భారతీయ మహాశిల్పము

భారతీయ మహాశిల్పము స్వర్ణ సుబ్రహ్మణ్య కవి (1901-1983) రచించిన శిల్పకళకు సంబంధించిన విశేష గ్రంథము. దీనికి సంబంధించిన మొత్తం 16 భాగాలలోను 1, 2, 3 భాగాల్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయముతో 1942 ముద్రించారు.

భారతీయ శిల్పకళ క్రీస్తు పూర్వం నాటి సింధులోయ నాగరికత నుంచి వైవిధ్యభరితంగా మారుతూ విశిష్టతను నిలుపుకుంటూ కొనసాగింది. అశోకుని కాలంలో బుద్ధుని విగ్రహాలు, ఆయన జీవిత ఘట్టాలు వంటివి విలక్షణమైన శిల్ప సంపద పెరిగింది. ఆపైన గ్రీసు శిల్పశైలి ప్రభావంతో కొంత మారినా శాతవాహనుల పాలనలోని దాక్షిణాత్య సామ్రాజ్యంలో ప్రత్యేక ముద్ర కనబరిచింది. అనంతర కాలంలో దక్షిణ భారతదేశంలో బృహత్ ఆలయాలు, వాటిలో హైందవశిల్పకళ సుప్రఖ్యాతి పొందేలా ఏర్పడింది. వేలయేళ్ల కాలం నుంచీ ఈ శిల్పకళాసంపద కొనసాగుతూ వచ్చింది. ఇంతటి వైవిధ్యభరితమైన శిల్పశైలులను శాస్త్రీయం చేస్తూ ఈ గ్రంథంలోని పలు విశేషాలు రచించారు. లలిత కళలన్నిటితో పోల్చితే ఇటీవలి శతాబ్దాల తెలుగు సాహిత్యంలో శిల్పకళ, శిల్పశాస్త్రాలపై సాహిత్యసృష్టి అరుదుగానే జరిగింది. ఈ క్రమంలో సంపద్వంతమూ, అపురూపమూ ఐన విషయ పరిజ్ఞానంతో ఈ గ్రంథం రూపొందింది.

మూలాలు

మార్చు