మడోన్నా లూయిస్ సికోన్ (ఆంగ్లం:Madonna Louise Ciccone; 1958 ఆగస్టు 16) అమెరికన్ గాయని, పాటల రచయిత, నటి.[1] క్వీన్ ఆఫ్ పాప్గా పిలువబడే మడోన్నా సంగీత నిర్మాణం, పాటల రచన, దృశ్య ప్రదర్శనలతో తన బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందింది. సామాజిక, రాజకీయ, లైంగిక, మతపరమైన ఇతివృత్తాలతో ఆమె రచనలు వివాదం, విమర్శకుల ప్రశంసలు రెండింటినీ కలిగిఉంటాయి.[2]

మడోన్నా
2015లో మడోన్నా రెబెల్ హార్ట్ టూర్ ప్రదర్శన
జననం
మడోన్నా లూయిస్ సికోన్

(1958-08-16) 1958 ఆగస్టు 16 (వయసు 65)
బే సిటీ, మిచిగాన్, యు.ఎస్.
వృత్తి
  • సింగర్-గేయరచయిత
  • నటి
  • నర్తకి
  • రికార్డ్ నిర్మాత
  • దర్శకురాలు
  • రచయిత
  • వ్యాపారవేత్త
క్రియాశీల సంవత్సరాలు1979 – ప్రస్తుతం
  • రే ఆఫ్ లైట్ ఫౌండేషన్
  • రైజింగ్ మలావి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ప్రముఖ పాప్‌ సింగర్‌‌
Works
  • ఆల్బమ్స్ డిస్కోగ్రఫీ
  • పాటలు
    • సింగిల్స్ డిస్కోగ్రఫీ
  • వీడియోగ్రఫీ
  • కచేరీలు
  • ఫిల్మోగ్రఫీ
  • బిబ్లియోగ్రఫీ
  • ఫ్యాషన్ బ్రాండ్లు
జీవిత భాగస్వామి
సీన్ పెన్
(m. 1985; div. 1989)
గై రిచీ
(m. 2000; div. 2008)
భాగస్వామిCarlos Leon (1995–1997)
పిల్లలు6
బంధువులుక్రిస్టోఫర్ సికోన్ (సోదరుడు)
సంగీత ప్రస్థానం
మూలంNew York City, U.S.
సంగీత శైలి
  • Pop music
  • electronica
  • Dance music
లేబుళ్ళు
  • Sire Records
  • Warner Records
సంతకం

ఆల్బమ్స్, బిజినెస్ వెంచర్స్, రియల్ ఎస్టేట్, తన పేరిట అమ్ముడయ్యే వస్తువులు, ప్రకటనలు.. వెరసి ఆమె మహిళా పాప్ సింగర్స్‌లో మొట్టమొదటి బిలియనీర్‌గా ఎదిగింది. దీనికి తెలివైన పెట్టుబడి నిర్ణయాలూ సహకరించాయి.[3]

2000లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మడోన్నాను ఎప్పటికప్పుడు గొప్ప మహిళా కళాకారిణిగా పేర్కొంది. ఆమె ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఆల్బమ్ అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన మహిళా కళాకారిణి.[4] 2007 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, బిల్‌బోర్డ్ మ్యాగజైన్ రెండు కూడా అత్యధికంగా సంపాదిస్తున్న గాయకురాలుగా మడోన్నాను పేర్కొన్నాయి.[5] ఫోర్బ్స్ మడోన్నా నికర విలువ $80 మిలియన్లు అని తేల్చింది. మడోన్నా కన్ఫెషన్స్ టూర్ $200 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.[6]

వ్యక్తిగత జీవితం మార్చు

మడోన్నా లూయిస్ సికోన్ 1958 ఆగస్టు 16న బే సిటీ, మిచిగాన్‌లో కాథలిక్ తల్లిదండ్రులు మడోన్నా లూయిస్ (నీ ఫోర్టిన్), సిల్వియో ఆంథోనీ (టోనీ) సికోన్‌లకు జన్మించింది. ఆమె పూర్వీకులు ఇటాలియన్ వలసదారులు కాగా ఆమె తల్లి ఫ్రెంచ్-కెనడియన్ సంతతికి చెందినది. ఆమె కుటుంబ సభ్యులు మడోన్నాను లిటిల్ నానీ అని ముద్దుగా పిలుచుకుంటారు. మడోన్నా ఐదేళ్ల ప్రాయంలో ఆమె తల్లి రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది.

మడోన్నాకు ఇద్దరు అన్నలు ఆంథోనీ, మార్టిన్; ముగ్గురు తమ్ముళ్లు పౌలా, క్రిస్టోఫర్, మెలానీలతో మడోన్నా డెట్రాయిట్ శివారు ప్రాంతాలైన పోంటియాక్, అవాన్ టౌన్‌షిప్‌లో పెరిగింది.[7] 1966లో టోనీ హౌస్ కీపర్ జోన్ గుస్టాఫ్సన్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు, జెన్నిఫర్, మారియో. మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు తన తండ్రిపై మడోన్నా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వారి బంధాన్ని దెబ్బతీసింది.

మూలాలు మార్చు

  1. "Madonna Biography". Rock and Roll Hall of Fame. 2008. Archived from the original on March 29, 2010. Retrieved April 15, 2015.
  2. McGregor, Jock (2008). "Madonna: Icon of Postmodernity" (PDF). L'Abri. pp. 1–8. Archived from the original (PDF) on December 7, 2020. Retrieved March 29, 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; డిసెంబరు 7, 2010 suggested (help)
  3. "Greater revenue .. Madonna - Sakshi". web.archive.org. 2023-03-05. Archived from the original on 2023-03-05. Retrieved 2023-03-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. http://www.guinnessworldrecords.com/content_pages/record.asp?recordid=55387 Guinnessworldrecords.com
  5. In Pictures: The Richest 20 Women In Entertainment, Forbes magazine
  6. Waddell, Ray. "Stones' Bigger Bang Is Top-Grossing Tour Of 2006", [[Billboard (magazine)|]], 14 December 2006
  7. "The Child Who Became a Star: Madonna Timeline". The Daily Telegraph. July 26, 2006. Archived from the original on January 10, 2022. Retrieved June 9, 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=మడోన్నా&oldid=4076905" నుండి వెలికితీశారు