భూ కేంద్రక సిద్ధాంతం

ఆకాశంలో చలించే సౌర కుటుంబంలోని భూమి, చంద్రుడు మొదలయిన రాశులన్నీ చాలా కాలంగా ఎంతో కుతూహలాన్ని రేకెత్తిస్తుండేవి. ఈ గ్రహాల చలనాలను ఒక పద్ధతి ప్రకారం పరిశీలించిన వారు గ్రీకు దేశస్థులు. గ్రీకుల ఖగోళ పరిశీనలన్నింటినీ తెలియజేసిన శాస్త్రవేత్త టాలెమీ (క్రీస్తుశకం రెండవ శతాబ్దం వాడు). అతని సిద్ధాంతాన్ని టాలమిక్ సిద్ధాంతం లేదా భూకేంద్రక సిద్ధాంతం అంటారు. దాని ప్రకారం విశ్వానికంతటికీ భూమి కేంద్రంగా ఉందనీ సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతుంటాయనీ తెలుస్తుంది. ఈ సిద్ధాంతం సుమారుగా 1400 సంవత్సరములు అందరి ఆమోదం పొందింది. పదహారవ శతాబ్దంలో కోపర్నికస్ అనే పోలెండు దేశపు సన్యాసి సూర్యకేంద్రక సిద్ధాంతంను ప్రతిపాదించాడు.[1][2]

టాలమీ భూకేంద్రక సిద్ధాంత నమూనా

మూలాలు

మార్చు
  1. Kuhn 1957, pp. 5–20.
  2. Gandz, Solomon (1953). "The distribution of land and sea on the Earth's surface according to Hebrew sources". Proceedings of the American Academy for Jewish Research. 22: 23–53. doi:10.2307/3622241. JSTOR 3622241. Like the Midrash and the Talmud, the Targum does not think of a globe of the spherical earth, around which the sun revolves in 24 hours, but of a flat disk of the earth, above which the sun completes its semicircle in an average of 12 hours.