భారత జాతీయ గ్రంథాలయం
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లేక భారత జాతీయ గ్రంథాలయం (Bengali: ভারতের জাতীয় গ্রন্থাগার) అనేది అలీపూర్, కోలకతా లోని బెల్వెడెరే ఎస్టేట్ లో కలదు,[1] ఇది వాల్యూమ్ పరంగా, భారతదేశం యొక్క ప్రజా రికార్డు గ్రంథాలయంగా భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం.[2][3][4] ఇది భారత ప్రభుత్వం యొక్క సంస్కృతి శాఖ, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఉంది. ఈ గ్రంథాలయం ప్రముఖ గ్రంథాల సేకరణకు, పుస్తక పంపిణీకి, భారతదేశంలో ముద్రించబడిన అమూల్య గ్రంథాల సంరక్షణకు ఉద్దేశించబడింది. ఈ గ్రంథాలయం సుందరమైన 30 ఎకరాల (120,000 m²) బెల్వెడెరే ఎస్టేట్ లో కలదు. ఇది 2.2 మిలియన్ల పుస్తకాల కంటే ఎక్కువ సేకరణతో భారతదేశంలో అతి పెద్దదిగా ఉంది.[5] స్వాతంత్ర్యం రావడానికి ముందు ఇది బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసంగా ఉండేది.
చరిత్ర
మార్చుకలకత్తా పబ్లిక్ లైబ్రరీ 1836 మార్చి 21 న ప్రారంభించింది. ఎటువంటి జాతీయతలతో సంబంధం లేకుండా, అందరికీ అందుబాటులో ఉన్న రిఫరెన్స్, పుస్తకములు పాఠకులకు ( రుసుముతో ఇవ్వడం ) గ్రంథాలయం స్థాపించబడింది. కలకత్తా పబ్లిక్ లైబ్రరీ తరువాత ఇంపీరియల్ లైబ్రరీలో విలీనం చేయబడింది, అనేక సెక్రటేరియట్ గ్రంథాలయాల సేకరణను మిళితం చేసి, ఇంపీరియల్ లైబ్రరీని 1903 జనవరిలో ప్రజల కోసం తెరిచారు.భారత స్వాతంత్ర్యం తరువాత, 1948 లో " ఇంపీరియల్ లైబ్రరీ (పేరు మార్పు) చట్టం " ద్వారా ఇంపీరియల్ లైబ్రరీ స్థానంలో జాతీయ గ్రంథాలయం ఉనికిలోకి వచ్చింది. భారత రాజ్యాంగం యూనియన్ జాబితాలోని 7 వ షెడ్యూల్ లోని ఆర్టికల్ 62 లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థకు ప్రత్యేక హోదా ఇవ్వబడింది, అప్పటి కేంద్ర విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1953 ఫిబ్రవరి 1 న గ్రంథాలయాన్ని ప్రజల కోసం ప్రారంభించారు[6].
ఇంపీరియల్ లైబ్రరీ
మార్చు1891 సంవత్సరంలో ఇంపీరియల్ లైబ్రరీ అనేక సెక్రటేరియట్ గ్రంథాలయాలను కలపడం ద్వారా స్థాపించబడింది. వీటిలో ముఖ్యమైనది హోం శాఖ వారి గ్రంథాలయం. గతంలో ఈస్ట్ ఇండియా కాలేజ్, ఫోర్ట్ విలియం, లండన్ లోని ఈస్ట్ ఇండియా బోర్డు గ్రంథాలయాలకు చెందిన అనేక పుస్తకాలను కలిగి, గ్రంథాలయం ఉపయోగం ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే పరిమితం చేయబడింది.
20వ శతాబ్దం తొలినాళ్ళలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న లార్డ్ కర్జన్ ప్రజల ఉపయోగం కోసం కలకత్తాలో ఒక గ్రంథాలయాన్ని తెరవాలనే ఆలోచనతో, ఇంపీరియల్ లైబ్రరీ, కలకత్తా పబ్లిక్ లైబ్రరీలు పరిమిత కొందరికి మాత్రమే అందుబాటులో ఉండటం, సౌకర్యాలులేక పోవడం వల్ల ఆశించిన విధంగా వాటి ఉపయోగించబడటం లేదని గ్రహించాడు. కొన్ని షరతులకు లోబడి కలకత్తా పబ్లిక్ లైబ్రరీ సేకరణను ఇంపీరియల్ లైబ్రరీలో విలీనం చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు.
