భారత శ్రీలంక ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం

భారత, శ్రీలంకల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి కొత్త చేర్పులు

ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం (ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కో-ఆపరేషన్ అగ్రిమెంట్ - ETCA) భారత, శ్రీలంకల మధ్య ఈసరికే ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ట్రేడ్-ఇన్ సర్వీసెస్, సేవా రంగానికి సంబంధించి అంశాలను చేర్చే ప్రతిపాదిత దౌత్య ఒప్పందం.[1]

భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన

శ్రీలంకలో తక్కువ-ఆదాయం కలిగిన వ్యక్తుల కోసం తక్కువ-ధర వస్తువులను పరిచయం చేయడానికి, భారతదేశానికి అధిక-విలువ కలిగిన వస్తువుల అమ్మకాలను పెంచడానికి, అదే సమయంలో విదేశీ పెట్టుబడులకు శ్రీలంకను మరింత ఆకర్షణీయంగా మార్చడనికీ ఒక మార్గంగా దీని మద్దతుదారులు ఈ ప్రతిపాదనను సమర్థించారు. [2] కానీ భారతదేశం శ్రీలంకను చౌక కార్మికులతో నింపుతుందని చాలా లాబీ గ్రూపులు ఆందోళన చెందాయి. ముఖ్యంగా IT పరిశ్రమ, చౌకైన భారతీయ టెక్ కార్మికుల ప్రవాహం పట్ల ఆందోళన చెందుతోంది.[3] అనేక జాతీయవాద సమూహాలు, భారతదేశపు అధిక నిరుద్యోగిత రేటును ఎత్తి చూపాయి.[4] రాబోయే విపత్తును నివారించి, శాంతిని కాపాడినందుకు శ్రీలంక భారతదేశానికి కృతజ్ఞతలు తెలియజేసింది.[5]

ప్రతిపాదిత ఒప్పందం ప్రభావం ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలపై $50,000 కోట్ల పెరుగుదలగా ఉంటుందని అంచనా వేసారు.[6] ఈశాన్య ఆసియా దేశాలైన తైవాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాల మధ్య ఆర్థిక సహకార ముసాయిదా ఒప్పందం అని పిలువబడే ఆర్థిక యూనియన్‌తో దీన్ని పోల్చారు. రెండు ఒప్పందాలలోనూ భాగంగా ఉన్న ద్వీప దేశ ప్రజలను ప్రధాన భూభాగం నుండి వచ్చే చవక కార్మికులతో ముంచెత్తుతాయని రెండింటిపైనా ఒకేలాంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.[7]

చరిత్ర

మార్చు

ETCAకి ముందు అప్పటి మహింద రాజపక్ష ప్రభుత్వం భారతదేశంతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది.

ప్రతిపాదిత ఒప్పందం

మార్చు
  1. "TN NAFTA Professionals". USCIS (in ఇంగ్లీష్). Retrieved 2017-08-03.
  2. "The Economic and Technological Cooperation Agreement: Full steam ahead for India and Sri Lanka?". 20 October 2016.
  3. Expert, Chanakya. "India and Sri Lanka-Economic and Technological Cooperation Agreement: beginning of a new era?" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2017-08-04. Retrieved 2017-08-03.
  4. "Implications of ETCA on Sri Lanka - Ceylontoday.lk". www.ceylontoday.lk (in ఇంగ్లీష్). Archived from the original on 2017-08-03. Retrieved 2017-08-03.
  5. Dutt, Kunal. "'You saved us, prevented bloodbath': Sri Lanka thanks India". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2023-09-23.
  6. "Sri Lanka will sign economic, tech pact with India by year end: Wickremesinghe". The Hindu Business Line (in ఇంగ్లీష్). 2016-10-06. Retrieved 2017-08-03.
  7. "Storm over Sri Lankan deal with India". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-08-03.

