మధుమితా రౌత్ ఒడిస్సీకి చెందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. శాస్త్ర ఆధారిత పరిజ్ఞానంతో 1950 లలో ఒడిస్సీ పునరుద్ధరణకు దోహదపడిన మమతా కుంతియా, మాయాధర్ రౌత్ ల కుమార్తె.

కోణార్క్ సూర్య దేవాలయంలో ఒడిస్సీ భంగిమలో మధుమితా రౌత్

ఢిల్లీలో నివసిస్తున్న ఆమె జయంతికా అసోసియేషన్ కు చెందిన మాయాధర్ రౌత్ స్కూల్ ఆఫ్ ఒడిస్సీ డాన్స్ లో బోధిస్తున్నది. [1]

ప్రారంభ జీవితం, విద్య మార్చు

మధుమితా రౌత్ ఢిల్లీలో పెరిగింది. ఢిల్లీలోని భారతీయ విద్యాభవన్ స్కూల్, ఇంద్రప్రస్థ కళాశాలలో విద్యాభ్యాసం చేసింది. [2] ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది.

కెరీర్ మార్చు

మధుమితా రౌత్ ఒడిస్సీకి చెందిన మాయాధర్ రౌత్ ఘరానాలో పనిచేస్తుంది. ఆమె రచనలలో కవిత్వంపై కంపోజిషన్లు, గోథే కవితలపై కొరియోగ్రాఫిక్ కంపోజిషన్లు, నెదర్లాండ్స్‌లోని బాలినీస్ నర్తకి దియా తంత్రితో కలిసి ఫ్యూజన్ డ్యాన్స్‌లు ఉన్నాయి.  నెదర్లాండ్స్ టెలివిజన్ సంస్థ మధుమితపై డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించింది. స్టుట్‌గార్ట్ (జర్మనీ), హంగేరియన్ టెలివిజన్‌లు భారతదేశంపై తమ డాక్యుమెంటరీ చిత్రాలలో రౌత్ నృత్యాన్ని ప్రదర్శించాయి.

అవార్డులు మార్చు

  • ఒరిస్సా రాష్ట్రం ఘుంగూర్ సమ్మాన్ 2010 [3]
  • ఉత్కల్ కన్యా అవార్డు 2010
  • మహిళా శక్తి సమ్మాన్ 2010
  • భారత్ నిర్మాణ్ అవార్డు 1997 [4]
  • ఒడిశా లివింగ్ లెజెండ్ అవార్డు 2011 [5]

మూలాలు మార్చు

  1. "DANCE diaries". The Hindu. 2014-10-09.
  2. "Grand welcome awaits fuchchas". Times of India. 2007-07-08.
  3. "Annual awards of 'Ghungur' cultural organisation presented". The Hindu. 14 April 2011. Archived from the original on 19 February 2011.
  4. "Bharat Nirman Awards".
  5. "Odisha Living Legend Award (Excellence in Personal Achievement-NRO): Ms. Madhumita Raut". Archived from the original on 2013-03-07. Retrieved 2013-02-24.