మధు వర్మ మంతెన (జననం 1975 మే 8) ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. తెలుగు, హిందీ, బెంగాలీ చిత్రాల నిర్మాణం, పంపిణీలో పాలుపంచుకున్న వ్యవస్థాపకుడు.[2][3]

మధు మంతెన
జననం (1975-05-08) 1975 మే 8 (వయసు 49)
వృత్తివ్యాపారవేత్త
సినిమా నిర్మాత
ప్రకటనకర్త
క్రియాశీల సంవత్సరాలు2002 - ఇప్పటి వరకు
జీవిత భాగస్వామి
(m. 2015; div. 2019)
భాగస్వామినందనా సేన్ (2002–2013)[1]
బంధువులురామ్ గోపాల్ వర్మ (అంకుల్)
పురస్కారాలునేషనల్ ఫిల్మ్ అవార్డ్స్
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్

కెరీర్

మార్చు

మధు మంతెనా యుక్తవయసులో తన స్వంత సంగీత లేబుల్‌ని సృష్టించడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. దానిని అతను సుప్రీమ్ రికార్డింగ్ కంపెనీకి విక్రయించాడు. ఆ తర్వాత అతను మన్మోహన్ శెట్టి ఆధ్వర్యంలో అడ్‌లాబ్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్‌ని స్థాపించాడు. సరెగమ ఫిల్మ్స్‌కు అధిపతిగా ఉన్నాడు.[4][5] మధు మంతెన స్థాపించిన మీడియా సంస్థ ద్వారా కంటెంట్ అభివృద్ధి, కంటెంట్ ఉత్పత్తి, కంటెంట్ పంపిణీ, మానిటైజేషన్ రంగాలలో కృషి చేస్తున్నారు.[6][7]

మధు మంతెనా అనిర్బన్ దాస్ బ్లా (గ్లోబోస్పోర్ట్ పూర్వపు CEO)తో కలిసి KWAN అనే ప్రముఖ నిర్వహణ సంస్థను కూడా స్థాపించాడు. 2012లో KWAN, CAA KWAN అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయడానికి క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (CAA)తో కలిసి జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. ఈ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రస్తుతం వివిధ రకాల వ్యాపార ప్రయోజనాలను కలిగి ఉంది. భారతీయ ప్రతిభతో పాటు అంతర్జాతీయ ప్రతిభను కూడా నిర్వహిస్తోంది.[8]

సినిమా కెరీర్

మార్చు

2008లో మధు మంతెన సహ నిర్మాతగా వచ్చిన గజిని (2008) ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ తరువాత మధు మంతెన త్రిభాషా స్లీపర్-హిట్ రక్త చరిత్ర (2010), టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన పొలిటికల్ థ్రిల్లర్ రన్ (2010), బెంగాలీ హిట్ ఆటోగ్రాఫ్ వంటి చిత్రాలను నిర్మించారు.[9][10]

మధు మంతెన ఫాంటమ్ ఫిల్మ్స్‌ను అనురాగ్ కశ్యప్, వికాస్ బహ్ల్, విక్రమాదిత్య మోత్వానేతో కలిసి స్థాపించారు. ఇది లూటేరా (2013), క్వీన్ (2014) వంటి చిత్రాలను అందించింది. క్వీన్ ఆ సంవత్సరం హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[11] హసీ టో ఫేసీ (2014), బాంబే వెల్వెట్ (2015), అగ్లీ (2015) 2013 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ విభాగంలో ప్రదర్శించబడ్డాయి. ఆ చిత్రాలు న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్,[12] మసాన్‌లో కూడా ప్రదర్శించబడ్డాయి. అంతేకాకుండా 2015 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగంలో రెండు అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డును తెచ్చి పెట్టాయి.[13][14][15] 2016లో విడుదలైన రామన్ రాఘవ్ 2.0 చిత్రం కేన్స్ డైరెక్టర్స్ ఫోర్త్‌నైట్‌లో ప్రదర్శించబడింది. అతను నిర్మించిన ఏడు చిత్రాలను 50 రోజుల వ్యవధిలో థియేటర్లలో విడుదల చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అతి తక్కువ సమయంలో ఒకే నిర్మాత వివిధ భాషల్లో విడుదల చేసిన గరిష్ట సంఖ్య ఇది. ఎనిమిది రోజుల్లోనే నాలుగు సినిమాలు విడుదలవ్వడం విశేషం.[16] అతను రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్ హౌస్ ఫ్యాక్టరీని కూడా నడిపాడు.[17][18] 2019లో అతని సినిమా సూపర్ 30.[19]

