భారతదేశం - ప్రధాన పర్వత శిఖరాలు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
పర్వతం అనగా భూమిపై అతి ఎత్తుగా పైకి చొచ్చుక వచ్చిన భూభాగం అని స్థూలంగా చెప్పవచ్చు. ఎత్తైన దాని శిఖరమే పర్వత శిఖరం. ఇవి వాటి పరిమాణాన్ని బట్టి ఆకారాన్ని బట్టి చిన్న పెడ్డ తేడాలుంటాయి. అతి పెద్దది పర్వత మైతే, దాని తర్వాతది కొండ, ఆతర్వాత గుట్ట. చిన్న దానిని తిప్ప అని అంటారు. ఏ దేశంలోనైనా ఈ పర్వతాలు, కొండలు కలసి ఆదేశపు ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించి వుంటాయి. ఈ పర్వతాలు జీవనదులకు పుట్టిళ్ళు, వనమూలికలకు నిలయాలు, అరణ్యాలకు ఆవాసాలు, ఖనిజ సంపదకు మూలాలు. పురాణ కాలంనుండి ఈ పర్వతాలతో రాజులకు, రాజకీయాలకు, మతాలకు, ఆద్యాత్మికతకు, నాగరికతకు అవినాభావ సంబందం ఉంది. ఇవి ప్రకృతి మానవాళికి ప్రసాదించిన విహార కేంద్రాలు. ఇలాంటి పర్వత శిఖరాలు భారత దేశంలో అనేకం ఉన్నాయి. ప్రధాన మైన పర్వత శిఖరాలు వాటి ఎత్తును బట్టి వరుసగా:................
- పర్వత శిఖరం...................... ఎత్తు మీటర్లలో
- K2 (గాడ్విన్ ఆస్టిన్)............... 8611
- కాంచన గంగ......................... 8598
- నంద ప్రభాత్......................... 8128
- గాషేర్ బ్రం ........................... 8068
- బ్రాడ్ శిఖరం.......................... 8047
- డిస్త్మెఫిలిల్ సార్.................... 7885
- మషేర్ బ్రం (E)...................... 7821
- నందాదేవి............................. 7817
- మషేర్ బ్రం (W)..................... 7806
- రాక్ పోషీ............................... 7788
- కామెట్................................ 7756
- ససేర్ కాంగ్రీ............................ 7672
- స్కాంగ్ కాంగ్రీ........................... 7544
- సియా కాంగ్రీ.......................... 7422
- బదరీ నాథ్ శిఖరం (చుకాంబా)..... 7338
- త్రిశూల్ (పశ్చిమం).................... 7138
- సుంకున్................................ 7135
- పౌహున్రీ................................ 7128
- కాంగ్టో................................... 7090
- దూనగిరి................................ 7066