మనలో ఒకడు 2016 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రం 2016 నవంబరు 4 న విడుదలైంది. [1]

మనలో ఒకడు
దర్శకత్వంఆర్. పి. పట్నాయక్
రచనఆర్. పి. పట్నాయక్, తిరుమల్‌నాగ్‌
నిర్మాతగురుజాల జగన్మోహన్‌
తారాగణంఆర్. పి. పట్నాయక్
అనిత (నటి)
సాయి కుమార్
ఛాయాగ్రహణంఎస్‌.జె.సిద్ధార్థ్‌
సంగీతంఆర్. పి. పట్నాయక్
విడుదల తేదీ
2016 నవంబరు 4 (2016-11-04)
భాషతెలుగు

కథ మార్చు

దేవరాయ కళాశాలలో భౌతికశాస్త్రాన్ని బోధించే ఓ సాధారణ అధ్యాపకుడు కృష్ణమూర్తి (ఆర్‌.పి.పట్నాయక్‌). విద్యార్థుల్ని సొంత పిల్లలుగా భావించే మంచి వ్యక్తి. ఆయన భార్య శ్రావణి (అనిత) పిల్లలకి సంగీత పాఠాలు నేర్పిస్తుంటుంది. ఇల్లు, కళాశాల.. తప్ప మరో ప్రపంచం తెలీదు కృష్ణమూర్తికి. అలాంటి అధ్యాపకుడిపై కళాశాలలో చదువుకొనే ఓ విద్యార్థిని తనని లైంగికంగా వేధించాడని మూడో కన్ను ఛానల్‌కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తుంది. వెంటనే ఆ ఛానల్‌ ‘కీచకుడు’ అంటూ వార్తని ప్రసారం చేస్తుంది. దాంతో కృష్ణమూర్తి ఉద్యోగం పోతుంది. ఇంట్లో భార్యతో విభేదాలు తలెత్తుతాయి. బయట అంతా ఓ నేరస్తుడిలా చూస్తుంటారు. మరి నిజంగా కృష్ణమూర్తి ఆ తప్పు చేశాడా? మూడో కన్ను ఛానల్‌ ప్రసారం చేసిన ఆ వార్తలో నిజమెంత? కృష్ణమూర్తి ఉదంతంలో మూడోకన్ను ఛానల్‌ ఎండీ ప్రతాప్‌ (సాయికుమార్‌) పాత్ర ఏమిటి? తదితర విషయాల్ని తెలుపుతూ కథ సాగుతుంది.

నటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • ఛాయాగ్రహణం: ఎస్‌.జె.సిద్ధార్థ్‌
  • సంభాషణలు: తిరుమల్‌నాగ్‌
  • కూర్పు: ఎస్‌.బి.ఉద్ధవ్‌
  • నిర్మాత: గురుజాల జగన్మోహన్‌
  • కథ, కథనం, సంగీతం, దర్శకత్వం: ఆర్. పి. పట్నాయక్

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-06. Retrieved 2016-11-04.

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మనలో_ఒకడు&oldid=3102286" నుండి వెలికితీశారు