భారత ఆహార సంస్థ
భారత ఆహార సంస్థ (Food Corporation of India లేదా FCI) భారత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. దీని ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది. ప్రాంతీయ కార్యాలయాలు రాష్ట్ర రాజధానుల్లో ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు కూడా ఉన్నాయి. దీనికి ముఖ్య అధికారి ఛైర్మన్.
దస్త్రం:Food Corporation of India.svg | |
రకం | ప్రభుత్వ సంస్థ |
---|---|
పరిశ్రమ | ప్రభుత్వ రంగ సంస్థ |
స్థాపన | 1965 |
స్థాపకుడు | భారత ప్రభుత్వం |
ప్రధాన కార్యాలయం | ఢిల్లీ , భారతదేశం |
Number of locations | అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు |
సేవ చేసే ప్రాంతము | భారతదేశమంతటా |
కీలక వ్యక్తులు | డి. వి. ప్రసాద్, ఐ. ఎ. ఎస్ (ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్) [1] |
ఉత్పత్తులు | ప్రధానంగా గోధుమలు, వరి |
సేవలు | ప్రభుత్వ విధానాల అమలు, దేశానికి ఆహార భద్రత కల్పించడం |
యజమాని | భారత ప్రభుత్వం |
ఉద్యోగుల సంఖ్య | మంజూరయినవి:- 42038 ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య:- 23221 (మార్చి 31 2017 నాటికి) |
మాతృ సంస్థ | Department of Food and Public Distribution under Ministry of Consumer Affairs, Food and Public Distribution, Govt. of India |
వెబ్‌సైట్ | www |
Footnotes / references It pays through IDA pattern not in CDA |
చరిత్ర
మార్చుఈ సంస్థను ఫుడ్ కార్పొరేషన్ చట్టం ద్వారా 1964లో స్థాపించారు.[2][3] దీని మొట్ట మొదటి ప్రధాన కార్యాలయం చెన్నై. తర్వాత ఇది ఢిల్లీకి మార్చబడింది.[4] ప్రాంతీయ కార్యాలయాలు రాష్ట్ర రాజధానుల్లో ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు కూడా ఉన్నాయి.
లక్ష్యాలు
మార్చుఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు.[4]
- ఆహార ధాన్యాలు కొనడం, రవాణా చేయడం, భద్ర పరచడం, సరఫరా చేయడం, అమ్మడం
- ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం
- ఆహార శుద్ధికి రైస్ మిల్లులు, పిండి మిల్లులు లాంటి వాటిని స్థాపించడానికి సహాయం చేయడం
రైతులకు మద్ధతు ధర అందించడం దీని లక్ష్యాల్లో ఒకటి.[5] భారత ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకానికి భారత ఆహార సంస్థ ధాన్యం సరఫరా చేస్తుంది. ఇందుకు గాను కేంద్ర విద్యాశాఖ ఈ సంస్థకు పైకం చెల్లిస్తుంది.[6]
మూలాలు
మార్చు- ↑ "D.V. Prasad appointed CMD of Food Corporation of India". thehindu.
- ↑ Acts Of Parliament. New Delhi: Government of India Press Delhi. 1966. p. 300.
- ↑ "About Us - Food Corporation of India". Food Corporation of India.
- ↑ 4.0 4.1 Ghodke, N. B. (1985). Encyclopaedic Dictionary of Economics. Delhi: Mittal Publications. p. 467.
- ↑ Chopra, R. N (1984). Green Revolution In India. Delhi: Intellectual Publishing House. p. 37.
- ↑ Fahimuddin (2000). National Programme Of Nutritional Support To Primary Education (mid-day Meals). Lucknow: Giri Institute Of Development Studies Lucknow. p. 11.