మనమూ-మన దేహస్థితి
వైద్యశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన అంశం మన శరీరాన్ని అవగాహన చేసుకోవడం. దాన్ని అవగాహన చేసుకున్న కొద్దీ ఎన్నో వ్యాధులకు మూలం, ఎన్నెన్నో వైద్యసమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. ఈ అవగాహన కేవలం వైద్యులకే కాక సామాన్యులకు కూడా అవసరం. దానివల్ల వారు ఎన్నో సమస్యలు తప్పించుకునే వీలు దక్కుతుంది. పాఠకులకు శరీరాన్ని అవగాహన కల్పించేందుకు వైద్య వృత్తిలో అనుభవం ఉన్న రచయిత ఈ గ్రంథమాల రచించారు. ఆంధ్రపత్రిక అధిపతులైన శివలెంక శంభుప్రసాద్ ప్రేరణతో ఈ గ్రంథమాలను తాను ప్రణాళిక చేసి రచించినట్టు రచయిత డాక్టర్ గాలి బాలసుందరరావు చెప్పారు.
ఈ గ్రంథమాలను మధురా పబ్లికేషన్స్, మద్రాసులో 1964-66 మధ్యకాలంలో ముద్రించబడ్డాయి.
మొదటి భాగము : శరీర ధర్మకాండ
మార్చుమనమూ-మన దేహస్థితి గ్రంథమాలలోని మొదటి భాగము శరీర ధర్మకాండ మొదటి ముద్రణ మే, 1964 లో జరిగింది.
విషయసూచిక
మార్చు- సజీవములు-నిర్జీవములు
- జీవకణము-దాని నిర్మాణము
- జీవకణ కార్యక్రమము
- జీవకణముల వృద్ధి-పునరుత్పత్తి
- మానవ శరీర విజ్ఞానము
- శరీరము-కోశ విభాగము
- అస్థి కోశము
- సంధి విజ్ఞానము
- నరకోశము
- శిరోనరములు-ఇంద్రియములు
- రక్త సంచార కోశము
- శ్వాసకోశము
- జీర్ణకోశము
- లివరు : పేంక్రియస్
- అనాళికా గ్రంథులు
- మెటబాలిజం : ఉష్ణశక్తి
- చర్మము
- మూత్రకోశము
- సంతానకోశము
- ప్రసవము
రెండవ భాగము : రోగకాండ
మార్చుమనమూ-మన దేహస్థితి గ్రంథమాలలోని రెండవ భాగము రోగకాండ మొదటి ముద్రణ 1965 లో జరిగింది. దీనిని మాతృసమానులైన తెన్నేటి శేషమ్మ గారికి అంకితమిచ్చారు.
విషయసూచిక
మార్చు- రోగకారక శక్తులు
- ఇన్‌ఫిల్ట్రేషన్-డీజెనరేషన్
- మెటబాలిజము: దాని వ్యవస్థా భంగములు
- పోర్ ఫైరిన్లు
- నెక్రోసిస్
- గేంగ్రీన్
- విటమినులు
- ఇన్‌ఫ్లమేషను
- రక్తప్లావన వ్యవస్థా భంగము
- శరీరద్రవ దుర్ వ్యవస్థ
- షాక్
- త్రాంబోసిస్
- ఎంబోలిజము
- అపాయములు
- శక్తిజనిత వ్యాధులు
- రసాయనిక వస్తువులు : ప్రమాదములు
- నియోప్లాజము
మూడవ భాగము : ఔషధకాండ
మార్చుమనమూ-మన దేహస్థితి గ్రంథమాలలోని మూడవ భాగము ఔషధకాండ మొదటి ముద్రణ జనవరి 1966 లో జరిగింది. దీనిని మహానటుడైన తన మిత్రుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి అంకితమిచ్చారు.
విషయసూచిక
మార్చు- ఔషధకాండ - వివిధ శాఖలు
- ఔషధములు - పనిచేసే విధానములు
- శరీరములో ప్రవేశించిన ఔషధములు ఏమౌతవి ?
- ఔషధములు - ప్రభేదములు
- ఔషధ ప్రదానము
- ప్రిస్క్రిప్షన్ వ్యాసే విధము
- నరకోశము - ఔషధములు
- కేంద్రనరాశయము - మందీకరౌషధములు
- బాధా నివారకములు
- ప్రకంపనా నిరోధకములు
- ఉత్తేజకములు
- అభ్యాసకారకౌషధములు
- స్వచ్ఛంద నరాశయము - ఔషధ విజ్ఞానము
- పేరా-సింపతెటిక్ సిస్టం ఉత్తేజకములు
- గేంగ్లియాన్ నిరోధకౌషధములు
- మానసికౌషధములు