భౌతికవాదం అంటే భౌతికంగా ఉనికిలో ఉన్న వాటి గురించే అలోచించడం. చెట్లు, కొండలు, కోనలు, మనిషి, సమాజం ఇవన్నీ భౌతికంగా ఉనికిలో ఉన్నవే. వీటికి అతీతంగా ఊహాజనిత వస్తువులని (దేవుడు, ఆత్మ లాంటివి) నమ్మడం భావవాదం కిందకి వస్తుంది. భావవాదంలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి. ఆవి వస్తుగత భావవాదం (objective idealism), విషయగత భావవాదం (subjective idealism).

వస్తుగత భావవాదం మార్చు

వస్తుగత భావవాదులు ఉనికిలో ఉన్న వస్తువు పైన భావవాద అంచనాలు వేస్తారు. ఉదాహరణ: హెగెల్.

విషయగత భావవాదం మార్చు

విషయగత భావవాదులు ఉనికిలో లేని దేవుడు, ఆత్మ వంటి వాటిని నమ్ముతారు. వస్తుగత భావవాదం, విషయగత భావవాదం రెండిటినీ ఒకే కాలంలో నమ్మేవారు కూడా ఉన్నారు. ఆది శంకరాచార్యుడు పూర్తిగా విషయగత భావవాదాన్నే నమ్మేవాడు. ఇతని వాదాన్ని మిథ్యావాదం అని కూడా అంటారు.

కర్మవాదం మార్చు

కర్మవాదం (fatalism) అంటే ప్రతి సంఘటన కర్మ (fate) మీద ఆధారపడి జరుగుతుందని నమ్మడం. కర్మవాదులు వీరికి అనుకూలమైనది జరిగితే అది తమ అదృష్టమనో దేవుడు కరుణించాడనో నమ్ముతారు. వీరికి ప్రతికూలమైనది జరిగితే అది తమ దురదృష్టమనో, దేవుడు తిరస్కరించాడనో నమ్ముతారు. అదృష్టం, దురదృష్టం, దైవ నిర్ణయాల పేరుతో చేసే సూత్రీకరణలను కర్మ సిధ్ధాంతాలని అంటారు.

పునర్జన్మల పై నమ్మకం, స్వర్గ ప్రాప్తి, నరక భీతి లాంటివి కూడా కర్మవాదం కిందకి వస్తాయి. ఉదాహరణ: "నేను గత జన్మలో ఏదో పాపం చెయ్యడం వల్లే ఇప్పుడు ఈ స్థితికి దిగజారాను" అని కొందరు అంటుంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=భావవాదం&oldid=2882854" నుండి వెలికితీశారు