భారతీయ రూపాయి చిహ్నం
భారతీయ రూపాయి 2010 లో ఒక చిహ్నాన్ని (₹) సంతరించుకుంది. యూనికోడ్ భాషలో అది U+20B9. HTML భాషలో "&#x 20B9;" మధ్యలో ఖాళీ లేకుండా రాస్తే గుర్తు ( ₹ ) కనబడుతుంది. ఈ చిహ్నం డిజైనును 2010 జూలై 15 నాడు భారతదేశ ప్రభుత్వం ప్రజలకు పరిచయం చేసింది. ఈ చిహ్నం చూడటానికి దేవనాగరి లిపిలోని "र" (ర), ఆంగ్ల భాష అక్షరం "R" (ఆర్) కలగలిపినట్లు వుంటుంది.
2009 వ సంవత్సరంలో రూపాయికి చిహ్నం సమకూర్చేందుకు గాను ఒక పోటీని భారత ప్రభుత్వం నిర్వహించింది. [1] 3,331 ఎంపికల నుండి 5 చిహ్నాలు ఎంపిక చేయబడ్డాయి. వీటిలో నుంచి ఐఐటి గౌహతికి చెందిన డి. ఉదయ్‌కుమార్ సమర్పించిన చిహ్నాన్ని మంత్రివర్గం ఎంపికచేసింది. మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి పెద్ద పెద్ద గణణ యంత్ర (కంప్యూటర్) పరిశ్రమలు ఈ రూపాయి చిహ్నాన్ని కంప్యూటర్ లో ముద్రించేందుకు వీలుగా సాఫ్ట్ వేర్లు తయారు చేశాయి.
చరిత్ర
మార్చు2009 మార్చి 5న భారత ప్రభుత్వం రూపాయి గుర్తు సృష్టించటానికి పోటీ ప్రకటించింది.[1]. 2010 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదిత గుర్తు భారతీయ సంస్కృతి, మూలాలను ప్రతిబింబించాలని అన్నాడు[2]. 3,331 ప్రతిపాదనలు రాగా, వాటిలో ఐదు గుర్తులతో పొట్టిజాబితాలోకి తీసుకొనబడ్డాయి.[3]
అవి నొందితా కొర్రియా మెహ్రోత్రా, హితేష్ పద్మశాలి, షిబిన్ కెకె, షారుఖ్ జె ఇరానీ, డి ఉదయకుమార్ ప్రతిపాదించినవి.[4][3]. వాటినుండి ఒకటి 2010 జూన్ 4న కేంద్రమంత్రివర్గం సమావేశంలో ఎంపిక చేద్దామనుకున్నారు[5]. కాని ఆర్థికమంత్రి అభ్యర్థన మేరకు వాయిదా వేశారు[6]. 2010 జులై 15న నాటి సమావేశంలో ఐఐటి గౌహతిలో ఉపాచార్యులుగా పనిచేస్తున్న ఉదయ కుమార్ ప్రతిపాదన గెలుపొందినట్లుగా ప్రకటించారు[7].[8]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 https://web.archive.org/web/20130531034323/http://finmin.nic.in/the_ministry/dept_eco_affairs/currency_coinage/Comp_Design.pdf
- ↑ "Cabinet defers decision on rupee symbol". Sify Finance. 24 June 2010. Retrieved 10 July 2010.
- ↑ 3.0 3.1 "List of Five Entries which have been selected for Final". Ministry of Finance, Govt of India. Archived from the original on 11 జూలై 2010. Retrieved 13 ఆగస్టు 2019.
- ↑ "Rupee: Which of the 5 final designs do you like?". Rediff Business. 16 June 2010. Retrieved 26 July 2010.
- ↑ "Rupee to get a symbol today!". Money Control.com. 26 February 2010. Retrieved 10 July 2010.
- ↑ "Cabinet defers decision on rupee symbol". PTI. 24 June 2010. Archived from the original on 27 జూన్ 2010. Retrieved 10 July 2010.
- ↑ "Cabinet approves new rupee symbol". Times of India. 15 July 2010. Retrieved 15 July 2010.
- ↑ "Department of design/ faculty". Iitg.ernet.in.