మధురవాణి
మధురవాణి తంజావూరును పరిపాలించిన రఘునాథ నాయకుని ఆస్థానములో విదుషీమణులలో ఒకరు. "శుకవాణి" అని ఈమె మొదటి పేరు . సంస్కృతములో సుందరకాండ వరకు రామాయణాన్ని రచించింది. ఇది సంపూర్ణముగా లభించలేదు. 1500 శ్లోకములుగల 14 సర్గల గ్రంథము మాత్రమే లభించుచున్నది. రామాయణ సారా కావ్య తిలకము 9 సర్గాంత గద్యలలో" మధురైక ధురంధరాంద్ర కవితా నిర్మాణ సమ్మాన్యయా" అని ఈమె చెప్పుకున్నది.ఈమె అరఘడియలో వంద శ్లోకాలు చెప్పగలదు అని,ఆరు భాషలలో కవిత్వం చెప్పగలదు అని,చిత్ర కవిత్వం ఆమెకు తెలుసునని ఆమెకు ఉన్న బిరుదులను బట్టి తెలుస్తుంది.రఘునాథ నాయకునిచే కణకాభిషేకం పోందిన మహిళ ,అంతేగాక సరస్వతీ మహల్ ని పండితవాగ్వాదంలో గెలిచి మధురనుండి తంజావూరుకు తెచ్చింది ప్రధాన రచనలు: రామాయణ కావ్యతిలకము(సంస్కృత) కుమారసంభవం (సంస్కృత) నైషదం(సంస్కృత చంపూకావ్యం)
బయటి లంకెలు
మార్చు- మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - మధుర తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన సాహిత్యాన్ని గురించిన పరిశోధన.
Dhakshinandra yugam lo vachana rachanalu శ్రీ రంగ మహాత్యం, మాఘ మాసం,జైమిని భారతం, mahaabaaratham, vachana vichitra రామాయణం.