భారతదేశ విభజన సమయంలో మహిళలపై హింస
భారతదేశ విభజన సమయంలో మహిళలపై హింస ఎక్కువగా జరిగింది. విభజన సమయంలో 75,000 నుండి 100,000 మధ్య మహిళలు కిడ్నాప్ చేయబడి అత్యాచారానికి గురయ్యారని అంచనా.1947 మార్చి లో రావల్పిండి జిల్లాలో మహిళలపై హింస ప్రారంభమైంది. ఇక్కడ ముస్లిం గుంపులచే సిక్కు మహిళలును లక్ష్యంగా చేసుకొని హింసాకాండ వ్యవస్థీకృత జరిగింది. ఆ తర్వాత కిడ్నాప్‌కు గురైన మహిళలను స్వదేశానికి రప్పించేందుకు భారత్, పాకిస్థాన్‌లు కృషి చేసాయి. ముస్లిం మహిళలను పాకిస్థాన్‌కు, హిందూ, సిక్కు మహిళలను భారత్‌కు రప్పించారు.
హింస
మార్చుఇంతకుముందు జరిగిన అల్లర్లకు భిన్నంగా, కలకత్తాలో జరిగిన అల్లర్లలో మహిళలు బలి అయ్యారు. నోఖాలీ హింసాకాండలో చాలా మంది హిందూ మహిళలు కిడ్నాప్‌కు గురయ్యారు.పాట్నా జిల్లాలోనే వేలాది మంది కిడ్నాప్‌కు గురయ్యారు. బీహార్‌లో ముస్లిం మహిళలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.మహిళలపై హింస 1947 మార్చి లో రావల్పిండి జిల్లాలో ప్రారంభమైంది.ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ సిక్కు మహిళలను లక్ష్యంగా చేసుకొని అనేక హిందూ, సిక్కు గ్రామాలు పై ముస్లింలు దాడి చేశారు.భారీ సంఖ్యలో హిందువులు, సిక్కులు చంపబడ్డారు. బలవంతంగా వారిచే మతం మార్చించారు. పిల్లలను కిడ్నాప్ చేసారు. మహిళలను అపహరించి బహిరంగంగా అత్యాచారం చేసారు. చాలా మంది సిక్కు మహిళలు గౌరవాన్ని కాపాడుకోవడానికి మతం మారకుండా ఉండటానికి నీటి బావులలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.[1]
అపహరణల అంచనాలు
మార్చుఅపహరణకు గురైన మహిళల ఖచ్చితమైన గణాంకాలు తెలియవు. లియోనార్డ్ మోస్లీ ప్రకారం మొత్తం 100,000 మంది బాలికలు అన్ని వైపులా అపహరణకు గురయ్యారని రాసారు.పాకిస్తాన్‌లో 33,000 మంది హిందూ, సిక్కు మహిళలు ఉన్నారని భారత ప్రభుత్వం అంచనా వేసింది భారతదేశంలో 50,000 మంది ముస్లిం మహిళలు అపహరణకు గురైనట్లు పాకిస్తాన్ ప్రభుత్వం అంచనా వేసింది. [2] ఆండ్రూ మేజర్ అంచనా ప్రకారం విభజన అల్లర్ల సమయంలో పంజాబ్‌లో మొత్తం 45,000 మంది మహిళలు అపహరణకు గురయ్యారు.[3]
రికవరీల సంఖ్య
మార్చు1947 డిసెంబర్ 1949 డిసెంబర్ మధ్య, పాకిస్తాన్ నుండి 6000 మంది మహిళలను , భారతదేశం నుండి 12,000 మంది మహిళలను స్వాధీనం చేసుకున్నారు.ఎనిమిదేళ్ల కాలంలో 30,000 మంది మహిళలను రెండు ప్రభుత్వాలు స్వదేశానికి రప్పించాయి. 1949 జనవరి 21 తర్వాత, జమ్మూ కాశ్మీర్ నుండి 1,593 మంది ముస్లిమేతర మహిళలను స్వాధీనం చేసుకున్నారు.