భూస్వామ్య వ్యవస్థ
భూస్వామ్య వ్యవస్థ (Feudalism) అంటే ఆర్థిక, న్యాయ, సైనిక, సాంస్కృతిక కట్టుబాట్లు కలగలిసిన సామాజిక రాజకీయ వ్యవస్థ. ఇది మధ్యయుగం కాలంలో ఐరోపా ఖండంలో 9 నుంచి 15 వ శతాబ్దాల మధ్యలో విలసిల్లింది.
వ్యవసాయం చేయడంలో ప్రత్యక్ష పాత్ర లేనివారు, దాని ద్వారా వచ్చే లాభాన్ని వారసత్వంగా అనుభవించే ఆర్థిక వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థలో ప్రధాన భాగం.
చరిత్ర
మార్చుసామ్రాజ్యంలో పాలన వికేంద్రీకరణ ఫలితంగా భూస్వామ్య వ్యవస్థ వివిధ రూపాల్లో రూపుదిద్దుకుంది.
భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ
మార్చుభారతదేశంలో రాజుల కాలం నుండి భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉంది. ఇందులో రాజుల కింద భూస్వాములు పనిచేసేవారు. రాజు సొంత సైన్యాలతో పాటు భూస్వాముల సైన్యం కూడా రాజ్య విస్తరణలో సహాయ పడేది. రెవెన్యూ పాలనలో భూస్వాముల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది.[1]
మూలాలు
మార్చు- ↑ "రాజపుత్రులు - సాంస్కృతిక సేవలు". EENADU PRATIBHA. Retrieved 2022-03-09.