మకర లగ్నము
మకర లగ్నస్థ గ్రహాలు
మార్చుమకర లగ్న జాతకులు నియమానుసారంగా నడచుటకు ఆసక్తి చూపుతారు. వీరు సన్నగా ఉంటారు, కొంచం మొరటు స్వభావం కలిగి ఉంటారు. వారి స్వ విషయంలో ఇతరుల జోక్యం వీరు సహించరు. వివాహ విషయంలో కొంచం వివాదాలు ఉంటాయి.మకర లగ్నస్థ గ్రహ ఫలితాలను కింద చూడ వచ్చు.
- సూర్యుడు :- మకరలగ్నానికి సూర్యుడు అష్టమాధిపతి. అష్టమాధిపతి లగ్నంలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుటకు అవకాశం ఉంది. ఎముకల నొప్పి, ఉదర సంబంధ రోగములు కలిగే అవకాశం ఎక్కువ. నేత్ర వ్యాధులలు కలుగుతాయి. పేరాశ, స్వార్ధ చింతన ఎక్కువ. సూర్యుడు తన శత్రు స్థానమున ఉండడం కారణంగా జీవితంలో కఠిన పరిస్థితిని ఎదుద్కో వలసి వస్తుంది. కఠిన పరిస్థితులలోఆత్మబలంతో పరిశ్రమతో విజయం సాధిస్తారు. గృహస్థ జీవితంలో ఓడి దుడుకులు ఉంటాయి. వ్యాపారం చేయాలన్న కోరిక ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కలగలుపుగా ఉంటాయి.
- చంద్రుడు :- మకర లగ్నంలో చంద్రుడు సప్తమాధిపతి. శత్రు రాశిలో లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి సఒందర్యం ఇస్తాడు. కాని చంద్రుడు శత్రు స్థానంలో ఉన్న కారణంగా విచిత్ర మనస్తత్వం ఉంటుంది. నేత్రములు, చెవుల అందు వ్యాధులు ఉంటాయి. చంద్రుడు లగ్నం నుండి సప్తమ స్థామును మీద దృష్టి సారించడం వలన జీవిత భాగస్వామి అందం, గుణం కలిగి ఉండును. జీవిత భాగ స్వామితో అన్యోన్యం అనుకూలత కలిగి ఉంటారు.
- కుజుడు :- మకర లగ్నానికి కుజుడు సుఖాధిపతి, లాభాధిపతి ఔతాడు. కుజుడు లగ్నంలో ఉంటే ఆవ్యక్తి క్రోధ స్వభావం కలిగి ఉంటాడు. తండ్రి వైపు బంధువుల
సహకారం లభిస్తుంది. తండ్రి వలన పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. శని ప్రభావంగా తండ్రి వైపు ఆస్తులు త్యాగం చేయవలసిన పరిస్థితి సంభవించగలదు. లగ్నస్థ కుజుడు నాలుగు, ఏడు, ఎనిమిది స్థానాల మీద దృష్టి సారిస్తాడు కనుక ధార్మిక ఉంటుంది. కుటుంబ జీవితంలో కలతలు కలుగుతాయి.
- బుధుడు :- మకర లగ్నానికి బుధుడు షటమ, నవమాధిపతి ఔతాడు. మకర లగ్నస్థ బుధుడు వ్యక్తికి జ్ఞానం, బుద్ధికుశలత కలిగి ఉంటాడు. వీరికి దైవ భక్తి, దయా స్వభావం, కళాభిరుచి కలిగి ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, ధనం ప్రాప్తిస్తాయి. సప్తమ స్థానం మీద బుధ దృష్టి ఫలితంగా జీవిత భాగస్వామి అందంగా ఉండును. షష్టామాధిపతి దృష్టి క్లారణంకా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. సంతానం కలగడానికి జాప్యం కలుగ వచ్చు.
