భారత పౌరసత్వ సవరణ చట్టం
పౌరసత్వ సవరణ బిల్లు (ఆంగ్లము:సిఏబి)
ఇది 1955 పౌరసత్వ చట్టము నకు సవరణ తేవడానికి ఉద్దేశించిన బిల్లు. దీనిప్రకారము పాకిస్తాను, బాంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ ల నుండి భారత దేశానికి వలస వచ్చే ’ముస్లిమేతరలకు ’పౌరసత్వము ఇవ్వడానికి ఉద్దేసించినది.[1]
ఆయా దేశాలలో మతపరమైన దాడుల నుండి తప్పించుకోవడానికి దేశములోనికి వచ్చేవారికనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం మని ప్రవేశ పెడుతున్న అధికార పార్టీ వివరణ .
చరిత్ర
మార్చుభారత రాజ్యాంగ ఆర్టికల్స్ 5 నుండి 9 వరకూ అనగా రాజ్యాంగ రెండవ విభాగము నుండి పౌరుని గా ఎవరిని గుర్తిస్తారో తెలియ జేస్తుంది.ఇక్కడ పుట్టిన వారు, వారి వారసులు, నమోదు కాబడీన వారు,సహజం గా ఉన్నవారు ,వీటి వివరణ 1955 పౌరసత్వ చట్టం ద్వారా ఇవ్వబడింది. పద్నాలుగు సంవత్సరాలుగా ఈ గడ్డపై నివసించాలి, దానిలో పన్నెండూ సమ్వత్సరాలు పూర్తిగా ఈ దేశము లో నివసించి ఉండాలి. గడచిన ఎనిమిది సంవత్సరాలలో ఆరు సంవత్సరాలు ఈ దేశములో నివసించి , పౌరసత్వానికి ధరఖాస్తు చేస్తున్నప్పుడు ఒక సమ్వత్సరకాలంగా ఇక్కడే నివసిస్తూ ఉండాలి. ఒక శరణార్ధి ని అక్రమ వలస గా గుర్తిస్తే పై రెండు పద్ధతుల ద్వారా కూడా పౌరుడవ్వడనికి ఒప్పుకోరు.ఆఖరుకి పస్ పోర్టు చట్టం , విదేశీ చట్టం కూడా ఒప్పుకోవు. అక్రమ వలస కు శిక్శ్ఃఅ గా జైలు కాని లేదా తిరిగి పంపించేయడం జరుగుతుంది.
ఈ పౌరసత్వ చట్టం ఇప్పటికి ఐదు సార్లు సవరించారు. 1986,1992,2003,2005 2015 వీటిలో మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో, రెండూ సార్లు బీజేపీ ప్రభుత్వ హయాం లో నూ సవరణలు జరిగాయి. అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరిస్తుంది. చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది. ఆ చట్టం ప్రకారం అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైలులో నిర్బంధించటం చేయవచ్చు.[2] ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవటానికి 11 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండటం కానీ, ప్రభుత్వం కోసం పనిచేసి ఉండటం కానీ తప్పనిసరి అర్హతలుగా చెప్తున్న నిబంధనను కూడా ఈ బిల్లు సవరిస్తుంది. ఇప్పుడు.. ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు - హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. అయితే.. వారు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించుకోగలగాలి. అటువంటి వారు పౌరసత్వం పొందటానికి అర్హులు కావాలంటే కేవలం ఆరు సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పని చేసి ఉంటే చాలు. ప్రవాస భారత పౌరులు (ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా - ఓసీఐ) కార్డులు గల వ్యక్తులు - భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు భారతదేశంలో నిరవధికంగా నివసించటానికి లేదా పని చేయటానికి అనుమతించే వలస హోదా గల వ్యక్తులు.. చిన్న, పెద్ద నేరాలతో స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లయితే వారి ఓసీఐ హోదాను కోల్పోతారని కూడా తాజా సవరణ చెప్తోంది.