ఫిల్మోగ్రఫీ

మార్చు

నిర్మాతగా

మార్చు
Year Title Language
2003 కార్తీక్ తెలుగు
2008 గజిని హిందీ
2010 రన్ హిందీ
2010 ఆటోగ్రాఫ్ బెంగాలీ
2010 రక్త చరిత్ర

రక్త చరిత్ర 2

హిందీ, తెలుగు, తమిళం
2010 ఝూతా హి సాహీ హిందీ
2011 మౌసం హిందీ
2013 లూటేరా హిందీ
2014 హసీ తో ఫేసీ హిందీ
2014 క్వీన్ హిందీ
2014 అగ్లీ హిందీ
2015 NH10 హిందీ
2015 హంటర్ హిందీ
2015 బాంబే వెల్వెట్ హిందీ
2015 షాందార్ హిందీ
2015 మసాన్ హిందీ
2016 ఉడ్తా పంజాబ్ హిందీ
2016 రామన్ రాఘవ్ 2.0 హిందీ
2016 రాంగ్ సైడ్ రాజు గుజరాతీ
2017 ట్రాప్డ్ హిందీ
2018 ముక్కబాజ్ హిందీ
2018 హై జాక్ హిందీ
2018 మన్మర్జియాన్ హిందీ
2018 యంగ్రాడ్ మరాఠీ
2019 సూపర్ 30 హిందీ

అవార్డులు

మార్చు
Year Film Award Category Result
2008 గజిని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఉత్తమ చిత్రం నామినేటెడ్
2015 అగ్లీ స్క్రీన్ అవార్డ్ ఉత్తమ చిత్రం నామినేటెడ్
క్వీన్ 62వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ హిందీలో ఉత్తమ చిత్రం విజేత
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఉత్తమ చిత్రం విజేత
IIFA అవార్డ్ ఉత్తమ చిత్రం విజేత
మసాన్ 63వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు విజేత
2016 రాంగ్ సైడ్ రాజు 64వ జాతీయ చలనచిత్ర అవార్డులు గుజరాతీలో ఉత్తమ చలనచిత్రం విజేత

మూలాలు

మార్చు
  1. "Nandana Sen: All my big decisions in life made sense to no one but me - Times of India". The Times of India.
  2. "Fenil and Bollywood » limca book of records". fenilandbollywood.com. Archived from the original on 28 January 2013. Retrieved 2014-10-05.
  3. "How Madhu got Abbas to do his next film... - The Times of India". timesofindia.indiatimes.com. Retrieved 2014-10-05.
  4. Ganti, T. (2012). Producing Bollywood: Inside the Contemporary Hindi Film Industry. Duke University Press. ISBN 9780822352136. Retrieved 2014-10-05.
  5. "Madhu Mantena Varma". IMDb.
  6. "Jhootha Hi Sahi may be postponed by a week - Indian Express". archive.indianexpress.com. Retrieved 2014-10-05.
  7. "Cameo appearance by three producers in Hasee Toh Phasee - Hindustan Times". hindustantimes.com. Archived from the original on 2014-10-06. Retrieved 2014-10-05.
  8. "Ghajini producer Madhu Mantena detained for swine flu - Hindustan Times". hindustantimes.com. Archived from the original on 2014-10-06. Retrieved 2014-10-05.
  9. "photos-news/Photos-Entertainment/musiclaunchvictory/Article4-361670". hindustantimes.com. Archived from the original on 2014-10-06. Retrieved 2014-10-05.
  10. "Rann -- Film Review". The Hollywood Reporter. 14 October 2010.
  11. "Box Office 2008". boxofficeindia.com. Archived from the original on 12 October 2012.
  12. "List of films in Cannes Directors' Fortnight". Cannes. 24 May 2013. Archived from the original on 22 September 2013. Retrieved 24 May 2013.
  13. "2015 Official Selection". Cannes. Archived from the original on 18 April 2015. Retrieved 16 April 2015.
  14. "Screenings Guide". Festival de Cannes. 6 May 2015. Retrieved 8 May 2015.
  15. "'Masaan' - Movie Review". No. Post.Jagran.com. Retrieved 24 July 2015.
  16. "How Madhu got Abbas to do his next film... - The Times of India". timesofindia.indiatimes.com. Retrieved 2014-10-05.
  17. Ganti, T. (2012). Producing Bollywood: Inside the Contemporary Hindi Film Industry. Duke University Press. ISBN 9780822352136. Retrieved 2014-10-05.
  18. "Madhu Mantena Varma". IMDb.
  19. Desk, IBT Entertainment (2019-07-24). "Anand Kumar praises producer Madhu Mantena on being an inspiring leader to the 'Super 30' team". International Business Times, India Edition (in english). Retrieved 2019-08-27.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=మధు_మంతెన&oldid=3840059" నుండి వెలికితీశారు