భారతీయ రూపాయి చిహ్నము

భారత రూపాయి చిహ్నము

భారతీయ రూపాయి 2010 లో ఒక చిహ్నాన్ని (INR) సంతరించుకుంది. యూనికోడ్ భాషలో అది U+20B9. HTML భాషలో "&#x 20B9;" మధ్యలో ఖాళీ లేకుండా రాస్తే గుర్తు ( ₹ )కనబడుతుంది. ఈ చిహ్నం యొక్క డిజైనును 2010 జూలై 15 నాడు భారతదేశ ప్రభుత్వం ప్రజలకు పరిచయం చేసింది. ఈ చిహ్నం చూడటానికి దేవనాగరి లిపి యొక్క "र" (ర), ఆంగ్ల భాష యొక్క అక్షరం "R" (ఆర్) కలగలిపినట్లు వుంటుంది. 2009 వ సంవత్సరములో రూపాయికి చిహ్నం సమకూర్చేందుకు గాను ఒక పోటీని భారత ప్రభుత్వం నిర్వహించింది. 3,331 ఎంపికల నుండి 5 చిహ్నాలు ఎంపిక చేయబడ్డాయి. వీటిలో నుంచి ఐఐటి గౌహతికి చెందిన డి.ఉదయ్ కుమార్ సమర్పించిన చిహ్నాన్ని మంత్రివర్గం ఎన్నుకుంది.

మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి పెద్ద పెద్ద గణణ యంత్ర (కంప్యూటర్) పరిశ్రమలు ఈ రూపాయి చిహ్నాన్ని కంప్యూటర్ లో ముద్రించేందుకు వీలుగా సాఫ్ట్ వేర్లు తయారు చేశాయి.

చరిత్రసవరించు

5 మార్చి 2009 న భారత ప్రభుత్వం రూపాయి గుర్తు సృష్టించటానికి పోటీ ప్రకటించింది[1][2]. 2010 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదిత గుర్తు భారతీయ సంస్కృతి, మూలాలను ప్రతిబింబించాలని అన్నాడు[3]. 3,331 ప్రతిపాదనలు రాగా, వాటిలో ఐదు గుర్తులతో పొట్టిజాబితాలోకి తీసుకొనబడ్డాయి[4]. అవి నొందితా కొర్రియా మెహ్రోత్రా, హితేష్ పద్మశాలి, షిబిన్ కెకె, షారుఖ్ జె ఇరానీ, డి ఉదయకుమార్ ప్రతిపాదించనవి[5][4]. వాటినుండి ఒకటి 4 జూన్ 2010 కేంద్రమంత్రివర్గం సమావేశం లో ఎంపిక చేద్దామనుకున్నారు[6]. కాని ఆర్థికమంత్రి అభ్యర్థన మేరకు వాయిదా వేశారు[7]. 15 జులై 2010 నాటి సమావేశంలో ఐఐటి గౌహతిలో ఉపాచార్యులు గా పనిచేస్తున్న ఉదయ కుమార్ ప్రతిపాదన గెలుపొందినట్లుగా ప్రకటించారు[8][9].

మూలాలుసవరించు

  1. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 31 May 2013.CS1 maint: archived copy as title (link) COMPETITION FOR DESIGN
  2. "India seeks global symbol for rupee". Hindustan Times. 6 March 2009. Retrieved 7 March 2009.
  3. "Cabinet defers decision on rupee symbol". Sify Finance. 24 June 2010. Retrieved 10 July 2010.
  4. 4.0 4.1 "List of Five Entries which have been selected for Final". Ministry of Finance, Govt of India. Archived from the original on 11 July 2010. Retrieved 15 July 2010.
  5. "Rupee: Which of the 5 final designs do you like?". Rediff Business. 16 June 2010. Retrieved 26 July 2010.
  6. "Rupee to get a symbol today!". Money Control.com. 26 February 2010. Retrieved 10 July 2010.
  7. "Cabinet defers decision on rupee symbol". PTI. 24 June 2010. Retrieved 10 July 2010.
  8. "Cabinet approves new rupee symbol". Times of India. 15 July 2010. Retrieved 15 July 2010.
  9. "Department of design/ faculty". Iitg.ernet.in.