2019 సవరణ
మార్చుదీర్ఘ్హ కాల చర్చ తర్వాత సోమవారం 2019 డిసెంబరు 9 న లోక్ సభ లో 80 మంది వ్యతిరేకంగా 311 మంది మద్దతుగా ఓటేయడంతో ఈ బిల్లు ఆమోదం పొందింది. 80 తో ఆ ఆతరువాత రాజ్యసభ లో 105 మంది వ్యతిరేకంగా, 120 మంది అనుకూలంగా ఓటు వేయడంతో రాజ్యసభ పౌరసత్వ చట్ట సవరణ బిల్లు చట్టంగా మారింది కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ రాజపత్రం(గెజిట్) విడుదల చేసింది . ప్రస్తుతం ఈ బిల్లు చట్టంగా మారడంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్,అఫ్గానిస్థాన్jలో హింసకు గురై డిసెంబర్; 31, 2014కు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు నిబంధనల ఆధారంగా ఇక్కడి పౌరసత్వం కల్పించనున్నారు[3] . అయితే రాజ్యాంగంలోని షెడ్యూల్ ఆరు కిందికి వచ్చే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు. బెంగాల్ ఈస్ట్రన్; ఫ్రాంటియర్ రెగ్యూలేషన్1773 ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ కిందకు వచ్చే ప్రాంతాలకు కూడా ఈ చట్టం నుంచి మినహాయింపునిచ్చారు.పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ఆరు మతాల వారికి పౌరసత్వ సవరణ బిల్లు రక్షణ కల్పిస్తుండగా, ఎన్‌ఆర్‌సీ మాత్రం మత ప్రాతిపదికన కాకుండా 1971 మార్చి 24 దేశంలోకి వచ్చి స్థిరపడిన అక్రమ వలసదారులను తిరిగి తమ దేశాలకు పంపించేలా చట్టాన్ని రూపొందించారు.[4] ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు - హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. అయితే వారు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించుకోగలగాలి. అటువంటి వారు పౌరసత్వం పొందటానికి అర్హులు కావాలంటే కేవలం ఆరు సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పని చేసి ఉంటే చాలు.ప్రవాస భారత పౌరులు (ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా - ఓసీఐ) కార్డులు గల వ్యక్తులు భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు భారతదేశంలో నిరవధికంగా నివసించటానికి లేదా పని చేయటానికి అనుమతించే వలస హోదా గల వ్యక్తులు చిన్న, పెద్ద నేరాలతో స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లయితే వారి ఓసీఐ హోదాను కోల్పోతారని కూడా తాజా సవరణ చెప్తోంది
విమర్శలు సందేహాలు:
మార్చుఆర్టికల్ 14 ప్రకారం పౌరులందరూ సమానమే.అస్సాము లో విద్యార్ధి సంఘాలు (ఈశాన్య రాష్ట్రాల విధ్యార్ధి సంఘాలు-నెసో ఆంగ్లము: ) బందు కు పిలుపు నిచ్చాయి.[5] ఒక లక్ష కు పై గా శరణార్ధులు గా ఉన్న తమిళ స్రిలంక వాసులకు కూడా ఈ పరిధి ని విస్తరించాలని ఆధ్యత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ కోరు తున్నారు.[6] తప్పుడు దిశ లో తీసుకున్న ప్రమాదకరమైన ప్రయాణమని అంతర్జాతీయ మత స్వేచ్చ కోసం పనిచేసే అమెరికా కు చెందిన ఫెడరల్ కమీషన్ అభివర్ణించింది.