భారత జాతీయ మానవ హక్కుల కమిషన్

భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993లో భారత పార్లమెంటు మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 1993 అక్టోబర్ 12న ఏర్పడింది. ఈ కమిషన్ రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా ప్రజలకు కల్పించిన హక్కుల రక్షణ భాద్యతలు చేపడుతుంది.[1]

జాతీయ మానవ హక్కుల కమిషన్
భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ లోగో
నినాదం సర్వే భవంతు సుఖినా
అందరు సంతోషంగా ఉండాలి
Agency overview
Formed 12 అక్టోబర్ 1993
Legal personality Governmental: Government agency
Jurisdictional structure
Federal agency [[ భారతదేశం]]
General nature
Operational structure
Headquarters సర్దార్ పటేల్ భవన్, న్యూఢిల్లీ, భారతదేశం
Agency executive అరుణ్‌ కుమార్ మిశ్రా, చైర్‌పర్సన్‌
Website
అధికారిక వెబ్‌సైటు

దేశంలోని ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా బతికే హక్కు ఉందని, అతని హక్కులకు భంగం కలిగించినా, అన్యాయంగా ఎన్ కౌంటర్ ల పేరిట చంపినా ప్రశ్నించేందుకు రాజ్యాంగం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తప్పు చేసిన ఏ వ్యక్తినైనా చట్టపరంగానే శిక్షించాలి కానీ చట్టాన్ని తీసుకుని ఏ విధమైన చర్యలు పాల్పడరాదు. అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారిస్తుంది.

నిర్మాణం సవరించు

జాతీయ మానవ హక్కుల కమిషన్ బహుళ సభ్య సంస్థ. దీనిలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు. చైర్మన్ గా నియమితులయ్యే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినవారై ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారు ఒక సభ్యుడిగా ఉంటారు. మరో సభ్యుడు ఏదైనా హైకోర్టు నుంచి న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి. మిగిలిన ఇద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్నవారై ఉండాలి. పై సభ్యులతో పాటు మరో నలుగురు పదవి రీత్యా సభ్యులుగా ఉంటారు.[2]

నియామకం సవరించు

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. వీరి నియామకంలో ప్రధాన మంత్రి అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీ సలహా ఇస్తుంది.

  1. భారత ప్రధాన మంత్రి (చైర్మన్)
  2. కేంద్ర హోంశాఖ మంత్రి
  3. లోకసభ స్పీకర్
  4. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
  5. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు
  6. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు

పదవీకాలం, తొలగింపు సవరించు

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు. ఏది ముందైతే అది వర్తిస్తుంది. కమిషన్ చైర్మన్, సభ్యులను తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.

విధులు సవరించు

  1. మానవ హక్కులను పరిరక్షించడం
  2. జైళ్లలో ఉన్న ఖైదీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని మార్గదర్శకాలు ఇవ్వడం
  3. మానవ హక్కుల రంగంలో పరిశోధన చేపట్టడం
  4. ప్రజలకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పించడం
  5. కమిషన్‌కు సంవత్సరం కంటే ముందు జరిగిన విషయాలన విచారించే అధికారం లేదు

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు సవరించు

నెం. ఫోటో పేరు పదవి కాలం
1.   జస్టిస్ రంగనాథ్ మిశ్రా 12 అక్టోబర్ 1993 24 నవంబర్ 1996
2.   జస్టిస్ ఎం.ఎన్. వెంకట చలయ్య 26 నవంబర్ 1996 24 అక్టోబర్ 1999
3.   జస్టిస్ జేఎస్. వర్మ 4 నవంబర్ 1999 17 జనవరి 2003
4.   జస్టిస్ ఏ.ఎస్. ఆనంద్ 17 ఫిబ్రవరి 2003 31 అక్టోబర్ 2006
-   జస్టిస్ శివరాజ్ పాటిల్
ఆపద్ధర్మ చైర్మన్
1 నవంబర్ 2006 1 ఏప్రిల్ 2007
5.   జస్టిస్ రాజేంద్ర బాబు 2 ఏప్రిల్ 2007 31 మే 2009
-   జస్టిస్ గోవింద్ మాథుర్
ఆపద్ధర్మ చైర్మన్
1 జూన్ 2009 6 జూన్ 2010
6.   జస్టిస్ కే.జి. బాలకృష్ణన్ 7 జూన్ 2010 11 మే 2015
-   జస్టిస్ సీరియాక్ జోసెఫ్
ఆపద్ధర్మ చైర్మన్
11 మే 2015 28 ఫిబ్రవరి 2016
7.   జస్టిస్ హెచ్.ఎల్ దత్తు 29 ఫిబ్రవరి 2016 2 డిసెంబర్ 2020
  జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్
ఆపద్ధర్మ చైర్మన్
2 May 2021[3] 1 June 2021
8.   జస్టిస్ అరుణ్‌ కుమార్ మిశ్రా [4][5] 2 జూన్ 2021 ప్రస్తుతం

మూలాలు సవరించు

  1. V6 Velugu (14 December 2019). "హక్కుల రక్షణకు ఎన్ హెచ్ ఆర్ సీ NHRC for the protection of rights". Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
  2. Nava Telangana (31 January 2020). "జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులను ఎవరు నియమిస్తారు? | దీపిక | www.NavaTelangana.com". Archived from the original on 4 ఫిబ్రవరి 2020. Retrieved 24 August 2021.
  3. "Justice Pant appointed NHRC acting chairperson". The Hindu. 3 May 2021. Retrieved 4 May 2021.
  4. Namasthe Telangana (2 June 2021). "ఎన్ హెచ్ ఆర్ సీ చైర్ పర్సన్ గా అరుణ్ మిశ్రా". Namasthe Telangana. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.
  5. Namasthe Telangana (2 June 2021). "ఎన్ హెచ్ఆర్ సీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ జస్టిస్ అరుణ్ మిశ్రా". Namasthe Telangana. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.