భారతీయ పాకశాస్త్ర విద్యా సంస్థ

ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్, తిరుపతి (ఐసిఐ-తిరుపతి) ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉంది.[1] భారతీయ పర్యాటక మంత్రిత్వ శాఖచే స్థాపించబడిన మొదటి పాకశాస్త్ర సంస్థ. మొదటగా ఈ సంస్థను అలిపిరిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (SIHM) ప్రాంగణంలోని తాత్కాలిక క్యాంపస్‌లో 2016–17 విద్యా సంవత్సరంలో తరగతులను ప్రారంభించారు.[2] ఐజిఎన్‌టియు-అమర్‌కంటక్‌తో అనుబంధంగా మూడు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ క్యులినరీ ఆర్ట్ (బిబిఎ - క్యులినరీ) కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జెఇఇ) ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్‌లు జరుగుతాయి. 2018లో, ఇన్‌స్టిట్యూట్ తిరుపతి విమానాశ్రయానికి సమీపంలో ఉన్న సొంత క్యాంపస్‌కు మార్చబడింది.2018 సెప్టెంబర్ 24వ తేదీన అప్పటి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించారు.[3] 2019–20 విద్యా సంవత్సరం నుండి 2 సంవత్సరాల MBA ప్రోగ్రామ్‌ను (MBA ఇన్ కలినరీ ఆర్ట్స్) ప్రారంభించింది.

భారతీయ పాకశాస్త్ర విద్యాసంస్థ

మూలాలు

మార్చు
  1. "Indian Culinary Institute". www.icitirupati.in. Retrieved 2023-05-26.
  2. "Indian Culinary Institute ready for inauguration". The Hindu (in Indian English). 2018-08-12. ISSN 0971-751X. Retrieved 2023-05-26.
  3. "తిరుమలలో వెంకయ్యనాయుడు..పాకశాస్త్ర సంస్థ ప్రారంభం". News18 Telugu. 2018-09-24. Retrieved 2023-05-26.