగు బ్రాహ్మణుడు. ఇతని శివోపాసకుడు అనుటకు పలు ఆధారములు కలవు. ఇతను ఆచార్య సాయణాచార్య కు పూర్వము దేవరాజ యజ్వ (వేద నిఘంటు శోధకుడు)కు కూడా ముందు వాడని తెలియుచున్నది. సాయణాచార్యుడు కంటే ముందు ఉన్న ఆత్మానందుడు అనే భాష్యకారుడు సుదర్శన మీమాంస అనే ఆతని స్వీయ రచనలో భట్ట భాస్కరుడు ప్రస్తావన చేసాడు. ఇందులో భాస్కర భట్ట విరచిత జ్ఞానయజ్ఞ యొక్క కొంత పరిచయం కూడా చేసాడు. బారహవీయం శతాబ్దానికి చెందిన వైదిక విజ్ఞానికుడు హరదత్తుడు తన ఏకాగ్నికాండ అనే గ్రంథములో కూడా భాస్కర భట్టు ప్రస్తావన కలదు. వీటినంటినీ ఆధారంగా భాస్కర భట్టుడు క్రీ.శ. 11వ శతాబ్దానికి చెందినవాడని పండితులు నిర్దారించినారు. తైత్తిరీయం సంహిత కు ఇతను వ్రాసిన జ్ఞానయజ్ఞ భాష్యము విద్వత్ లోకంలో ఖ్యాతి గాంచిన రచన. ఈయన వ్రాసిన అనేక ఇతర గ్రంథములు ప్రస్తుతము లభించుట లేదు కానీ ఇతని వైదిక నిఘంటువు మాత్రము ప్రస్తుతము లభించుచున్నది.భాక్సర భట్టు వైదిక స్వర ప్రక్రియ ద్వారా తన నిఘంటువు రూపకల్పన చేయుట ఇతని ప్రత్యేకత.

రచనలు మార్చు

  • తైత్తిరీయ సంహిత-జ్ఞానయాజ్ఞాఖ్య భాష (12 భాగాలుగా, మైసూర్‌లోని ప్రభుత్వ శాఖా ముద్రణాలయం నుండి 1894-1898 ADలో ప్రచురించబడింది)
  • తైత్తిరీయబ్రాహ్మణం-జ్ఞానజ్ఞాఖ్య భాష (4 భాగాలుగా, మైసూర్‌లోని ప్రభుత్వ శాఖా ముద్రణాలయం నుండి 1908-1913 ADలో ప్రచురించబడింది)
  • తైత్తిరియాఅరణ్యకం-జ్ఞానయాజ్ఞాఖ్య భాష (2 భాగాలుగా, మైసూర్‌లోని ప్రభుత్వ శాఖా ముద్రణాలయం నుండి 1900-1902 ADలో ప్రచురించబడింది)

మూలములు మార్చు

[1] భట్టభాస్కర