భూటియా-లెప్చా
భూటా-లెప్చా అనేది, భారతదేశం లోని సిక్కింలోని భూటియా, లెప్చా కమ్యూనిటీల ప్రజలతో కూడిన జాతి సమూహం. ఈ రెండు సమూహాలు భారత ప్రభుత్వంచే షెడ్యూల్డ్ తెగలుగా జాబితా చేయబడ్డాయి.[2] 2002లో డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సుల అమలు తర్వాత, సిక్కిం శాసనసభ లోని 32 సీట్లులో 12 సీట్లు ఈ వర్గానికి రిజర్వ్ చేయబడ్డాయి. [3]
Total population | |
---|---|
1,12,507 | |
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
Sikkim, India | 1,12,507 (2011 census)[1] |
భాషలు | |
సిక్కిమీస్, నేపాలీ, జంఖా, టిబెటన్, లెప్చా | |
మతం | |
బౌద్ధమతం, బోన్, మున్ |
సిక్కింలో రిజర్వేషన్
మార్చుభూటియా-లెప్చా (BL) ప్రజలకు రిజర్వేషన్లు 1953 సిక్కిం సాధారణ ఎన్నికలతో సిక్కిం స్టేట్ కౌన్సిల్‌లో రిజర్వ్ చేయబడిన ఆరు (18లో) స్థానాలతో ప్రారంభమయ్యాయి.[4] ఇది 1970 సిక్కిమీస్ సాధారణ ఎన్నికల నాటికి ఏడు (24లో) స్థానాలకు మార్చబడింది.[5] 1974 లో సార్వత్రిక ఓటు హక్కుపై ఆధారపడిన మొదటిఎన్నికలలో రిజర్వేషన్లు 15 (32లో) స్థానాలకు పెంచబడ్డాయి. 2006 నాటికి సిక్కిం శాసనసభలో 12 సీట్లు (32లో) BL కోసం రిజర్వ్ చేయబడ్డాయి.[6] [7]
సిక్కిం భూటియా లెప్చా అపెక్స్ కమిటీ
మార్చుసిక్కిం భూటియా లెప్చా అపెక్స్ కమిటీ (SIBLAC) అనేది సిక్కిమీస్, భూటియా-లెప్చా (BL), సిక్కిమీస్ మూలానికి చెందిన నేపాలీల జాతి సమూహాల రాజకీయ హక్కుల కోసం పోరాడుతున్న సమూహం.[8] సిక్కిం శాసనసభలో బిఎల్‌లకు రిజర్వేషన్‌తో పాటు, వారు స్థానిక సంస్థల (పంచాయత్) ఎన్నికలలో కూడా రిజర్వేషన్ కోసం కావాలని వాదించారు.[9]
న్యాయ పోరాటాలు
మార్చు1993లో, రైజింగ్ సన్ పార్టీకి చెందిన రామ్ చంద్ర పౌడ్యాల్ [8] ద్వారా సిక్కింలోని BL నియోజకవర్గాలకు,సంఘ నియోజకవర్గాలకు రిజర్వేషన్‌ను సవాలుచేస్తూ భారతదేశ సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలు చేయబడింది. రాజ్యాంగంలోని 14, 170(2) లేదా 332 ఆర్టికల్‌లను రిజర్వేషన్లు (లేదా వాటి పరిమాణం) ఉల్లంఘించడం లేదని తీర్పునిస్తూ, సుప్రీంకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.[10] [11]
2015లో, సిక్కింలో జరగనున్న పురపాలకసంఘ ఎన్నికలలో భూటి-లెప్చాకు కేటాయించినలాగేనే లింబూ-తమాంగ్ (LT) లకు రిజర్వేషన్‌ను కేటాయించాలని వాదిస్తూ మిస్టర్ ఫిగు షెరింగ్ భూటియా ద్వారా సిక్కిం హైకోర్టుకు ఒక పిటిషన్ దాఖలయింది. న్యాయమూర్తి మీనాక్షి మదన్ రాయ్, ఎన్నికల నియోజకవర్గాల్లో రిజర్వేషన్లు ఏ న్యాయస్థానం పరిశీలనకు లోబడి ఉండవనే దృష్టాంతాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చారు.[12] [13]
ఇది కూడ చూడు
మార్చు- సిక్కిం స్థానిక ప్రజలు
- సిక్కిం శాసనసభ నియోజకవర్గాల జాబితా
- షెడ్యూల్డ్ తెగలు
- భారతదేశంలో రిజర్వు చేయబడిన రాజకీయ స్థానాలు
మూలాలు
మార్చు- ↑ "A-11 Individual Scheduled Tribe Primary Census Abstract Data and its Appendix". www.censusindia.gov.in. Registrar General and Census Commissioner of India. Retrieved 20 November 2017.
- ↑ "State/Union Territory-wise list of Scheduled Tribes in India". Ministry of Tribal Affairs] India. Archived from the original on 2016-08-15. Retrieved 2015-09-19.
- ↑ "Sikkim - Final Publication". Election Commission of India. Retrieved 3 January 2021.
- ↑ Hamlet Bareh (2001). Encyclopaedia of North-East India: Sikkim. Mittal Publications. p. 16. ISBN 9788170997948.
- ↑ "Sikkim Darbar Gazette - Declaration of the Results of Election, 1970". 14 May 1970. pp. 59–60. Retrieved 16 June 2021.
- ↑ CEO Sikkim. "AC Map of Sikkim". Retrieved 6 January 2022.
- ↑ CEOSikkim. "Assembly constituencies Revenue Blocks". Retrieved 6 January 2022.
- ↑ 8.0 8.1 Joydeep Sen Gupta (6 April 2019). "Sikkim's Sangha Assembly seat is a perfect example of the state's unique political process to protect minority rights - Politics News". Retrieved 19 January 2021.
- ↑ "Sikkim Bhutia Lepcha Apex Committee - About us". www.siblac.org. Retrieved 19 January 2021.
- ↑ "R.C. Poudyal and ANR. Vs. Union of India and ORS" (PDF). Supreme Court of India. 10 February 1993. Retrieved 20 January 2021.
The reservation of seats for Bhutias and Lepchas is necessary because they constitute a minority and in the absence of reservation they may not have any representation in the Legislative Assembly. [...] That impugned provisions providing for reservation of 12 seats, out of 32 seats in the Sikkim Legislative Assembly in favour of Bhutias Lepchas, are neither unconstitutional as violative of the basic features of democracy and republicanism under the Indian Constitution nor are they violative of Articles 14, 170(2) and 332 of the Constitution. [...] The extent of reservation of seats is not violative of Article 332(3) of the Constitution.
- ↑ "R.C. Poudyal & ANR Vs. Union of India & Ors (1993) INSC 77 (10 February 1993)". www.latestlaws.com. Retrieved 19 January 2021.
- ↑ Hon'ble Mrs. Justice Meenakshi Madan Rai, Judge (30 July 2016). "Judgement - WP(C) No.60 of 2015 - Shri Phigu Tshering Bhutia vs. State of Sikkim and Others - Petition under Article 226 of the Constitution of India" (PDF). Sikkim High Court. Retrieved 23 January 2021.
As there is a specific bar to interference by Courts in electoral matters, I would not be inclined to wade into forbidden waters
- ↑ "Phigu Tshering Bhutia v. State Of Sikkim and Ors". www.casemine.com. Retrieved 23 January 2021.