1965 జూన్ 13మహారాష్ట్ర లోని పూనే లో జన్మించిన మనిందర్ సింగ్ (Maninder Singh) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.భారత జట్టు తరఫున మనిందర్ సింగ్ 35 టెస్టులు, 59 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. బౌలింగ్ లో చక్కటి నైపుణ్యం పదర్శించి బిషన్‌సింగ్ బేడీ వారసుడిగా పరిగణించబడ్డాడు. కాని 1986-87 లో మద్రాసు టెస్ట్ టై గా ముగియడానికి అతడే కారణమని విమర్శకుల అభిప్రాయం. 1987 ప్రపంచ కప్ లో పాల్గొన్న భారత జట్టులో ఇతడు సభ్యుడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించాడు.