భౌతిక శాస్త్రం నోబెల్ బహుమతులు 2023

పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికను శోధించినందుకు గాను ' పియర్ అగోస్తి, ఫెరెంక్ క్రౌజ్, యాన్.ఎల్. హ్యులియర్ ' ముగ్గురికి 2023 సంవత్సరానికి భౌతిక శాస్త్ర విభాగంలో నోబుల్ పురస్కారానికి ఎంపికయ్యారు[1]. వీరి పరిశోధన కారణంగా ఎలక్ట్రాన్ల పరిశీలన చాలా సులువు అయిందని ఎంపిక కమిటీ తెలియజేసింది[2]. వ్యాధి నిర్ధారణ రంగంలో నూతన ఆవిష్కరణలకు, సరికొత్త ఎలక్ట్రాన్ ఉపకరణాల రూపకల్పనకు ఇది మార్గం సులభతరం చేస్తుందని పేర్కొంది[3]. ' వీరి ముగ్గురి ప్రయోగాల కారణంగా అణువులు, పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లపై పరిశోధనలకు కొత్త సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. స్వల్ప స్థాయి కాంతి తరంగాలను సృష్టించడానికి ఒక మార్గాన్ని వీరు సిద్ధం చేశారు. వేగవంతమైన ఎలక్ట్రాన్ల కదలికలు, వాటి శక్తిలో వచ్చే మార్పులను కొలవడానికి ఇది ఉపయోగపడుతుంది' అని ఎంపిక కమిటీ వెల్లడించింది.

మూలాలు :

  1. Desam, A. B. P. (2023-10-03). "భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం, ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ". telugu.abplive.com. Retrieved 2023-10-08.
  2. Telugu, ntv (2023-10-03). "Nobel Prize 2023: భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని అందుకున్న వారు వీరే..!". NTV Telugu. Retrieved 2023-10-08.
  3. "Nobel Prize in Physics 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వ‌రించిన‌ నోబెల్". Sakshi Education. Retrieved 2023-10-08.