[7] సుప్రీం కోర్టు పర్యవేక్షణ లో ఈ సంవత్సరమేఅస్సాం లో పూర్తిచేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ -ఎన్ ఆర్ సి ప్రకారం పందొమ్మిది లక్షల మంది హిందువులు, ముస్ల్లింల పౌరులుగా నమోదు కావడనికి అర్హతలేక మిగిలిపోయారు. అయితే కేవలం హిందువులను మాత్రమే చట్టబద్ధం చేయడనికి ఉద్ధేసించినదే ఈ బిల్లు అనే వాదన ఉంది.ఈ బిల్లు వెలివేత పూరితంగా ఉందని, రాజ్యాంగంలో పొందుపరచిన లౌకిక సూత్రాలను ఉల్లంఘిస్తోందని దీనిని వ్యతిరేకిస్తున్న వారు అంటున్నారు. పౌరసత్వం ఇవ్వటానికి మత విశ్వాసాన్ని ఒక నిబంధనగా చేయజాలరని చెప్తున్నారు.రాజ్యాంగం తన పౌరుల పట్ల మత వివక్షను నిషేధిస్తోంది. చట్టం ఎదుట అందరికీ సమానత్వం, సమాన చట్టపరమైన రక్షణను హామీ ఇస్తోంది ఈ సవరణ పట్ల అనేక భయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి 1940 లో మహమ్మద్ ఆలీ జిన్నా చేసిన హిందూ, ముస్లిం లు వేరు వేరు విభాలుగా ఉండాల్నే విస్తృత ప్రచారం తర్వాత 1947 దేశ విభజణ కు దారి తీసింది. ఇలా ఒకముస్లిం దేశం ఏర్పడిన సంధర్భం లో, జాతీయ నాయకులు భారత దేశమును లౌకిక రాజ్యముగా రూపకల్పణ చేసారు. అందుచేతనే 14 వ అధికరణ ప్రతి పౌరునికి సమానత్వపు హక్కు ను దానితోపాటు మత స్వేచ్చ కు ప్రాధన్యత ను ఇవ్వడం జరిగింది. శరణార్ధుల లో నుండి అక్రమ చొరబాటుదారులు గా నిర్ణయిచడానికి ఎన్నుకొన్న కొలమానం ’మతం’ కావడం విమర్శలకు దారి తీసింది.అనగా శరణార్ధులలో రెండు తెగలను సృష్టిస్తుంది ఈ ప్రతిపాదిత బిల్లు. ఈ బిల్లు చట్టం గా మారితే శరణార్ధి గా పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బాంగ్లాదేశ్ ల నుండి వచ్చే ముస్లిమేతరులు, అనగా హిందూ , సిక్కు, బుద్ధ, జైన, పార్శి, క్రైస్తవులకు దేశం లోనికి రావడానికి ఎటువంటి అనిమతి గాని , సరైన పత్రాలు గాని లేకపోయినా ఆశరణర్ధులు పౌరులౌతారు.ఈ బిల్లు ప్రకారం వీరి ప్రవేశము అక్రమము కాదు. ఈ బిల్లు ద్వారా తేవాలను కొంటున్న మరొక ముఖ్య మార్పు పైన చెప్పబడిన ఈ దేశాలనుండి వచ్చి స్థిరపడిన మ్స్లిమేతరుల కాలం పద్నాలుగు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాలకు కు తగ్గించడం.[8]. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశం లో అనేక అల్లర్లు, నిరసనలు జరిగాయి. మరోవైపు చట్టానికి అనుకూలంగా ర్యాలీలు జరిగాయి. ఈ చట్టం కేవలం పాక్, బాంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో మత పీడనకు గురైనవారి కోసమని, ఏ ఒక్కరి పౌరసత్వాన్ని లాక్కోవడానికి ఉద్దేశించినది కాదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. అయితే పౌర చట్టంలో ముస్లింలను మినహాయించడం వివక్షతతో కూడుకున్నదని దేశంలోని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (12 March 2024). "అమల్లోకి సీఏఏ". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ "CAB పౌరసత్వ సవరణ బిల్లు".
- ↑ లోక్ సభ లో ఈ బిల్లు ఆమోదం పొందింది
- ↑ "పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం".
- ↑ అస్సాము లో విద్యార్ధి సంఘాలు బంద
- ↑ [1]
- ↑ [2]
- ↑ [3]