ఇంపీరియల్ లైబ్రరీ అని పిలువబడే కొత్త గ్రంథాలయం 1903 జనవరి 30 న కోల్ కాతా మెట్కాఫ్ హాల్లో ప్రజల కోసం అధికారికంగా ప్రారంభించబడింది. ఇంపీరియల్ లైబ్రరీ లక్ష్యాలు, ఉద్దేశాలు భారత గెజిట్ లోని ఒక నోటిఫికేషన్ లో గా ఈ విధంగా నిర్వచించబడ్డాయి ' రిఫరెన్స్ లైబ్రరీగా, విద్యార్థులకు పనిచేసే ప్రదేశంగా, భారతదేశ భవిష్యత్ చరిత్రకారులకు మెటీరియల్ రిపోజిటరీగా ఉండాలని ఉద్దేశించబడింది, ఇందులో సాధ్యమైనంత వరకు భారతదేశం గురించి రాసిన ప్రతి రచనా ఉంది. అందరూ ఎప్పుడైనా చూడొచ్చు, చదవొచ్చు.'
లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం అసిస్టెంట్ లైబ్రేరియన్ అయిన జాన్ మక్ ఫర్లేన్ ను ఇంపీరియల్ లైబ్రరీకి మొదటి లైబ్రేరియన్ గా నియమించారు. ఆయన మరణం తరువాత బహుభాషా పండితుడు హరినాథ్ డే గ్రంథాలయం బాధ్యతలు స్వీకరించాడు. 1911సంవత్సరం లో జె.ఎ. చాప్మన్ అతని స్థానంలో వచ్చాడు. చాప్మన్ పదవీకాలంలో, గ్రంథాలయం అభివృద్ధి జరిగింది. తరువాత, ఖాన్ బహదూర్ ఎం.ఎ.అసదుల్లా లైబ్రేరియన్ గా నియమించబడ్డాడు, అతను జూలై 1947 వరకు పదవిలో కొనసాగాడు.
ఇంపీరియల్ లైబ్రరీని స్వాధీనం చేసుకునే విధానాన్ని లార్డ్ కర్జన్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, "గ్రంథాలయం లో భారతదేశం గురించి ప్రసిద్ధ భాషలలో వ్రాయబడిన అన్ని పుస్తకాలను కలిగి ఉండాలి, ప్రామాణిక రచనలతో మంచి సర్వతోముఖ గ్రంథాలయంగా మార్చడానికి అవసరమైన వాటిని చేర్చాలీ" అని వివరించాడు[7]
విధులు
మార్చుకేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లోని ( సాంస్కృతిక విభాగం ఆధ్వర్యం లో ) నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం పుస్తకాలు, పత్రాలలో 2.2 మిలియన్ల శీర్షికలను కలిగి ఉంది. 1954 నాటి పుస్తకాలు, వార్తాపత్రికల డెలివరీ చట్టం ప్రకారం భారతదేశంలో ప్రచురించబడిన లేదా భారతీయులు రాసిన లేదా భారత పౌరులకు ఆసక్తి ఉన్న ఏదైనా సమాచారాన్ని సేకరించడం గ్రంథాలయం విధులలో ముఖ్యమైనది,వాటిని లైబ్రరీలో శాశ్వతంగా నిల్వ చేయాలి (రిపోజిటరీ) చేయవలెను. పబ్లిక్ రికార్డ్స్ లైబ్రరీగా ప్రభుత్వ అధికారిక పత్రాలన్నింటినీ క్రమబద్ధంగాసంరక్షించడం భారత జాతీయ గ్రంథాలయం విధులలో ఒకటి.[8]
పుస్తకాల సేకరణ
మార్చుభారత జాతీయ గ్రంథాలయంలోని పుస్తకాల సేకరణను ప్రత్యేక భాషా విభాగాలు నిర్వహిస్తాయి. భారతీయ భాషల కోసం ఒక ప్రత్యేక విభాగం ఉంది, ఇది ప్రతి భాష ప్రకారం అస్సామీ,బెంగాలీ, హిందీ, కన్నడ,కాశ్మీరీ, మలయాళం, మరాఠీ,ఒరియా,పంజాబీ,,సంస్కృతం ,సింధీ, తమిళం,తెలుగు,ఉర్దూ భాగాలుగా విభజించబడుతుంది. ఈ వ్యక్తిగత విభాగాలు ఆయా భాషల సాహిత్యాలన్నింటికీ బాధ్యత వహిస్తాయి. ప్రింట్ మీడియా భారతీయ ప్రచురణకర్తలందరూ ప్రతి ప్రచురణను 1954 నాటి పుస్తకాలు, వార్తాపత్రికల పంపిణీ చట్టం ప్రకారం జాబితా చేసి నిల్వ చేయమని నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాకు పంపుతారు[8].
