భరతేశ్వర్ ఆలయం
భరతేశ్వర్ శివాలయం ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరంలో నెలకొన్న 6వ శతాబ్ది నాటి శివాలయం. ఈ దేవాలయంలో గుండ్రమైన పానవట్టంలో శివలింగం నెలకొనివుంది. శివరాత్రి వంటి పండుగలు ఇక్కడ పాటిస్తారు. కల్పనా చౌక్ నుంచి లింగరాజ ఆలయనికి వెళ్ళే దారిలో ఎడమ చేతి వైపు, రామేశ్వరాలయం ఎదురుగా నెలకొంది.[1] ఈ ఆలయం ప్రాచీన కళింగ పద్ధతికి చెందిన రేఖా విమానం శైలిలో నిర్మితమైంది. ఒడిశాలో ఇప్పటికీ నెలకొనివున్న ఆలయాల్లో అత్యంత ప్రాచీనమైన వాటిలో ఇది ఒకటి.[2][3]
చరిత్ర
మార్చు6వ శతాబ్దిలో శైలోద్భవ పరిపాలనా కాలంలో ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆలయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ అభివృద్ధి చేస్తోంది.[4]
నిర్మాణ రీతి
మార్చుప్రాచీన కళింగ శైలిలో ఇసుకరాయితో రేఖా విమాన పద్ధతిలో ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణ శైలి, ఆలయం పక్కనే ఉన్న లక్ష్మణేశ్వరాలయంలో అడ్డుదూలంలోని శాసనం ఆధారంగా ఆలయం 6వ శతాబ్ది నాటిదని చెప్పవచ్చు. కింద త్రిరథ, ఎత్తులో త్రియాంగబాద పద్ధతిలో ఉంది.[5]
నోట్స్
మార్చు- ↑ "Bharatesvara Siva Temple, Old Town, Bhubaneswar, Dist.-Khurda" (PDF). www.ignca.nic.in. Retrieved 17 October 2017.
- ↑ Odissi dance. Orissa Sangeet Natak Adademi, 1990.
- ↑ "Temples to hog the limelight - Eight important shrines across capital to be lit up with new age energy-efficient floodlights". www.telegraphindia.com. Archived from the original on 18 అక్టోబరు 2017. Retrieved 17 October 2017.
- ↑ "Bharatesvara Siva Temple, Old Town, Bhubaneswar, Dist.-Khurda" (PDF). www.ignca.nic.in. Retrieved 17 October 2017.
- ↑ "ODISHA (ORISSA) TEMPLES". www.heritagetoursorissa.com. Archived from the original on 17 అక్టోబరు 2017. Retrieved 17 October 2017.
మూలాలు
మార్చు- Debala Mitra, 1985, Bhubaneswar, New Delhi.
- T. E. Donaldson, 1985, Hindu Temple Art of Orissa, Vol. - I, Leiden.
- R. P. Mohapatra, 1986, Archaeology in Orissa, Vol. - I, New Delhi.