ట్రేడ్-ఇన్ సర్వీసెస్

మార్చు

శ్రీలంక తన సేవల మార్కెట్‌ను కంప్యూటర్, టెలికమ్యూనికేషన్, పర్యాటక, ఆర్థిక, ఆరోగ్యం, సముద్ర రవాణా, సహాయక సంబంధిత సేవల రంగాలలోని కార్మికులకు ద్వారాలు తెరిచింది. [1]

ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, ఆరోగ్యం మొదలైనవి, కంప్యూటర్, టెలికమ్యూనికేషన్, పరిశోధన, అభివృద్ధి, రియల్ ఎస్టేట్, వినోదం, సాంస్కృతిక, విద్య, పర్యావరణం, పర్యాటకం, నిర్మాణం, రవాణా సంబంధిత సేవలతో సహా వృత్తిపరమైన సేవల శ్రేణికి భారతదేశం తన సేవలను తెరిచింది.[1]

సంస్థలు

మార్చు

జాయింట్ కమిటీ

మార్చు

రెండు దేశాలకు చెందిన మంత్రులతో ఒక సంయుక్త కమిటీ ఉంటుంది. కనీసం సంవత్సరానికి ఒకసారి సమావేశం కావాలని భావిస్తున్నారు.

స్టాండింగ్ కమిటీ

మార్చు

స్టాండింగ్ కమిటీ సీనియర్ సివిల్ సర్వెంట్స్‌తో కూడి ఉంటుంది. ఏడాదికి కనీసం రెండు సార్లు సమావేశమవుతుందని భావిస్తున్నారు. ఇది వాణిజ్యం, పరిశ్రమలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి బాధ్యత వహిస్తుంది. అదే సమయంలో ఒప్పందానికి సవరణలను పరిష్కరించడానికి ఒక వేదికగా కూడా వ్యవహరిస్తుంది.

మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్

మార్చు

మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్‌లో ఇరు దేశాలు ఒక్కో సభ్యుని నామినేట్ చేస్తాయి. ఇరు పక్షాలు అంగీకరించే ఒక సాధారణ సభ్యుడు ఉంటారు (లేకపోతే యాదృచ్ఛిక ఎంపిక ద్వారా ఎంపిక చేస్తారు),

జనాభా వివరాలు

మార్చు
 
సింహళ రాక - అజంతా గుహల లోని చిత్రం

దిగువ పట్టిక భారత శ్రీలంకల ఉమ్మడి ఆర్థిక ప్రాంత జనాభాను చూపుతుంది:

2015/2016 రిపబ్లిక్ ఆఫ్ ఇండియా శ్రీలంక మొత్తం
జనాభా (cr) 132.4 [2] 2.12 134[ <span title="This claim needs references to reliable sources. (January 2019)">వివరణ అవసరం</span> ].5
GDP (cr) 15,300,000 ₹ [3] 1183.9 రూ [4] 229,508.29
తలసరి GDP (L) 9.33 ₹ [5] 5.33 రూ [4] 0.017
నిరుద్యోగిత రేటు 4.8 [6] 4.4 [4] n/a
ప్రాంతం (L, km 2 ) 32.8724 [2] 0.6561 [7] 33.5285
GDP వృద్ధి (%) 7.1% 4.4 [4] n/a
ప్రజా రుణం (%GDP) 67.5 [8] 79.3 [4] n/a
సేవా రంగంలో % 57.9% [9] 56.6 [4] n/a
ద్రవ్యోల్బణం 2.2% [10] 3.7 [4] n/a

స్పందనలు

మార్చు

రాణిల్ విక్రమసింఘే, శ్రీలంక ప్రధాన మంత్రి: "ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాల జనాభా 25 కోట్లు, వీటి సంయుక్త జీడిపి $45,000 కోట్లు. శ్రీలంక $8,000 కోట్లు కలిసి ఈ ఉప ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ జిడిపి $50,000 కోట్లను దాటుతుంది," [11]

 
రాముడి వంతెన

భారత హైకమిషనర్ YK సిన్హా : “మంగలి పనివారు, న్యాయవాదులు, ప్రొఫెసర్లతో సహా పెద్ద సంఖ్యలో భారతీయులు శ్రీలంకకు వస్తారని, వారు శ్రీలంకను స్వాధీనం చేసుకుంటారని వారు పేర్కొన్నారు. . . ఈ వాదనలు వినోదభరితమైనవి, పూర్తిగా అవాస్తవమైనవి," [12]

ముహుంతన్ కనగే – ICTA CEO : "ETCA పై సంతకం చేస్తే శ్రీలంకలో IT ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని మీరు నిజంగా అనుకుంటున్నారా? అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. భారత ఐటి నిపుణులు శ్రీలంక బృందాలతో కలిసి పనిచేయకుండా తలుపులు మూసివేయాలన్నంత తక్కువ స్థాయికి చెందినవారమా?. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ కోడ్ అభివృద్ధి చేయబడి, ఇంటర్నెట్ ద్వారా డెలివరీ చేయబడుతున్న ఈ రోజుల్లో, ఐటి నిపుణులు వచ్చి ఇక్కడి వారితో ముఖాముఖి పనిచేయడాన్ని నివారించడం చెరుపు చేస్తుందని మీకు తెలీడం లేదా? ఏది ఏమైనప్పటికీ, పనిని ఆన్‌లైన్‌లో అవుట్సోర్స్ చేయవచ్చు.[13]