ఆధునీకరణ-డిజిటైజేషన్
మార్చుగ్రంథాలయ నియంత్రణ కార్యకలాపాల కోసం ఉపయోగించే RDBMS సాఫ్ట్ వేర్ తో లైబ్రరీ ఆధునీకరణను నిర్వహించడానికి కంప్యూటర్ విభాగం 1988 సంవత్సరంలో చేసింది సృష్టించబడింది. 2001సంవత్సరంలో లైబ్రరీ క్లయింట్-సర్వర్ తో, ప్రస్తుతం క్యాంపస్ వైడ్ నెట్ వర్క్ అభివృద్ధి చేయబడుతోంది.విలువైన,అరుదైన, సున్నితమైన పుస్తకాలను,ఇతర పత్రాల డిజిటల్ ఆర్కైవింగ్ పురోగతిలో ఉంది. 1900కు ముందు ప్రచురితమైన ఆంగ్ల పుస్తకాలు, డాక్యుమెంట్లు, 1920కు ముందు భారతీయ ప్రచురణలు డిజిటలైజేషన్ కు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఎంపిక చేసిన 9140 పుస్తకాలలో 3,20,000 పేజీలకు పైగా డిజిటల్ ఆర్కైవ్ చేయబడ్డాయి[8].
గ్రంథాలయ సేవలు
మార్చుఈ గ్రంథాలయం సంవత్సరంలో 362 రోజులు పాఠకులకు సేవలు అందిస్తుంది. జాతీయ సెలవు దినాలలో మూసివేయబడుతుంది[6].
- చదవడం, రిఫరెన్స్, గ్రంథసూచిక సేవలతో పాటు, పుస్తకాలు సెక్యూరిటీ డిపాజిట్ తో పాఠకులకు అందుబాటులో ఉంటాయి.
- ఇంటర్ లైబ్రరీ సౌకర్యం ఉన్నది.
- రీడర్స్ అవేర్ నెస్ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ కేటలాగ్ సర్వీస్, డాక్యుమెంట్ డెలివరీ సర్వీస్, బిబ్లియోగ్రాఫిక్ సర్వీస్, రిఫరెన్స్ సర్వీస్.
- ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ డెలివరీ సర్వీస్, ఈ-జర్నల్స్ కొరకు ఈ-డైరెక్టరీ
- లైబ్రరీలో మైక్రోఫిల్మ్/మైక్రోఫిచ్ రీడింగ్ సదుపాయాలు కల్పించబడ్డాయి.
- చెల్లింపు ప్రాతిపదికపై లైబ్రరీ స్టాక్ లోని ప్రచురణల నుండి పాఠకులకు ఫోటోకాపీ అందించబడుతుంది
- గ్రంథాలయాలకు, లైబ్రేరియన్లకు చెల్లింపు సేవలతో కన్సల్టెన్సీ, శిక్షణ సేవలు అందించబడతాయి.
- లైబ్రరీ గంటల సమయంలో సభ్యులందరికీ ఇంటర్నెట్ ఉపయోగం అనుమతించబడుతుంది.
చిత్రమాలిక
మార్చు-
భారత జాతీయ గ్రంథాలయం
మూలాలు
మార్చు- ↑ "Useful Information". National Library.
- ↑ http://www.thecolorsofindia.com/interesting-facts/miscellaneous/largest-library-in-india.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-26. Retrieved 2015-01-03.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-07. Retrieved 2015-01-03.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-07. Retrieved 2015-01-03.
- ↑ 6.0 6.1 "National Library of India | Ministry of Culture, Government of India". www.indiaculture.gov.in. Retrieved 2023-01-09.
- ↑ "National Library". www.nationallibrary.gov.in. Retrieved 2023-01-09.
- ↑ 8.0 8.1 8.2 "About National Library of India". www.indiamapped.com. Archived from the original on 2023-01-09. Retrieved 2023-01-09.