భారతదేశంలో కోవిడ్-19 లాక్ డౌన్

భారతదేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ యొక్క వివరాలు

2020 జనవరి 30 న కేరళ రాష్ట్రంలో వుహాన్ నుండి వచ్చిన విద్యార్థికి కరోనావైరస్ సోకినట్లు

భారతదేశంలో కోవిడ్-19 లాక్ డౌన్ (2020)
తేదీ
  • మొదటి దశ: 25 మార్చి 2020 (2020-03-25) – 14 ఏప్రిల్ 2020 (2020-04-14) (21 days)
  • రెండవ దశ: 15 ఏప్రిల్ 2020 (2020-04-15) – 3 మే 2020 (2020-05-03) (19 days)
  • మూడవ దశ: 4 మే 2020 (2020-05-04) – 17 మే 2020 (2020-05-17) (14 days)
  • నాల్గవ దశ: 18 మే 2020 (2020-05-18) – ongoing (4 సంవత్సరాలు, 6 నెలలు , 11 రోజులు); 31 మే 2020 తో ముగియనుంది
  • ఐదవ దశ: 1 జూన్ 2020 (2020-06-01) – 30 జూన్ 2020 (2020-06-30) (30 రోజులు)
స్థలంభారతదేశం
కారణాలుకోవిడ్-19
లక్ష్యాలుభారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు.
పద్ధతులు
  • ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిషేధించారు.
  • ఫార్మసీలు, ఆస్పత్రులు, బ్యాంకులు, కిరాణా షాపులు ఇతర ముఖ్యమైన సేవలు మినహా అన్ని సేవలు దుకాణాలు మూసివేయబడ్డాయి.
  • వాణిజ్య, ప్రైవేట్ సంస్థల మూసివేత (ఇంటి నుండి పని మాత్రమే అనుమతించబడుతుంది)
  • అన్ని విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రాలు నిషేధించారు.
  • అన్ని ప్రార్థనా స్థలాల మూసివేత.
  • సామాజిక, రాజకీయ, క్రీడలు, వినోదం, విద్యా, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాల నిషేధించారు.
స్థితిప్రస్తుతం అమల్లో ఉంది.

భారత ప్రభుత్వం ధ్రువీకరించింది.[1] కోవిడ్-19 కేసుల సంఖ్య 500 పెరగడంతో 2020 మార్చి 19 న ప్రధానమంత్రి మోడీ మార్చి 22 ఆదివారం 'జనతా కర్ఫ్యూ' పాటించాలని పౌరులందరినీ కోరారు.[2] తరువాత మార్చి 24 న ప్రధానమంత్రి మోదీ రెండవసారి ప్రసంగిస్తూ 21 రోజుల (2020 మార్చి 25 నుండి - 2020 ఏప్రిల్ 14) పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు.[3] కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఏకైక పరిష్కారం సామాజిక దూరం ద్వారా వైరస్ ని అరికట్టవచ్చని అన్నారు.[4] జనతా కర్ఫ్యూ కంటే లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయబడుతుందని తెలిపారు.

జనతా కర్ఫ్యూ

మార్చు
 
2020 ఏప్రిల్ 5న లాక్ డౌన్లోభాగంగా దీపాల ప్రదర్శన

భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూను ప్రతిపాదించారు.[5] 2020 మార్చి 22న, భారత దేశ ప్రజలంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్ళ నుండి బయటికి రాకుండా, స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు.[6]

నిషేధాలు

మార్చు

లాక్ డౌన్ సమయంలో ప్రజలు తమ ఇళ్ళ నుండి బయటపడకుండా ఇంటి వద్దనే ఉండేలా పరిమితం చేశారు.[7] అత్యవసర సేవలు అగ్నిమాపక, పోలీసు, అత్యవసర రవాణా చేయడానికి మినహాయింపు ఇచ్చారు. మిగిలిన అన్ని రవాణా, వాయు, రైలు సేవలను పూర్తిగా రద్దు చేశారు.[8] విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు కూడా నిలిపివేయబడ్డాయి.[8] బ్యాంకులు, ఎటిఎంలు, పెట్రోల్, ఇతర నిత్యావసరాలు సేవలకు మినహాయింపు ఇచ్చారు.[9] ఈ ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే సంవత్సరం వరకు జైలుశిక్ష పడుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సడలింపులు

మార్చు

2020 మే 4 నుండి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. దీని ప్రకారం కోవిడ్-19 లేని ప్రాంతాల్లో ఆంక్షలు సడలించారు.[10]

(4 మే - 2020 మే 17) సమాచారం
కార్యాచరణ ( Y/ N)
రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్
రైల్వే, మెట్రో సేవలు      
విద్యాసంస్థలు      
సినిమా ధియేటర్స్, మాల్స్      
బహిరంగ సభలు      
ప్రార్థనా స్థలాలు      
1 డ్రైవర్ 2 ప్రయాణీకులతో టాక్సీలు      
దుకాణాలు

ఈ కామర్స్

     
33% సామర్థ్యం ఉన్న ప్రైవేట్ కార్యాలయాలు      
ద్విచక్ర వాహనాలు      

మొదటి దశ లాక్ డౌన్

మార్చు
2020 మార్చి 25
  • 2020 మార్చి 25 నుండి 2020 ఏప్రిల్ 14
  • 21 రోజులు
  • 606 పాజిటివ్ కేసులు,
  • 10 మరణాలు సంభవించాయి.

