భారత రమణీమణులు
భారత రమణీమణులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు రచించిన పుస్తకం. ఇది 1919లో ముద్రించబడినది.
స్వాతంత్రం ముందురోజుల్లో పాఠశాలలో చదువుకునే బాలికలకు పాఠ్యాంశంగా నిర్ణయించేందుకు, వారు చదువుకుని సచ్చీలత పెంపొందించుకునేందుకు ఈ గ్రంథాన్ని రచించినట్టు రచయిత ముందుమాటలో రాశారు. ఈ గ్రంథంలో పురాణాలలో చిత్రితమైన పలువురు ఆదర్శప్రాయులైన స్త్రీమూర్తుల జీవితగాథలు, చారిత్రిక ప్రముఖులైన ఆదర్శమహిళల జీవనచిత్రాలు అధ్యాయాలుగా ఉన్నాయి. సావిత్రి మొదలుకొని అసామాన్య వరకూ 21మంది మహిళల జీవితాలు ఉన్నాయి.
రమణీమణులు
మార్చు- సావిత్రి
- శకుంతల
- దమయంతి
- వీరాబాయి
- చంద్రమతి
- దుర్గావతి
- లోపాముద్ర
- అనసూయాదేవి
- అరుంధతీదేవి
- మీరాబాయి
- సంధ్యావళీదేవి
- కర్మదేవి
- సుమతీదేవి
- వీరమతి
- చంద్రవదన
- తారాబాయి
- ప్రభావతీదేవి
- రామాబాయి
- సుముఖీదేవి
- సురభీదేవి
- అసామాన్య