భైరవయ్య
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
భైరవయ్య అసలు పేరు మన్‌మోహన్ సహాయ్. ఇతడు నిరసనకవిగా, దిగంబరకవిగా ప్రసిద్ధుడు. ఇతని విద్యాభ్యాసం నరసాపురం, విశాఖపట్నం, హైదరాబాదులలో నడిచింది. ఇతడు హైదరాబాదు నుండి వెలువడిన నవత త్రైమాస పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. తర్వాతి కాలంలో ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళిపోయారు [తెలుగు అకాడమీ]
భైరవయ్య | |
---|---|
జననం | మురుకుట్ల మన్మోహన్ సహాయ్ 1942 డిసెంబరు 8 నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
ఇతర పేర్లు | ధనుస్సు, కైవల్య |
ప్రసిద్ధి | దిగంబర కవి, నిరసన కవి |
మతం | హిందూ |
రచనలు
మార్చుగ్రంథాలు
మార్చు- రా
- విషాద భైరవం
కథలు
మార్చు- అక్షతలు
- అగ్ని శిఖ
- అడుగుల చప్పుడు
- అన్నపూర్ణ
- అమ్మా...
- అల్లుడుగారొచ్చేశారండి
- ఇదంక్షేత్రం
- ఇది ఇంతే
- ఉద్యోగం
- ఎగసాయం సెయ్యాలి కదండీ
- కనిస్టీబు పెద్దప్పుడు
- కరణంగారి బి.ఏ. అల్లుడు
- కామయ్యశెట్టి-కడుపునొప్పి
- కిట్టయ్య మేస్టారు
- గండపెండేరం
- గుండుసూది
- గువ్వదీపం
- చిరునవ్వొచ్చింది
- డూయూలవ్ మీ?
- తలవంచుకో బ్రదర్
- తాపీమేస్త్రీ తవిటయ్య
- తిమింగిలం
- ది డర్టీ డాగ్
- దెయ్యం వదిలింది
- దేశం రాళ్లేసింది
- ధర్మసూక్ష్మం
- నష్ట పరిహారం
- నీ శ్రాద్ధంబెట్ట...
- పగిలిన నవ్వు
- పరువా-మరోటా
- పాపం చిట్టబ్బాయండి
- పిచ్చిదేముడు
- పుష్కలావర్తుడు
- పెసరట్ల పెద్దబ్బాయి
- బలవంతమైన సర్పము
- బ్రద్దలైన చీకటి
- భూషలు గావు...
- మంచి గంధపు చెక్క
- మామ్మగారంటే మామ్మగారండీ
- మునగపల్లె
- మున్సబ్ గారంటే
- యెప్పుడూ మావేనేటండి
- రాజేంద్రుడెవ్వడు?
- రాబందునీడ
- రాములోరు పూనారటండి
- రేడియో టాకీ
- వారంరోజులు బెంచీ ఎక్కరా
- శరీరమాద్యం...
- సబలాం ప్రపద్యే
- సాలెగూడు
- సీతారామాభ్యాన్నమ:
రచనల నుండి ఉదాహరణ
మార్చునేను చెరచబడ్డ గీతాన్ని
నగ్నంగా నడివీధిలో కాటేసిన భూతాన్ని
స్వార్థపు కాంక్రీటు తొడలమధ్య
నలిపివేయబడ్డ రాగాన్ని
కీర్తి రతి తీరని బాబాకరుల
భయంకర
నఖక్షతాలకి, దంత క్షతాలకి
పుళ్ళుపడి కుళ్ళిపోయిన వక్షాన్ని
నేను గీతాన్ని !
కేరింతలు కొట్టి
పరులకైత తమదని భేరి మ్రోగించి
చలామణి చేయించే
చాపల్యుల చవకబారు కామోద్రేకానికి
చచ్చి పుచ్చిపోయిన పిండాన్ని
ముద్రాక్షతలతో తమ రాక్షసత్వాన్ని
లిఖించుకోవాలని
తాపత్రయపడే తుచ్ఛులు
స్వైరవిహారం చేసిన శరీరాన్ని
రసాన్ని వదిలి
రాక్షసత్వాన్ని ప్రతిబింబించిన రూపాన్ని
నేను గీతాన్ని
అసహ్యంగా - అసభ్యంగా
బహిరంగంగా - బాహాటంగా
సిగ్గులేక - చాకచక్యంలేక
నీచంగా - ఛండాలంగా
చెరచబడ్డ గీతాన్ని
చిత్రించబడ్డ భూతాన్ని!