భూ మధ్యస్థ కక్ష్య

భూమి చుట్టూ ఉన్న రోదసిలో భూ నిమ్న కక్ష్య (2,000 కి.మీ ఎత్తు) కీ భూ స్థిర కక్ష్య (35,786 కి.మీ ఎత్తు) కీ మధ్య గల ప్రాంతాన్ని భూ మధ్యస్థ కక్ష్య (ఇంగ్లీషు: Medium Earth orbit) గా వ్యవహరిస్తారు.[1] దిశానిర్దేశనం, సమాచార వ్యవస్థ, రోదసీ పర్యావరణ శాస్త్రాలకి ఈ ప్రాంతం ఎక్కువగా ఉపయోగపడుతోంది.[1] ఈ కక్ష్యలోని సర్వసాధారణ ఎత్తు 20,200 కి.మీ (12 గంటల భ్రమణ కాలం). గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (Global Positioning System) ఈ కక్ష్యలోనే ఉంది. ఈ ప్రాంతంలో గ్లోనాస్ (GLONASS -19,100 కి.మీ ఎత్తు), గెలీలియో ( Galileo 23,222 కి.మీ ) ఉపగ్రహ కూటమి వంటివి కూడా ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ధృవాలకి అందుబాటులో ఉండవలసిన ఉపగ్రహాలు కూడా భూ.మ.క లోకే ప్రక్షేపించబడతాయి.[2]

భూ స్థిర, GPS, GLONASS, Galileo, Compass (MEO), అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, హబుల్ అంతరిక్ష టెలిస్కోపు, ఇరిడియమ్ తోరణం కక్ష్యలు, వాన్ అల్లెన్ రేడియేషన్ బెల్టులు, భూమి ల పోలిక.[lower-alpha 1] చంద్రుని కక్ష్య భూ స్థిర కక్ష్య కంటే 9 రెట్లు పెద్దది.[lower-alpha 2] (In the SVG file, ఏదైనా కక్ష్యపై లేదా దాని లేబులుపై మౌసును కదిలిస్తే అది హైలైటవుతుంది; దాన్ని నొక్కితే సంబంధిత వ్యాసం లోడవుతుంది.)
To-scale diagram of low, medium and high earth orbits

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Definitions of geocentric orbits from the Goddard Space Flight Center". User support guide: platforms. NASA Goddard Space Flight Center. Archived from the original on 2010-05-27. Retrieved 2012-07-08.
  2. "Satellite Basics: Solution Benefits". Archived from the original on 2012-12-14. Retrieved 2013-07-11.


ఉదహరింపు పొరపాటు: "lower-alpha" అనే గుంపుకు <ref> ట్యాగులున్నాయి, కానీ సంబంధిత <references group="lower-alpha"/> ట్యాగేదీ కనబడలేదు. లేదా మూసే </ref> లేదు