- గురువు :- మకర లగ్నానికి గురువు తృతీయ వ్యయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక గురువు ఈ లగ్నానికి అకారక గ్రహం ఔతాడు. లగ్నస్థ గురువు వ్యక్తికి జ్ఞానం, సుగుణం కలిగి ఉంటాడు. వీరికి క్షమాగుణం మెండు. అయినా వీరు వారి యోగ్యతను గుణమును సద్వినియోగపరచ లేరు. ఇతరుల కలతలు వీరిని ప్రభావితంచేస్తాయి కనుక కొన్ని సమస్యలను ఎదుకొంటారు. లగ్నస్థ గురువు పంచమ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టి సారిస్థాడు కనుక వివాహానంతరం అదృష్టం ప్రాప్తిస్తుంది.
- శుక్రుడు :- మకర లగ్నానికి పంచమ, సప్తమ, దశమ స్థానాలకు కారకత్వం వహిస్తాడు. మకర లగ్నానికి శుక్రుడు శుభుడు. మకర ల్;అగ్నస్థ శుక్రూడి కారణంగా వ్యక్తి అందం, బుద్ధి కుశలత కలిగి ఉంటాడు. లగ్నస్థ శుక్రుడు వీరిని విలాసవంతులు, స్వార్ధపరులుగా చేస్తుంది. తమ అవసరానికి అనుగుణంగా బుద్ధిని మార్చుకుంటారు. వీరు అవసరార్ధం మిత్రులను కలిగి ఉంటారు. స్త్రీలైన పురుషుల పట్ల పురుషులైన స్త్రీల పట్ల ఆకర్షితులు ఔతారు. సప్తమ స్థానమైన కటక రాశి మీద శుక్రుడి దృష్టి పడటం కారణంగా వీరి మీద జీవిత భాగస్వామి ప్రేమను అప్యాయతను కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సుఖ దుఃఖంలో సహాయ సహకారలను అందిస్తారు.
- శని :- మకర లగ్నస్థ శని లగ్నాధిపతి, ద్వితీయ స్థానాలకు ఆధిపత్యం వహిస్తూ కారక గ్రహం ఔతాడు. ఈ కారణంగా ఈ వ్యక్తి భాగ్యశాలి కాగలడు. ఆకర్షణీయమైన బలిష్టమైన శరీరాకృతి కలిగి ఉంటాడు. ఉద్యోగ వ్యాపారాలలో సాఫల్యం లభిస్తుంది. ఆకర్షణీయముగా మాట్లాడ లేరు. ప్రభుత్వ సేవారంగంలో పని చేసే అవకాశాం లభిస్తుంది. తల్లితో చక్కని సంబంధ బాంధవ్యాలు ఉంటాయి.శని తృతీయ, సప్తమ, దశమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామికి కష్టాలు ప్రాప్తిస్తాయి. వైవాహిక జీవితంలో కలతలు ఉంటాయి.
- రాహువు :- మకర లగ్నంలో రాహు స్థితి కారణంగా అనవసర తిరుగుడు అధికం. కార్య హాని జరగడానికి అవకాశం ఎక్కువ. అనుకున్న కార్యాలు సాధించడంలో సమయలు తలెత్తుతాయి. వ్యాపారంలో ఆసక్తి ఉన్నా ఉద్యోగమే లాభదాయకంగా ఉంటుది. వ్యవసాయంలో సమస్యలు కష్టములు అధికంగా కలుగుతాయి. లగ్నస్థ రాహువు సప్తమ దృష్టి కారణంగా సంసార జీవితంలో జీవిత భాగస్వామి నుండి మిత్రుల నుండి తగిన సహకారం లభించదు.
- కేతువు :- మకర లగ్నంలో ఉన్న కేతువు ఆరోగ్య సమస్యలకు హేతువు ఔతాడు. అన్ని సమయములలో అన్వేక కష్టములను ఎదుర్కొంటారు. శత్రువుల వలన హాని కలుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్ఠల కొరకు అనుచిత కార్యముల చేసి అపజయం పాలు ఔతారు. లగ్నస్థ కేతువు స్ర్తీలకు పురుషుల అందు పురుషులకు స్త్రీల అందు విపరీత ఆకర్షణ కలిగి ఉంటారు. సప్తమ స్థానం మీద కేతు దృష్టి కారణంగా భాగస్వామికి కష్టాలు కలుగుతాయి. భాస్వామి సహాయ సహకారాలు లభించవు.