మఖ నక్షత్రము

(మఖ నక్షత్రం నుండి దారిమార్పు చెందింది)

నక్షత్రములలో ఇది పదవది.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
మఖ కేతువు రాక్షస స్త్రీ మూషికము మర్రి అంత్య పెద్దపక్షి పితృ దేవతలు సింహం

మఖ నక్షత్ర జాతకుల తారాఫలాలు

మార్చు
తార నామం తారలు ఫలం
జన్మ తార అశ్విని, మఖ, మూల శరీరశ్రమ
సంపత్తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ ధన లాభం
విపత్తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ కార్యహాని
సంపత్తార రోహిణి, హస్త, శ్రవణం క్షేమం
ప్రత్యక్ తార మృగశిర, చిత్త, ధనిష్ఠ ప్రయత్న భంగం
సాధన తార ఆర్ద్ర, స్వాతి, శతభిష కార్య సిద్ధి, శుభం
నైత్య తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర బంధనం
మిత్ర తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర సుఖం
అతిమిత్ర తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి సుఖం, లాభం

మఖనక్షత్రము నవాంశ

మార్చు
  • 1 వ పాదము - సింహరాశి.
  • 2 వ పాదము - వృషభరాశి.
  • 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటకరాశి.

మఖ నక్షత్రము గుణగణాలు

మార్చు

మఖ కేతుగ్రహ నక్షత్రము కనుక ఈ నక్షత్రజాతకునికి మంత్రోపాసన, వైరాగ్యము, భక్తి సహజముగా అలవడతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికము. కేతువు ఆధిపత్యము, రాక్షస గణముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. ప్రతి విషయములో జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయం తీసుకోలేరు. పొదుపు చేసే గుణము ఉంటుంది. జీవితంలో అభద్రతా భావము అధికము. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి ఆధిపత్య గుణము అధికము. ఎవరికీ తల వంచని మనస్తత్వం వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారిగా రాణిస్తారు కాని కింది ఉద్యోగుల నిరసనకు గురియవుతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పోస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి అవుతారు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు కాని ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతము భద్రము చేస్తారు. వాటిని ఎవరిని ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయము నుండి రాత్రి వరకు శ్రమిస్తారు.నిద్ర లేమిని సహించరు. సహన గుణము తక్కువ. తన వారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితము స్వీకరించరు. జరిగిన వాటిని మరవక తలచి తలచి బాధపదతారు. లోటు లేని జీవితము జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగము, గృహయోగము, ఆర్థిక యోగము, విదేశీ యాన యోగము కలసి వస్తాయి.

చిత్ర మాలిక

మార్చు