భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్

భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్, వ్యవసాయ కార్మికుల సంఘం. భారత కమ్యునిస్ట్ పార్టీ తో రాజకీయ బంధం కలిగివుంది. కానీ కమ్యునిస్ట్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం అయిన  ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు గానీ లేదా రైతు సంఘం అయిన ఆల్ ఇండియా కిసాన్ సభ కు గానీ సంబంధం లేకుండా స్వతంత్రంగా వుంది.

షుమారు 5 శాతం మంది వ్యవసాయ కార్మికులు యూనియన్ లలో వున్నారు. వారిలో పనిచేస్తున్న సంఘాలలో భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్.ఒక ప్రధాన మయిన  సంస్థ.1989 నాటికీ ఈ సంస్థ సభ్యత్వం 25 లక్షల 90 వేలు. ఈ సంస్థ ప్రభావం  కేరళ ( కేరళ  రాష్ట్ర కర్షక తోజిలాలి ఫెడరేషన్ పేరు తో వుంది), పంజాబ్,బీహార్, వెస్ట్ బెంగాల్ , తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పేరు తో వుంది  ) , మధ్య ప్రదేశ్,  ఉత్తర ప్రదేశ్ లో వుంది.

Bbsrbkmu.JPG

తిరువనంతపురం లో 2002 జరిగిన సిపిఐ 18 కాంగ్రెస్ BKMU ను తిరిగి చాలా చురుకైన సంస్థ గా చేయడానికి, గ్రామీణ ప్రాంతాలలో పార్టీ ప్రభావం పెంచడం కోసం ప్రాధాన్యత ఇచ్చింది. చండీ ఘర్ లో జరిగిన 19 వ మహాసభ కు అందజేసిన నివేదికలో సంస్థ నిర్మాణానికి సంబంధించి కొంత అభివృద్ధి జరిగిందని, మరింత కృషి  జరగాల్సి వుందని అభిప్రాయ  పడింది. సంస్థ కు పూర్తి కాలం పనిచేసే కార్యకర్తల కొరత గురించి ఈ నివేదిక ప్రస్తావించింది.[1][2]

వ్యవసాయ కార్మికులకు ఉపాది కొరకు ప్రభుత్వ స్కీములు అమలు చేయాలని BKMU డిమాండ్ చేస్తోంది. భూస్వాముల భూముల ఆక్రమణ కు, నిరుపేద రైతులకు, కూలీలకు పంచడానికి BKMU ఆంధ్ర ప్రదేశ్ లో కమ్యునిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) కి చెందిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం తో చేతులు కలిపింది.

BKMU ప్రధాన కార్యదర్శి రాజ్య సభ సభ్యుడైన నాగేంద్ర నాథ్ ఓజా. BKMU జాతీయ అధ్యక్షుడు లోక సభ సభ్యుడు అయిన భాన్ సింగ్ భవురా 2004 జనవరి ౩ న మరణించారు. 

మూలాలు:సవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-03-11. Retrieved 2018-05-05.
  2. Archived copy. URL accessed on 2006-04-10.