మండలాధీశుడు
మండలాధీశుడు 1987లో విడుదలైన తెలుగు సినిమా. వర్మ పిక్చర్స్ పతాకంపై డా.డి.వి.ఎన్ రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎం.ప్రభాకరరెడ్డి దర్శకత్వం వహించాడు. కోట శ్రీనివాసరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, భానుమతి, జమున ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి రాకజ్-కోటి సంగీతాన్నందించాడు.[1]
మండలాధీశుడు (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రభాకర్ రెడ్డి |
---|---|
తారాగణం | భానుమతి, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | డి.వి.ఎన్.రాజు |
భాష | తెలుగు |
నేపథ్యం
మార్చుమండలాధీశుడు ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో కోట శ్రీనివాసరావు ప్రధానపాత్రలో నటించిన 1987 నాటి రాజకీయ నేపథ్యమున్న తెలుగు చలన చిత్రం. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో అతని వ్యవహారశైలి మీద, ప్రభుత్వం మీద వ్యంగ్యంగా విమర్శించే కథాంశంతో ఈ సినిమా తీశారు.
తారాగణం
మార్చు- కోట శ్రీనివాసరావు
- జమున
- భానుమతి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: మందాడి ప్రభాకర రెడ్డి
- సినిమా నిడివి 135 నిమిషాలు
- స్టుడియో: వర్మ పిక్చర్స్
- నిర్మాత: డి.వి.ఎన్.రాజు
- సంగీతం: రాజ్ కోటి
- విడుదల: 1987 ఫిబ్రవరి 26
మూలాలు
మార్చు- ↑ "Mandaladeeshudu (1987)". Indiancine.ma. Retrieved 2020-08-31.