భౌతిక మానవ శాస్త్రం

భౌతికశాస్త్రం : శాస్త్రీయ పధ్ధతిననుసరించి మానవుడు విజ్ఞాన సేకరణ చేయగలిగాడు. ఈ శాస్త్రీయ విజ్ఞానామ్ అపారమైనది. పదార్థాల స్థితి, గతి, శక్తి ధర్మాలను తెలిపే శాస్త్రాన్నే "భౌతిక శాస్త్రం" అంటారు. ద్రవ్యం - శక్తి అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్ర శాఖ భౌతిక శాస్త్రం. రసాయన శాస్త్రం, భూశాస్త్ర శాఖలను అధ్యయనం చేయడానికి కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.రోదషి కుహరంలోనికి పరిశోధన పంపడానికి, అక్కడ మానవుడు కాలు మోపడనికి,భూమి చుట్టూ కక్షల్లో కృత్రిమ ఉపగ్రహాలు పంపడానికి ఈ భౌతికాశాస్త్ర నియమాలు మూలాధారాలు.బౌతికాశాస్త్రం అభివృద్ధి క్రమంలో 17వ శతాబ్దంలో 'ఇజాక్ న్యూటన్' అనే శాస్త్రవేత్త యొక్క గతి నియమాలే కారణం గా చెప్పవచ్చు. కాలక్రమేణా 20వ శతాబ్దం ఆరంభంలో 'ఆల్బర్ట్ ఐన్స్టీన్' సాపేక్ష సిద్ధాంతాన్ని (రెలివిటీ) ప్రవేశపెట్టడం ద్వారా భౌతిక శాస్త్రానికి మైలురాయి ఏర్పడింది. అదేవిధంగా తరువాతకాలంలో కూడా అనేకమంది శాస్త్రవేత్తలు కృషి చేసి భౌతిక శాస్త్రాన్ని అభివృద్ధి చేసి అందులో అనేక విభాగాలు ఏర్పడడానికి దోహధపడ్డారు. అయితే ఇప్పుడు ఆ విభాగాలు గురించి తెలుసుకుందాం. A. యాంత్రిక శాస్త్రం : బలం ప్రయోగించినప్పుడు పదార్థాల్లో కలిగే మార్పును ఈ శాస్త్రం వివరిస్తుంది..కనుక దీనిని యాంత్రిక శాస్త్రం అంటారు. B. గతి శాస్త్రం : చాలనంలో ఉండే వస్తువులపై బలప్రభావం గురించే తెలిపేదే 'గతిశాస్త్రం'. C. స్థితి శాస్త్రం : నిశ్చలస్తితి లో ఉండే వస్తువులపై బలం కలుగుచేసే మార్పు గురించి వివరించే శాస్త్రం ఇది. D. ద్రవస్థితి శాస్త్రం : ద్రావపదార్థాలపై బలప్రయోగం చేస్తే వచ్చే ఫలితాలు గూర్చి వివరిస్తుంది. E. ఉష్ణం శాస్త్రం : పదార్థాలు పై ఉష్ణం ప్రయోగం గూర్చి తెలిపే శాస్త్ర విభాగం. F. కాంతి : పదార్థాలు పై కాంతి ప్రభావం వలన కలిగే మార్పులు గూర్చి తెలిపే శాస్త్రం. G. అయస్కాంతము : అయస్కాంత స్వభావము, ఉపయోగములు, ప్రయోగాలు గూర్చి తెలిపేశాఖ. H. ధ్వని : ధ్వని కోసం వివరించే శాస్త్ర విభాగం శాఖ. I.విద్యుత్ : విద్యుత్తును గూర్చి వివరించే శాస్త్రం J. పరమాణు భౌతిక శాస్త్రం : పరమణువు, నిర్మాణము, ధర్మాలు గూర్చి వివరించే శాస్త్రం. K. జీవ భౌతిక శాస్త్రం : జీవి, జీవప్రక్రియకు సంబంధించిన భౌతికశాస్త్రం. L.విద్యుత్ గతిశాస్త్రం : విద్యుత్, యాంత్రిక శాస్త్రాల పరస్పరసంబంధాలు గురించి తెలుసుకునే శాస్త్రం. M. కేంద్రక బౌతికాశాస్త్రం : పరమాణు కేంద్రకాన్ని గూర్చి కేంద్రకంలో జరుగు భౌతిక, రసాయనిక మార్పులు, చర్యలు గూర్చి అధ్యయనం చేయునది. N. అతిశీతల శాస్త్రం : అతిశీతల ఉష్ణోగ్రత గూర్చి అధ్యయనం చేయు శాస్త్రం. O. చాక్షుస శాస్త్రం : వెలుతురు గూర్చి అధ్యయన ము చేయునది. P. ఘణ-స్థితి భౌతిక శాస్త్రం : ఘణ స్థితిలో ఉన్న ధాతువుల ధర్మాలు, తాపాప్రెష ప్రభావములు గూర్చి తెలిపే శాస్త్రం. Q. ఉష్ణశాస్త్రం : ద్రవ్యాలపై ఉష్ణప్రభావాన్ని గూర్చి అధ్యయనం చేయు విభాగం. R. ద్రవ భౌతిక శాస్త్రం : ఆవిరిపై ఆధ్యాయానము చేయునది. S. భూ భౌతిక శాస్త్రం : భూమిని గూర్చి భౌతిక అధ్యయనం.

T. తాపగతి శాస్త్రం : పని-శక్తుల గూర్చి అధ్యయనం చేయు శాస్త్రం.

ప్రమాణాలు : నిత్య జీవితంలో వస్తువులను తూచడానికి, ద్రవాలనును కొలవడానికి, కాలాన్ని గుర్తించడానికి,వస్తువుల పొడవలను కలవడానికి కొలతలు అవసరం. ఇలా కొలిచేందుకు వీలున్న రాశి భౌతికరాశి అంటారు. పొడవు, ద్రవ్యరాశి, కాలమును ప్రాధమిక భౌతిక రాశులు అంటారు. ఏదైనా భౌతిక రాశి కొలుచుటకు ఒక నిశ్చితమైన రాశి అవసరం దీనినే ప్రమాణం అంటారు.

ప్రమాణాల్లోని రకాలు : ప్రమాణాలు మూడు రకాలుగా విభజించారు. ప్రాధమిక ప్రమాణాలు ఉత్పన్న ప్రమాణాలు


అంతర్జాతీయంగా ప్రాధమిక ప్రమాణాలను CGS పద్దతి, FPS పద్ధతి, MKS పద్ధతి SI పద్ధతిలో తెలియజేస్తారు. CGS, MKS పద్ధతులను మెట్రిక్ పద్ధతి అంటారు. MKS పద్ధతిని ప్రస్తుతం SI పద్ధతి అంటారు. ఇప్పుడు SI పద్ధతిని ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు. భౌతిక రాశి