ఆంధ్ర మరియా తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకులలో భాగంగా ఒక ముఖ్యమైన  వేడుక భోగి పళ్ళ సంబరం. సంక్రాతి సంబరాలలో మొదటి రోజు వచ్ఛే పండుగ భోగి. మామూలు ఆంగ్ల సంవత్సరంలోని జనవరి మాసంలో పదమూడవ రోజు, లీపు సంవత్సరంలో పద్నాల్గవ రోజు వస్తుంది.ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్లు పోస్తారు. కొన్ని సముదాయాలల్లో ఈ సంబరాన్ని సంక్రాంతినాడు కూడా జరుపుకుంటారు. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు, చిటికెడు పసుపు, బియ్యం కూడా కలుపుతారు. సహజంగా 5 ఏళ్ళు లోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగిరోజున పిల్లలు కొత్త దుస్తులు ధరిస్తారు. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు హారతి ఇచ్చి, దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా భోగి పళ్ళ్లుని తీసుకుని, మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు.[1]

నమ్మకాలు మార్చు

పిల్లలకి భోగి పళ్ళు పొయ్యడం వలన కింద వర్ణించిన అనేక ప్రయోజనాలు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు .

  • చిన్నారులకి నర దృష్టి , గ్రహపీడనివారణ కలుగుతుంది.
  • తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.
  • రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియా పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలిగిపోతుందని భావిస్తారు.
  • సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు.[2]
  • రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే. చర్మసంబంధమైన ఎలాంటి వ్యాధినుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది.[3]

భారతీయ సంప్రదాయంలో రేగి పండు ప్రాముఖ్యత. మార్చు

రేగి పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. నరనారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారనీ, ఆ ఫలాలని తింటూ తమ తపస్సుని కొనసాగించారనీ ప్రతీతి. మరి కొందరు నరనారాయణులు శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి  బదరికావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. దక్షిణభారతదేశంలో సంక్రాంతినాటికి ఈ రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడుదొడుకులనైనా ఎదుర్కొని పెరుగుతుంది. -15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకూ ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుని నిలబడుతుంది.[4]

మూలాలు మార్చు

  1. "భోగి పళ్ళు సంప్రదాయం".
  2. Kamala, Jyothi. "Bhogi Pallu Function Procedure Pooja Items Decoration Ideas". https://tirumalatirupationline.com/. Tirumala Tirupati Online. Retrieved 30 December 2023. {{cite web}}: External link in |website= (help)
  3. "భోగి పండ్లను పిల్లల నెత్తిన ఎందుకు పోస్తారు?".
  4. "భోగి పళ్లు ఎందుకు పోస్తారంటే!".