GMOA సభ్యురాలు డాక్టర్ హరిత అలుత్గే : “శ్రీలంక వాణిజ్య సంఘానికి ఎలాంటి నష్టం జరుగుతుందో మేము ఎత్తి చూపాము. ఒప్పందంలోని వాస్తవాలను చదివి, వాటిని అధ్యయనం చేసిన తర్వాతనే వారు ETCAని ఖరారు చేస్తారని మంత్రి మాకు తెలియజేసారు.” [14]

యంగ్ లాయర్స్ సర్కిల్ సభ్యులు : “శ్రీలంక శ్రామిక శక్తిపై వినాశకరమైన ప్రభావాన్ని చూపే ఈ ఒప్పందంపై సంతకం చేయవద్దని మేం ప్రభుత్వానికి చెబుతున్నాం. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, భారతదేశ ఒత్తిడి కారణంగా ప్రభుత్వం రహస్యంగా ఈ ఒప్పందంపై సంతకం చేయవలసి వచ్చింది. ఈ ఒప్పందంపై ప్రభుత్వం మేధోపరమైన చర్చను ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. యువ న్యాయవాదులుగా, ప్రభుత్వం ఒప్పందాన్ని బహిరంగపరచి, నిపుణులను సంప్రదించాలని మేము కోరుతున్నాము” [15]

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గీతాంజలి నటరాజ్, “ఈ రాష్ట్రాలు శ్రీలంకకు సమీపంలో ఉన్నందున, ETCA ప్రధాన షిప్పింగ్ మార్గాల కూడలిలో ఉన్న శ్రీలంక ప్రత్యేక భౌగోళిక-వ్యూహాత్మక స్థానాన్ని ఒప్పందం ప్రభావితం చేస్తుంది. ETCA ప్రాంతీయ ఏకీకరణను కూడా పెంచుతుంది. ఇది, శ్రీలంకను దక్షిణాసియా భౌగోళిక-ఆర్థిక కేంద్రంగా మార్చగలదు."[16]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :0 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 ORGI. "Census of India: Area And Populatio". censusindia.gov.in. Retrieved 2017-08-03.
  3. "Reality check: Indian economy is not larger than that of the UK". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-08-03.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "SRI LANKA AT A GLANCE - HOME". www.treasury.gov.lk (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-08-03. Retrieved 2017-08-03.
  5. "India's per capita income rises 7.4% to Rs 93,293". The Economic Times. 2016-05-31. Retrieved 2017-08-03.
  6. "India's unemployment rate sees sharp decline: Report". BTVI.in. Archived from the original on 2017-03-05. Retrieved 2017-08-03.
  7. Ellyatt, Holly (2016-10-10). "ISIS' territory has shrunk by 16 percent to the size of Sri Lanka: Research". CNBC. Retrieved 2017-08-03.
  8. "India Government Debt Remains 'Significantly' High, Moody's Says". Bloomberg.com. June 2017.
  9. "Sector-wise contribution of GDP of India - StatisticsTimes.com". statisticstimes.com. Archived from the original on 2018-03-02. Retrieved 2017-08-03.
  10. "From 11% to 2.2%, five charts explain India's vanishing inflation". The Economic Times. 2017-06-20. Retrieved 2017-08-03.
  11. Nair, Remya (2016-10-06). "India, Sri Lanka to sign economy, technology pact by year-end". livemint.com/. Retrieved 2017-08-03.
  12. "Video: Surprising that confusions on CEPA aren't clarified: HC Sinha" (in ఇంగ్లీష్). Retrieved 2017-08-03.
  13. "What is ETCA and the impact on our IT industry – README". README (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-01-26. Retrieved 2017-08-03.
  14. "CEPA coming as ETCA, says GMOA" (in ఇంగ్లీష్). Retrieved 2017-08-03.
  15. "ETCA will hit engineers most - OEA chief". archives.sundayobserver.lk. Retrieved 2017-08-03.
  16. "Modi @3: The view from the foreign office". Rediff. Retrieved 2017-08-03.