భీమేశ్వర పురాణము

తెలుగు ప్రబంధం

భీమఖండము అనే నామాంతరము కలిగిన భీమేశ్వర పురాణము ఒక తెలుగు ప్రబంధము. దీనిని 15వ శతాబ్దపు కవి శ్రీనాథుఁడు రచించెను.[1] ఇది ద్రాక్షారామం లోని భీమశంకరుని స్థలపురాణ విశేషాలున్న గ్రంథం.

భీమఖండము
అను
భీమేశ్వర పురాణము
1901 ముద్రణ ప్రతి.
కృతికర్త: శ్రీనాథుడు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: స్థలపురాణం
ప్రచురణ: క్రొత్తపల్లి వేంకట పద్మనాభ శాస్త్రి, మద్రాసు
విడుదల: 1901, 1929
పేజీలు: 136

ఇది 1901 సంవత్సరంలో రెండవకూర్పు ముద్రించబడింది. పిదప 1929లో పునర్ముద్రణ పొందినది.

విషయసూచిక

మార్చు

ప్రథమాశ్వాసము

మార్చు

1. ఇష్టదేవతా ప్రార్థనము; 2. పురాతన కవీంద్రగుణకీర్తనము; 3. కుకవి నిరాకరణము; 4. ఉపోద్ఘాతము; 5. వేమభూపాలుని వంశావతారవర్ణనము; 6. కృతినాయక వంశావతారవర్ణనము; 7. షష్ఠ్యంతములు; 8. దక్షారామపురవర్ణనము; 9. కథాప్రారంభము

ద్వితీయాశ్వాసము

మార్చు

10. సూర్యాస్తమయవర్ణనము; 11. చంద్రోదయవర్ణనము; 12. సూర్యోదయవర్ణనము; 13. వ్యాసమహర్షి యాత్రకు వెడలుట; 14. పీఠికాపుర వర్ణనము; 15. కుమారారామ వర్ణనము; 16. సర్పపుర వర్ణనము; 17. అగస్త్యుఁడు వ్యాసమహర్షిఁ గాశిఁ బాసివచ్చుటకుఁ గారణం బడుగుట; 18. వ్యాసులు తాను గాశిఁబాసిన కారణంబుఁ జెప్పుట; 19. వ్యాసులు కాశిని శపింపఁబూనుట; 20. విశ్వనాథుఁడు పార్వతితోడ వ్యాసాదు లుండిన వేదికకడకు విజయము చేయుట; 21. శంభుండు వ్యాసుని శిష్యులతోడఁ గాశి వెడలిపొమ్మనుట

తృతీయాశ్వాసము

మార్చు

22. కలశభవుఁడు పారాశర్యునకు దక్షారామమహిమంబు చెప్పుట; 23. వ్యాసాదు లాకసంబుననుండి భీమమండలంబుఁ గనుఁగొనుట; 24. వ్యాసాదులు దక్షారామంబుఁ బ్రవేశించుట; 25. ఇంద్రుఁడు దేవతలకు శివలింగమాహత్మ్యంబుఁ జెప్పుట; 26. బ్రహ్మాదులు భీమేశ్వరు వర్ణించుట; 27. అగస్త్యుఁడు వ్యాసునకుఁ బంచతీర్థంబుల వివరించుట; 28. అగస్త్యవ్యాసులు భీమేశ్వరాలయంబుఁ బ్రవేశించుట; 29. వ్యాసుఁడు భీమేశ్వరార్చనంబు సలుపుట; 30. వ్యాసు లీశ్వరు నుతించుట

చతుర్థాశ్వాసము

మార్చు

31. అగస్త్యుఁడు తీర్థమాహాత్మ్యంబుఁ జెప్పుట; 32. క్షీరసాగరమథనకము ప్రారంభము; 33. శివుఁడు హాలాహలము మ్రింగుట; 34. దేవత లీశ్వరుని స్తుతించుట; 35. శివునియాజ్ఞను సురాసురులు విఘ్నేశునిఁ బూజించి పాల్కడలి తరియించి చంద్రాదులఁ బడయుట; 36. దేవాసురు లమృతమునకై పోరుటయు శ్రీమన్నారాయణుఁడు దేవారుల వంచించుటయు; 37. నారదోక్తి నసురు లీశ్వరునిఁ బూజించి వరంబులు వడసి లోకముల బాధించుట; 38. బ్రహ్మవిష్ణ్వాదులు శివునికడకేగి మొఱవెట్టుట; 39. ఈశ్వరుఁడు త్రిపురాసురుల నిర్జించుట; 40. తుల్యభాగ యుత్పత్తిక్రమము; 41. శ్రీభీమనాథేశ్వరుఁడు దనకుఁ దాన ప్రతిష్ఠితుండగుట

పంచమాశ్వాసము

మార్చు

42. సూర్యుండు కైలాసమున కరిగి శివుని దక్షారామమునకుఁ దోడితెచ్చుట; 43. మహాదేవుఁడు ప్రమథగణసమేతుఁడై దక్షారామమునకుఁ బోవుట; 44. శివుఁడు దక్షారామంబుఁ బ్రవేశించుట; 45. శ్రీకంఠుఁడు దక్షారామ భీమేశుతో నైక్యతం బొరయుట; 46. లక్ష్మ్యాదులు శ్రీభీమేశుని స్తుతించుట; 47. దివస్పతి బృహస్పతిని దానములఁగూర్చి యడుగుట; 48. భూదానమహిమ; 49. దివస్పతి శ్రీభీమేశ్వరునకు భీమమండలంబు సమర్పించుట; 50. వసంతర్తు వర్ణనము; 51. సప్తముని స్తోత్రము; 52. గౌరికి మహేశ్వరుండు భక్తివిజ్ఞానయోగంబుఁ జెప్పుట

మూలాలు

మార్చు
  1. శ్రీనాథుడు (1901). శ్రీ భీమేశ్వర పురాణము. మద్రాసు: క్రొత్తపల్లి వెంకట పద్మనాభ శాస్త్రి. Retrieved 6 August 2020.