మొదటి రోజు 2020 మార్చి 25 న, దాదాపు అన్ని సేవలు కర్మాగారాలు నిలిపివేయబడ్డాయి.[11] లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కొన్ని రాష్ట్రాలలో అరెస్టులు జరిగాయి. లాక్ డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా అవసరమైన వస్తువుల సజావుగా సరఫరా అయ్యేలా ప్రభుత్వం ఇ-కామర్స్ కు అనుమతి ఇచ్చింది. అనేక రాష్ట్రాలు పేద ప్రజలకు సహాయ నిధులను ప్రకటించాయి.

లాక్ డౌన్ బాధిత వారికి సహాయపడటానికి మార్చి 26 న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 170,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.[12] ఈ ప్యాకేజీ పేదకు ప్రత్యక్ష నగదు బదిలీ, ఉచిత తృణధాన్యాలు, వంట గ్యాస్ మూడు నెలల ఉచితంగా ఇచ్చారు. వైద్య సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించారు.

దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడానికి ముందు, మార్చి 22 న, భారత రైల్వే మార్చి 31 వరకు ప్రయాణీకుల కార్యకలాపాలను నిలిపివేస్తుందని ప్రకటించింది. 31 మార్చి 29 న, భారతీయ రైల్వేలు సాధారణ సరుకు రవాణా సేవతో పాటు, అవసరమైన వస్తువులను రవాణా చేయడానికి ప్రత్యేక పార్శిల్ రైళ్లకు సేవలను ప్రారంభిస్తామని ప్రకటించాయి.[13] కోవిడ్-19 రోగులకు కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చే ఈ విధంగా ప్రణాళికను ఏర్పాటు చేశారు.[14]

మొదటి దశ లాక్ డౌన్ కాల సమయం ముగియడంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాక్ డౌన్ ఏప్రిల్ చివరి వరకు పొడిగించాలి వాటిలో ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్నాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాలు పొడిగించారు.

రెండవ దశ లాక్ డౌన్

మార్చు

2020 ఏప్రిల్ 14 న, ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించారు.ఏప్రిల్ 16 న లాక్ డౌన్ ప్రాంతాలను రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ గా విభజించారు.[15]

ఏప్రిల్ 20 నుండి కొన్ని సడలింపులను ఇచ్చారు.పాడి, ఆక్వాకల్చర్, వ్యవసాయ రంగానికి ఈ లాక్ డౌన్ నుండి సడలింపు ఇచ్చారు.వ్యవసాయ చేయడానికి ఉపయోగించే సామాగ్రిని విక్రయించే దుకాణాలను తెరవడానికి అనుమతులు ఇచ్చారు.

ఏప్రిల్ 25 న, సగం మంది సిబ్బందితో చిన్న రిటైల్ దుకాణాలను తెరవడానికి అనుమతించారు. సామాజిక దూర నిబంధనలను పాటించాలి అని సూచించారు.

మూడవ దశ లాక్ డౌన్

మార్చు

2020 మే 4 నుండి 2020 మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించారు.భారతదేశంలో 3 జోన్లుగా విభజించారు. రెడ్ జోన్ (130 జిల్లాలు), ఆరెంజ్ జోన్ (284 జిల్లాలు) గ్రీన్ జోన్లు (319 జిల్లాలు).గా విభజించారు.[16]

నాల్గవ దశ లాక్ డౌన్

మార్చు

2020 మే 18 నుండి 2020 మే 31 వరకు పొడిగించారు. కొన్ని వ్యాపార సంస్థలకు, చిన్న చిన్న పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు.

ఐదవ దశ లాక్ డౌన్

మార్చు

లాక్‌డౌన్ జూన్ 30వ తేదీ వరకూ పొడిగిస్తూనట్లు కేంద్ర ప్రకటించింది. ఇందుకు సంబంధించిన హోం మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

  • కంటైన్‌మెంట్ జోన్లలో జూన్1 నుండి జూన్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది.కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసర, నిత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
  • దేశమంతా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది.

మొదటి దశ సడలింపులు: 2020 జూన్ 8వ తేదీ నుంచి ఈ కింది వాటికి అనుమతి ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తిని నివారించటానికి సామాజిక దూరం పాటించేలా చూడటానికి కేంద్ర సూచించారు.

  • ఆలయాలు, మత ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు
  • హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్

రెండో దశ సడలింపులు: స్కూళ్లు, కళాశాలలు విద్యా, శిక్షణ సంస్థలు తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, చర్చించి జూలైలో నిర్ణయం తీసుకోవటం అని వెల్లడించారు.

మూడో దశ సడలింపులు: కోవిడ్ 19 ప్రభావం తగ్గితే అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైలు ప్రయాణాలు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు వంటి ప్రదేశాలు, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత సమావేశాలు, ఇతర పెద్ద సమావేశాలకు అనుమతి ఇస్తారు.

