భలే దొంగలు (1976 సినిమా)
'భలే దొంగలు' తెలుగు చలన చిత్రం,1976 అక్టోబరు29 న విడుదల.త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై సాంబశివరావు , బాబ్జీ నిర్మించిన ఈ చిత్రానికి కొండా సుబ్బరామ దాస్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, మంజుల, త్యాగరాజు, మంచు మోహన్ బాబు ప్రథాన పాత్రలు పోషించారు సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
భలే దొంగలు (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్. దాస్ |
---|---|
తారాగణం | కృష్ణ, మోహన్ బాబు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | త్రిమూర్తి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఇది 1976లో విడుదలైన ఒక తెలుగు సినిమా. హిందీ చిత్రం చోర్ మచాయె షోర్ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మాణం చేశారు.
చిత్రకథ
మార్చుకృష్ణ, మంజుల ప్రేమించుకుంటారు. అపార్ధాలతో విడిపోతారు. కృష్ణ జైలు పాలౌతాడు. అక్కడ మోహన్ బాబుతో గొడవపడి తర్వాత స్నేహం చేస్తాడు. పద్మనాభం తదితరులు కూడా స్నేహితులౌతారు. వీరంతా జైలు నుండి తప్పించుకుని ఒక ఊరు చేరతారు. గ్రామస్తులందరూ వీరిని మంత్రిగారి మనుషులనుకుంటారు. అక్కడి బందిపోట్ల నుండి గ్రామాన్ని రక్షిస్తారు. కృష్ణ, [మంజుల] ల మధ్య సయోధ్య, విలన్లతో పోరాటం చిత్ర ముగింపు.
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: కె ఎస్.ఆర్.దాస్
సంగీతం:చెళ్లపిళ్ల సత్యం
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
నిర్మాత:సాంబశివరావు , బాబ్జీ
నిర్మాణ సంస్థ: త్రిమూర్తి ప్రొడక్షన్స్
గీత రచయితలు:ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య , కొసరాజు రాఘవయ్య చౌదరి,మైలవరపు గోపి
నేపథ్య గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
ఫోటోగ్రఫీ: పుష్పాల గోపీకృష్ణ
కళ: ఎన్.కృష్ణారావు
విడుదల:29:10:1976.
పాటలు
మార్చు- వచ్చాడు చూడు వరసైనవాడు. రచన: ఆరుద్ర ,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం (లేజాయెంగే లే జాయేంగే దిల్ వాలె దుల్హనియా -బాణీలో)
- పండంటి చిన్నదిరా పసరు మీద ఉన్నదిరా, రచన:కొసరాజు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- అందమైన చిన్నవాడు అలిగినా అందమే,రచన:ఆరుద్ర, గానం. పి సుశీల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- చూసానే ఒలమ్మీ చూసానే. రచన:దాశరథి , గానం. పి సుశీల ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- రెక్కల కష్టం చెయ్యనిదే ఎవ్వరి డొక్కలు నిండవురా, రచన:మైలవరపు గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం
నటులు
మార్చు- కృష్ణ
- మంజుల
- మోహన్ బాబు
- పద్మనాభం
- జయమాలిని
- త్యాగరాజు
- నాగభూషణం
- మిక్కిలినేని
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.