మండ కామేశ్వర కవి
మండ కామేశ్వర కవి (1849 - 1904) ప్రముఖ సంస్కృత, హిందీ పండితులు.[1]
వీరు విజయనగరం వాస్తవ్యులు. వీరు విజయనగర సంస్థానంలో విజయరామ గజపతి, ఆనంద గజపతి రాజుల ఆస్థాన విద్వాంసులుగా ఉండేవారు. వీరు హిందీ భాషలో కూడా మంచి పండితులు. తులసీదాసు రచించిన రామచరిత మానస్ ను తులసీరామాయణం పేరుతో తెలుగులోకి అనువదించారు. కూర్మ పురాణం పేరుతో ఒక కావ్యం రచించారు. దానిని అలక రాజేశ్వరీ దేవికి అంకితమిచ్చారు. రామకథ సాగరం, దేవీ లీలా తరంగిణి మొదలైన రచనలు చేశారు. అన్నింటిని రాజుగారి సహకారంలో ముద్రించబడ్డాయి.
మూలాలు
మార్చు- ↑ కామేశ్వరకవి మండ, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 73.