భూమి రికార్డులు
భూ పరిపాలన వ్యవహారాలు చూసే అతి ముఖ్యమైన వ్యవస్థ రెవెన్యూ. వాడుకలో ఉన్న రెవెన్యూ పద బంధాలు అన్నీ దాదాపు ఆంగ్లంలోనే ఉంటాయి. రెవెన్యూ వ్యవహారాలు తెలిసిన వారికి అనేక రెవెన్యూ పదజాలం గూర్చి తెలిసి ఉంటుంది. [1]
భూమి రికార్డులు, వాటి పదజాలం
మార్చు- రీ సెటిల్‌మెంట్ రిజిష్టర్ (ఆర్‌ఎస్‌ఆర్)
ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం భూమి సేకరణకు ఇదే ఆధారం. ఆర్‌ఎస్‌ఆర్ రిజిష్టర్‌ల్లో ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి(వ్యక్తులు), ఈనాం భూములు, దేవదాయ, వక్ఫ్ భూములు, వాగులు, వంకలు లాంటి వివరాలు ఉంటాయి. ఈ సమాచారం వీఆర్‌ఓ, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలతోపాటు జిల్లా స్థాయిలో ఏడీ కార్యాలయంలో ఉంటాయి.
- 1బీ రికార్డు
దీనిప్రకారం ఒక రైతుకు రెవెన్యూ విలేజ్‌లో ఏఏ సర్వే నంబర్‌లో ఎంత విస్తీర్ణం భూములు ఉన్నాయో తెలుస్తుంది. పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న ఖాతా నంబరు, అనుభవదారుడు వివరాలు కూడా వుంటాయి. గతంలో దీనిని 10 (1) అడంగల్ అని పిలిచేవారు.
- రికార్డ్ ఆఫ్ రైట్ (ఆర్‌ఓఆర్)
భూమి యాజమాన్య హక్కుపై వివాదం తలెత్తినప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్(ఆర్వోఆర్)ను ప్రామాణికము. దీనిలో ప్రభుత్వ భూములు, బంజరు భూములు, వక్ఫ్ బోర్డు భూముల వివరాలుంటాయి.
- డైగ్లాట్
గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటికీ మూలాధారం ఇది. ప్రతి గ్రామంలో సర్వే సెటిల్‌మెంటు భూమి వివరాలు నమోదు చేస్తారు. అన్ని రకాల భూములు, వాటి సర్వే నంబర్లు, విస్తీర్ణం, వాటి వర్గీకరణ, శిస్తు వివరాలు వుంటాయి.
- ఆక్రమిత భూమి రిజిష్టర్ (అడ్‌వర్స్ పొసెషన్)
భూమిపై హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొందకుండా ఆ భూమిని స్వాధీనంలో(వాస్తవంగా, శాంతియుతంగా, బహిరంగంగా) ఉంచుకునే దానిని అడ్‌వర్స్ పొసెషన్ అంటారు. పట్టా భూమి 12 సంవత్సరాలు, ప్రైవేట్ భూమి 30 సంవత్సరాలు స్వాధీనంలో ఉంటే సివిల్ కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు పొందవచ్చు.
- అజమాయిషీ
గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. వీఆర్‌ఓ, మండల ఆర్‌ఐ పొందుపరిచిన లెక్కల్లో వివరాలను కొన్నింటినైనా డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ తనిఖీ చేయాలి. అలా తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్క నం.3లో నమోదు చేస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రక్రియ ఇది.
- ఆవాదీ/గ్రామ కంఠం
గ్రామంలో ప్రజలు నివసించే భూమిని ఆవాది అని గ్రామ ఉమ్మడి స్థలాన్ని గ్రామ కంఠంమని పిలుస్తారు.
- అగ్రహారం
బ్రాహ్మణులకు శిస్తు లేకుండా లేదా రాయితీ శిస్తుతో గ్రాంటుగా వచ్చిన గ్రామం లేదా గ్రామంలోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు
- ఫసలీ
ఏటా జూలై 1 నుంచి మరుసటి ఏడాది జూన్ 30వ తేదీ వరకు మొత్తం 12 నెలల పంట కాలాన్ని బట్టి దీనిలో వివరాలుంటాయి. ఇందులో అడంగల్‌లో నమోదైన వివరాలు ఉంటాయి. ఏ ఏటికాఏడు భూములు అమ్మకాలు కొనుగోళ్లు జరిపినపుడు, ప్రస్తుత రైతు పేరును కొట్టివేసి కొత్త రైతు పేరును చేరుస్తారు. భూమి కొనుగోలుదారులు కొనుగోలు పత్రాలను తీసుకొని రెవెన్యూ అధికారులను సంప్రదించి అడంగల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.
- ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్ (ఎఫ్‌ఎంబీ)
దీనిలో అన్ని సర్వే నంబర్ల పటాలు వాటి నిర్ధిష్ట కొలతలతో సహా ఉంటాయి.
- జమాబందీ
జమాబందీ అంటే ప్రభుత్వానికి రావాల్సిన భూమి పన్ను, నీటి పన్ను ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం. మండల స్థాయి అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనే పరిశీలన. రైతులు తమ సాధకబాధకాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి కూడా ఇదే వేదిక. ఏడాదికి ఒకసారి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర డిప్యూటీ కలెక్టర్లు పరిశీలిస్తారు.
- అడంగల్/పహాని
ప్రతి ఏటా సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిష్టరు. ఆంధ్రప్రదేశ్ లో అడంగల్ అని, తెలంగాణలో పహాని అని అంటారు. అడంగల్‌లో రైతుల పేర్లు నమోదై ఉంటే ఆ భూమిపై పూర్తి హక్కు వున్నట్లే. భూముల క్రయ విక్రయాలు చేయాలంటే ఇదే ప్రామాణికం. గతంలో ‘గ్రామ లెక్క నంబర్
మూలాలు
మార్చు- ↑ "ఏమీ పదాలు.. విచిత్రంగా ఉన్నాయే! | Sakshi". web.archive.org. 2019-08-14. Archived from the original on 2019-08-14. Retrieved 2022-02-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)