భలే అబ్బాయిలు (1969 సినిమా)

భలే అబ్బాయిలు తోట సుబ్బారావు నిర్మాతగా శ్రీదేవి కంబైన్స్ బ్యానర్‌పై 1969లో విడుదలైన తెలుగు సినిమా. 1965లో వచ్చిన వక్త్ అనే హిందీ సినిమా ఆధారంగా నిర్మించబడిన ఈ సినిమాకు పేకేటి శివరామ్ దర్శకుడిగా పనిచేశాడు.

భలే అబ్బాయిలు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం పేకేటి శివరామ్
తారాగణం కృష్ణ,
కె.ఆర్.విజయ,
కృష్ణంరాజు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీదేవి కంబైన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు
 • కృష్ణ
 • గీతాంజలి
 • గుమ్మడి
 • పండరీబాయి
 • కృష్ణంరాజు
 • సత్యనారాయణ
 • కె.ఆర్.విజయ
 • అల్లు రామలింగయ్య
 • రేలంగి
 • ఛాయాదేవి
 • రామ్మోహన్
 • జగ్గారావు
 • కె.వి.చలం
 • వల్లభనేని శివరాం
 • ధూళిపాళ
 • టి.జి.కమలాదేవి
 • ఏడిద నాగేశ్వరరావు

సాంకేతిక వర్గం

మార్చు
 • మాటలు: పినిశెట్టి,
 • సంగీతం: ఘంటసాల,
 • కళ: వాలి,
 • కూర్పు: బి గోపాలరావు,
 • నృత్యం: జయరాం,
 • పోరాటాలు: భానుప్రసాద్,
 • కెమెరా: చిట్టిబాబు,
 • దర్శకత్వం: పేకేటి శివరామ్,
 • నిర్మాత: తోట సుబ్బారావు

సామాన్య మిల్లు కూలి స్థాయినుంచి లక్షాధికారిగా ఎదిగిన వ్యక్తి కోటేశ్వరరావు(గుమ్మడి). అతని భార్య లక్ష్మి (పండరీబాయి). వారికి ముగ్గురు పిల్లలు బాబ్జీ, చిన్న, బుజ్జి. ముగ్గురూ ఒకే తేదీ ఒకే నెలలో జన్మించారు. ఆ ముగ్గురి పుట్టినరోజు వేడుకలు ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఆ రోజు రాత్రి సంభవించిన భూకంపం కారణంగా కుటుంబం చెల్లాచెదురవుతుంది. బాబ్జి ఓ అనాథ శరణాలయం చేరి వార్డెన్ (అల్లు రామలింగయ్య)ను ఎదిరించి దెబ్బలు తిని అక్కడనుంచి పారిపోతాడు. బుజ్జి తల్లివద్దనే ఉండిపోతాడు. ధనవంతులైన, పిల్లలు లేని రేలంగి, ఛాయాదేవి దంపతులకు చిన్న లభించి, వారి కుమారుడు రవి (కృష్ణ)గా ఎదిగి లాయర్ అవుతాడు. భార్యా పిల్లల కోసం వెతుకుతూ వచ్చిన కోటయ్య, అనాథ శరణాలయం చేరిన బాబ్జి, వార్డెన్ కారణంగా పారిపోయాడని తెలిసుకుని అతన్ని అంతం చేయటంతో పోలీసులు కోటయ్యను అరెస్ట్ చేసి జైలులో పెడతారు. రవిని పెంచుకుంటున్న రేలంగి, ఛాయాదేవి దంపతులకు ఆ తరువాత కుమార్తె రాధ (గీతాంజలి) జన్మిస్తుంది. పారిపోయిన బాబ్జి (రాజా) కృష్ణంరాజుగా, అక్రమ వ్యాపారాలు చేసే ప్రతాప్ (సత్యనారాయణ) వద్ద పెరుగుతాడు. సంఘంలో పెద్దమనిషి రాజాగా వ్యవహరిస్తుంటాడు. జడ్జి మాధవరావు, టిజి కమలాదేవిల కుమార్తె మీనా (కెఆర్ విజయ)ను ప్రేమిస్తాడు. రవి, మీనా అంతకుముందే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. తల్లి లక్ష్మివద్ద పెరిగిన రామూ (రాంమ్మోహన్) బిఏ పూర్తి చేస్తాడు. రాధ, రామూను ప్రేమిస్తుంది. తల్లికి క్యాన్సర్ వల్ల రామూ హైద్రాబాద్ వచ్చి ప్రతాప్‌వద్ద డ్రైవర్‌గా చేరతాడు. మీనాను ప్రేమించిన రాజా, రవిని అంతం చేయాలని వెళ్లి అక్కడ రవి చిన్నప్పటి ఫొటోచూసి అతడు తన తమ్ముడని గ్రహించి, రవి, మీనాలకు పెళ్లి జరగాలని ఆశిస్తాడు. రాధ, రాముల ప్రేమను తిరస్కరించిన రవిని, నువ్వు అనాథవని నిందించటంతో రవి ఇల్లువదిలి వెళ్తాడు. ప్రతాప్ సాయంతో ఈ విషయం పరిష్కరించేందుకు యత్నించిన రాజా, అతని కుట్రవలన జగ్గు (జగ్గారావు) హత్యానేరంలో ఇరుక్కోవటం, అరెస్టయిన రాజాను రవి లాయర్‌గా వాదించి, రామూ సాక్ష్యంతో నిజం నిరూపించి, ప్రతాపే ఈ హత్యకు కారకుడని అరెస్ట్ చేయిస్తాడు. కోర్టు హాలుకు వచ్చిన భార్య లక్ష్మిని కలుసుకున్న కోటయ్య, రామూ తన కొడుకని తెలిసికోవటం, దాంతోపాటే రాజా, రవి కూడా తన బిడ్డలేనని గ్రహించి అంతా ఒక్కటవ్వటం, విధి విలాసం అన్నింటికీ కారణమని కోటయ్య గ్రహించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].

పాటలు

మార్చు
 • పదవే పోదాము పల్లెటూరికి’ - రచన: కొసరాజు, గానం: ఘంటసాల, యల్‌ఆర్ ఈశ్వరి బృందం
 • కలగన్నానే తీయని కలగన్నానే - రచన: దాశరధి, గానం: ఘంటసాల, పి సుశీల
 • గులాబీలు పూచే వేళ కోరికలే - రచన: కొసరాజు, గానం: ఎస్ జానకి, ఘంటసాల కోరస్
 • ఏవౌనో ఈవేళలో ఏముందో ఏనీడలో’ - రచన: సినారె, గానం: ఎస్ జానకి
 • ఆనందము నాలో పొంగేను/ అనురాగము అలలై’ - రచన: దాశరథి, గానం: పి సుశీల
 • ఎవరో ఈనాడు నామదిలో చేరెనులే - రచన: దారశథి, గానం: పి సుశీల
 • కాలమే విధిరూపము మానవాళికి దీపము - రచన: శ్రీశ్రీ, గానం: ఘంటసాల

మూలాలు

మార్చు
 1. సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (9 March 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 25 మార్చి 2019. Retrieved 25 March 2019.