భూమన్ వక్త, రచయిత, రాయలసీమ ఉద్యమకారుడు. వీరి అసలు పేరు భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి.

జీవిత విశేషాలు

మార్చు

మేధావిగా, వక్తగా, రచయితగా, రాయలసీమ ఉద్యమకారుడిగా చిరపరిచితుడైన భూమన్[1] చిన్నతనంలోనే సాహిత్యం పట్ల మక్కువనూ, సమాజం పట్ల ప్రగతిశీల దృక్ఫథాన్నీ పెంచుకున్నాడు. తన 18వ ఏటనే చలం ప్రభావంతో కొంతకాలం తిరువన్నామలై లో గడిపాడు. 19వ ఏట నక్సల్బరీ, విప్లవ రాజకీయాల పట్ల ఉత్తేజితులై ఎందరో ప్రగతిశీల నాయకులకు సన్నిహితులయ్యాడు. 1970 లో విరసం సభ్యుడై ఆ సంస్థ బాధ్యుడిగా కూడా కొంతకాలం వ్యవహరించాడు. భారత చైనా మిత్రమండలి లో కూడా ఉన్నాడు.

ఇతని కవితలు “లే”, “విప్లవం వర్ధిల్లాలి” అనే కవితా సంకలనాల్లోనూ, “రాయలసీమ” పత్రికలోనూ ప్రచురితం అయ్యాయి. 1974లో చిత్తూరు కుట్ర కేసులోనూ, 1975లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) లోనూ అరెస్టు అయి జైలు నిర్భంధానికి గురయ్యాడు. 1978లో జనసాహితి స్థాపక సభ్యులయ్యాడు. 1984లో రాయలసీమ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు ఆ ఉద్యమ కార్యాచరణ కమిటీకి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యాడు. రాయలసీమ గొంతుకగా వెలువడుతున్న కదలిక పత్రిక సంపాదక సభ్యుడుగా ఉన్నాడు.

రాయలసీమ ఉద్యమంలో భాగంగా పోతిరెడ్డిపాడుకు సాగిన పాదయాత్ర బృందంలో ప్రముఖ భూమికను పోషించాడు[2]. 1990 లో రాయలసీమ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. కన్యాశుల్కం నూరేళ్ళ పండుగ, చలం శతజయంతి సభలను ఘనంగా నిర్వహించాడు. సీమ సాహితి పత్రిక, సంస్థ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. రాయలసీమ సమస్యలపై వివిధ పత్రికల్లో వందలాది వ్యాసాలను రచించాడు. భూమన్ రచించిన రాయలసీమ వ్యాసాల సంకలనం “రాయలసీమ ముఖచిత్రం” అత్యంత ప్రజాదరణను పొందింది. వృత్తి రీత్యా తిరుపతి ఎస్.వి. ఆర్ట్స్ కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకునిగా, శ్వేత డైరెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించాడు.[3]

మూలాలు

మార్చు
  1. Demand for ‘Greater Rayalaseema' gains pace
  2. Byreddy to begin padayatra on October 2
  3. పొద్దు. "భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి గురించి". పొద్దు. పొద్దు. Retrieved 10 March 2015.

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=భూమన్&oldid=2639454" నుండి వెలికితీశారు