భారత వైమానిక దళ దినోత్సవం
భారత వైమానిక దళ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న నిర్వహించబడుతుంది. భారతీయ వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) 1932, అక్టోబరు 8వ తేదీన స్థాపించబడి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వైమానిక దళంగా పేరుపొందింది. అంతటి శక్తివంతమైన వైమానిక దళం యొక్క సేవలను గుర్తిస్తూ ప్రతిఏటా అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది.[1][2]
భారత వైమానిక దళ దినోత్సవం | |
---|---|
రకం | జాతీయం |
జరుపుకొనే రోజు | అక్టోబర్ 8 |
ఆవృత్తి | వార్షికం |
ప్రారంభం
మార్చు1932, అక్టోబర్ 8న ఏర్పడిన భారత వైమానిక దళం బ్రిటీష్ తరపున రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నది. దానికి గుర్తుగా 1945లో రాయల్ భారత వైమానిక దళంగా మార్చబడింది.1950లో గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత భారత వైమానిక దళంగా రూపాంతరం చెందింది. 1933 ఏప్రిల్ 1న భారత వైమానిక దళానికి తొలి ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చింది. తొలినాళ్ళలో కేవలం ఐదు మంది పైలట్స్, ఒక ఆర్‌ఏఎఫ్ మాత్రమే ఉండేవారు.
ఇతర వివరాలు
మార్చు1.70 లక్షల మంది సిబ్బందితో, 1300 విమానాలతో భారత వైమానిక దళం ప్రపంచంలోనే నాలుగవ పెద్ద వైమానిక దళంగా ప్రసిద్ధి పొందింది.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి (8 October 2015). "ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు హ్యాట్సాఫ్". Archived from the original on 8 October 2018. Retrieved 8 October 2018.
- ↑ నమస్తే తెలంగాణ (8 October 2017). "దేశ రక్షణలో వైమానిక దళం". Archived from the original on 8 అక్టోబరు 2018. Retrieved 8 October 2018.