మధుర వైన్స్
మధుర వైన్స్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్‌కే సినీ టాకీస్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై రాజేశ్ కొండెపు, సృజన్ యారబోలు నిర్మించిన ఈ సినిమాకు జయకిషోర్ బండి దర్శకత్వం వహించాడు. సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2021 అక్టోబరు 14న విడుదల చేయగా[1] సినిమా అక్టోబరు 22న విడుదలైంది.[2]
మధుర వైన్స్ | |
---|---|
దర్శకత్వం | జయకిషోర్ బండి |
నిర్మాత | రాజేశ్ కొండెపు, సృజన్ యారబోలు |
తారాగణం | సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ |
ఛాయాగ్రహణం | మోహన్ చారి |
కూర్పు | వర ప్రసాద్ |
సంగీతం | కార్తీక్ రోడ్రిగీజ్ , జై క్రిష్ |
నిర్మాణ సంస్థలు | ఆర్‌కే సినీ టాకీస్, ఎస్ ఒరిజినల్స్ |
విడుదల తేదీ | 22 అక్టోబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఅజయ్ (సన్నీ నవీన్) ప్రేమించిన అమ్మాయి దూరమైపోవడంతో ఎలాంటి బాధ్యత లేకుండా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మద్యం తాగుతూ ఎంజాయ్ చేసే అతని జీవితంలోకి అసలు మందు అంటేనే అసహ్యంగా భావించే అంజలి (సీమా చౌదరి) ప్రవేశిస్తుంది. అనంతరం అజయ్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరికి వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- సన్నీ నవీన్
- సీమా చౌదరి
- సమ్మోహిత్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: ఆర్‌కే సినీ టాకీస్, ఎస్ ఒరిజినల్స్
- నిర్మాతలు: రాజేశ్ కొండెపు, సృజన్ యారబోలు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జయకిషోర్ బండి
- సంగీతం: కార్తీక్ రోడ్రిగీజ్, జై క్రిష్
- సినిమాటోగ్రఫీ: మోహన్ చారి
- ఎడిటర్: వర ప్రసాద్
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (14 October 2021). "'మనుషులు చేసే తప్పులకు మందును బ్యాడ్ చేయకండి'.. ఆకట్టుకుంటున్న 'మధుర వైన్స్' ట్రైలర్ ." Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (18 October 2021). "సత్యాల అన్వేషణ". Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.
- ↑ The Hans India (22 October 2021). "Madhura Wines Movie Review & Rating". Archived from the original on 24 October 2021. Retrieved 24 October 2021.