ప్రధాన మెనూను తెరువు

భాస్కరభట్ల కృష్ణారావు (1918 - 1966) తెలుగు కథా రచయిత.

వీరు ప్రేమాజీపేటలో 19 డిసెంబర్ 1918 తేదీన జన్మించారు. వీరు బి.ఎ., ఎల్.ఎల్.బి చదివారు. ఆకాశవాణిలో దాదాపు 15 ఏళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు.

వీరు 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించారు. ఇవి మూడు సంపుటాలుగా ముద్రించబడ్డాయి. వీరి రచనలు ఇతివృత్తం, శిల్పం, భాష, పాత్ర పోషణలలో చాలా వైవిధ్యంగా ఉంటాయి.

వీరు 11 నవంబర్ 1966 తేదీన పరమపదించారు.

రచనలుసవరించు

కథా సంకలనాలుసవరించు

  • కృష్ణారావు కథలు (1955) - పది కథల సంకలనం
  • చంద్రలోకానికి ప్రయాణం - తొమ్మిది కథలు మరియు ఒక నాటికల సంకలనం
  • వెన్నెల రాత్రి (1962) - 17 కథల సంకలనం.

నవలలుసవరించు

  • వింత ప్రణయం (1957)
  • యుగసంధి (1957)
  • వెల్లువలో పూచిక పుల్లలు (1960)
  • భవిష్యద్దర్శనం (1966)