ప్రభావం

మార్చు

ఈ లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించడం మొదలు పెట్టింది. వైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్ లుగా గుర్తించిన చాలా ప్రాంతాలు దేశ ఆర్థిక వ్యవస్థకి అధిక మొత్తంలో ఆదాయాన్ని చేకూర్చేవి. దీని వలన ఆదాయం కోల్పోయింది. వలస కార్మికులకి పని కల్పించే నిర్మాణ రంగం కూడా ఇప్పట్లో పనులు మొదలు మొదలు పెట్టడానికి ఎక్కువ సమయమే పడుతుంది.లాక్ డౌన్ తర్వాత నిరుద్యోగ శాతం 20 పైనే పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఒక నివేదికలో తెలిపింది. పరిశ్రమలు అన్నీ మూసివేయడంతో లక్షలాది మంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు.వారిలో చాలా ఆకలితో ఉన్నారు.లాక్డౌన్ కారణంగా పేదలకు అదనపు రేషన్లు లభిస్తాయని ప్రభుత్వ పథకాలు నిర్ధారించినప్పటికీ, పంపిణీ వ్యవస్థ ప్రభావవంతంగా లేదు.[17] పని డబ్బు లేక వేలాది మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లడానికి వందల కిలోమీటర్లు నడిచి వాళ్ల స్వగ్రామాలకు చేరుకోవాలని ప్రయత్నించారు.వారిలో కొందరు అలసటతో మరణించారు. కొందరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మే 1 న, వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

పర్యావరణంపై ప్రభావం

మార్చు

లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు మూసివేయబడటంతో నదులు శుభ్రంగా మారాయి. [18][19][20][21][22] లాక్ డౌన్ సమయంలో గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.[23]

మూలాలు

మార్చు
  1. Ward, Alex (24 March 2020). "India's coronavirus lockdown and its looming crisis, explained". Vox.
  2. "PM Modi calls for 'Janata curfew' on March 22 from 7 AM-9 PM". BusinessLine.
  3. "India's 1.3bn population told to stay at home". BBC News. 25 March 2020.
  4. "21-day lockdown in entire India to fight coronavirus, announces PM Narendra Modi". India Today.
  5. Bureau, Our. "PM Modi calls for 'Janata curfew' on March 22 from 7 AM-9 PM". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2020-03-22.
  6. DelhiMarch 19, India Today Web Desk New; March 20, 2020UPDATED:; Ist, 2020 05:15. "What is Janata Curfew: A curfew of the people, by the people, for the people to fight coronavirus". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-03-22. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  7. "PM calls for complete lockdown of entire nation for 21 days". Press Information Bureau. Archived from the original on 2020-03-25. Retrieved 2020-05-21.
  8. 8.0 8.1 "Guidelines.pdf" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 2020-03-24. Retrieved 2020-05-21. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "MoHA" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  9. Tripathi, Rahul (25 March 2020). "India 21-day Lockdown: What is exempted, what is not". The Economic Times.
  10. "MHA extend lockdown period" (PDF). mha.gov.in. Archived from the original (PDF) on 6 మే 2020. Retrieved 8 May 2020.
  11. Singh, Karan Deep; Goel, Vindu; Kumar, Hari; Gettleman, Jeffrey (25 March 2020). "India, Day 1: World's Largest Coronavirus Lockdown Begins". The New York Times. ISSN 0362-4331.
  12. "FM Nirmala Sitharaman announces Rs 1.7 lakh crore relief package for poor". The Economic Times. 27 March 2020.
  13. World, Republic. "MASSIVE: Railways suspends all passenger train operations till March 31". Republic World. Retrieved 2020-05-21.
  14. "Coronavirus Outbreak: Indian Railways converts non-AC train coach into isolation ward on trial basis". Firstpost. Retrieved 2020-05-21.
  15. "India coronavirus: All major cities named Covid-19 'red zone' hotspots". BBC. 16 April 2020.
  16. Thacker, Teena (1 May 2020). "Centre issues state-wise division of Covid-19 red, orange & green zones". The Economic Times.
  17. Jebaraj, Priscilla (2020-05-08). "Inter-State ration card portability usage very low: Food Minister". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-21.
  18. "Lockdown makes Ganga water significantly cleaner". LiveMint. 4 April 2020. Retrieved 22 April 2020.
  19. Naqvi, Haider; Kumar, Sudhir (4 April 2020). "Lockdown does what decades of schemes couldn't: Clean Ganga". HT Digital Streams Ltd. Retrieved 22 April 2020.
  20. Mandyam, Nithya (15 April 2020). "Karnataka: Frothing reduces, Vrishabhavathi water crystal clear after decades". Bennett, Coleman and Company Ltd. Retrieved 22 April 2020.
  21. "India's coronavirus lockdown reveals fresh air, cleaner rivers". Living Media India Ltd. 22 April 2020. Retrieved 22 April 2020.
  22. Babu, Nikhil (14 April 2020). "Yamuna cleaner due to lockdown". The Hindu. Retrieved 22 April 2020.
  23. "The silver lining: air pollution dips amid the lockdown". Retrieved 2 May 2020.