భారతదేశ పౌరుడు (ఆంగ్లం: Indian citizen: భారత రాజ్యాంగం, ప్రతి భారత పౌరునికి ఏక పౌరసత్వం ప్రసాదిస్తుంది. ఈ పౌరసత్వం యావత్‌భారతదేశానికి అన్వయిస్తుంది. భారత రాజ్యాంగంలోని రెండవభాగంలోని అధికరణ 5 నుండి 11 ఈ విషయాలన్నీ చట్టరూపంగా పొందుపరచబడినవి. పౌరసత్వ-చట్టం 1955, 1986, 1992 సవరణల చట్టాల ప్రకారం ఈ ప్రకటనలు ఇవ్వ బడినవి. పౌరసత్వ సవరణ చట్టం 2003, సవరణ ఆర్డినెన్స్ 2005. పౌరసత్వ సవరణా చట్టం 2003, జనవరి 7న భారత రాష్ట్రపతి చే ఆమోదింపబడి, డిసెంబరు 3 2004 నుండి అమలులోకి వచ్చింది. పౌరసత్వ సవరణ ఆర్డినెన్స్ 2005, భారత రాష్ట్రపతిచే అధికారికంగా ప్రకటింపబడి, జూన్ 28 2005 నుండి అమలులోకి వచ్చింది.పై సంస్కరణల ద్వారా, భారత పౌరసత్వ చట్టాలు "రక్త సంబంధ పౌరసత్వ హక్కు"గా పరిగణింప బడుతూ వస్తుంది.

భారత త్రివర్ణ పతాకం.

చట్టాలు

మార్చు

జన్మరీత్యా పౌరసత్వం

మార్చు

ఎవరైనా ఒక వ్యక్తి, జనవరి 26 1950 తరువాత,, 1986 చట్టం జూలై 1 1987 అమలులోకి రాక మునుపు జన్మించిన ఎడల అతనికి జన్మత॰ భారత పౌరునిగా గుర్తిస్తారు. జూలై 1 1987 తరువాత జన్మించిన వ్యక్తి, అతని తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు భారత పౌరసత్వం కలిగివుంటే, అతనిని భారత పౌరునిగా గుర్తిస్తారు. డిసెంబరు 3 2004 రోజుగాని, ఆతరువాత జన్మించిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ భారతపౌరులుగా వుండాలి, లేదా తల్లిదండ్రులలో ఒకరు భారతపౌరులైయుండి, ఇంకొకరు చట్టం దృష్టిలో చొరబాటుదారులు గాకుండా వుండాలి, అపుడే ఆవ్యక్తిని భారత పౌరునిగా గుర్తిస్తారు.

వంశపారపర్యంగా పౌరసత్వం

మార్చు

ఒక వ్యక్తి, 1950 జనవరి 26 రోజుగాని ఆతరువాత నుండి 1952 డిసెంబరు 10 మధ్యన భారతదేశం బయట, భారతపౌరులకు జన్మించిఉంటే, వారిని భారత పౌరులుగా గుర్తిస్తారు.

1952 డిసెంబర్ 10 రోజున లేదా తరువాత భారతదేశం బయట, తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు భారత పౌరులుగా వుంటే, అలాంటి వారికి ఆవ్యక్తి జన్మించియుంటే అతనిని భారత పౌరునిగా పరిగణిస్తారు.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

ఇవీ చూడండి

మార్చు