మనోజ్ ముకుంద్ నరవణే
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మనోజ్ ముకుంద్ నరవణే (జననం 1960 ఏప్రిల్ 22) PVSM AVSM SM VSM ADC ఒక భారతీయ ఆర్మీ జనరల్, [1] అతను ప్రస్తుతం 27వ ఆర్మీ స్టాఫ్ (COAS) గా పనిచేస్తున్నాడు.సిఒఎఎస్ గా తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరువాత 2019 డిసెంబరు 31న జనరల్ బిపిన్ రావత్ నుండి బాధ్యతలు స్వీకరించాడు. సిఒఎఎస్ గా నియమించడానికి ముందు జనరల్ భారత సైన్యానికిచెందిన 40వ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (వీసీఓఏఎస్), ఈస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (జీఓసీ-ఇన్-సి) గా, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా పనిచేశారు. మనోజ్ కంటే ముందు జనరల్ బిపిన్ రావత్ ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా ఉన్నారు.
ప్రారంభ జీవితం
మార్చుమనోజ్ ముకుంద్ నరవణే మహారాష్ట్రకు చెందినవాడు, అతని తండ్రి ముకుంద్ నరవణే భారత వైమానిక దళంలో మాజీ అధికారి, వింగ్ కమాండర్ హోదాలో పదవీ విరమణ చేసిన వ్యక్తి, అతని తల్లి సుధ ఆల్ ఇండియా రేడియోలోఅనౌన్సర్ గా పనిచేశారు. ఆయన భార్య వీణ నరవానే 25 ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయురాలు. ఆమె ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్అధ్యక్షురాలిగా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2]
విద్య
మార్చుపుణెలోని జనన ప్రబోధిని పాఠశాలలో ప్రాథమిక విద్యను. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు . చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీలో డిఫెన్స్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, ఇండోర్‌లోని దేవి అహల్య విశ్వవిద్యాలయంలో డిఫెన్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో M.Phil డిగ్రీని కలిగి చేశాడు[3]. 1980 జూన్లో ది సిక్కు లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో నియమించబడ్డాడు.
అవార్డులు
మార్చుతన వృత్తిలో మనోజ్ ముకుంద్ నరవణే పరమ విశిష్ట సేవా పతకం (2019), అతి విశిష్ట సేవా పతకం (2017), సేన మెడల్, విశిస్ట్ సేవా మెడల్ (2015),, అతని సేవకు సిఒఎఎస్ ప్రశంసా కార్డును పొందారు. అతను సిక్కు లైట్ ఇన్ఫాంట్రీయొక్క రెజిమెంట్ యొక్క కల్నల్ కూడా, అతను పదవీ విరమణ తరువాత రెజిమెంట్ యొక్క మునుపటి కల్నల్ లెఫ్టినెంట్ జనరల్ దేవరాజ్ అన్బు నుండి ఈ గౌరవాన్ని స్వీకరించాడు.
మూలాలు
మార్చు- ↑ "మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: నరవణే". EENADU. Retrieved 2021-12-10.
- ↑ "Lt Gen Manoj Mukund Naravane takes over Gen officer Commanding-in-chief of ARTRAC". web.archive.org. 2017-12-04. Archived from the original on 2017-12-04. Retrieved 2021-12-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ https://indianarmy.nic.in/site/FormTemplete/chief_of_the_army_staff.aspx?MnId=l8oZyDmuloLfhRjX5wciLgE1N2TG0blk6GV8AlgkNvY=&ParentID=6kddiMIBKGRKYs1yRB65Pw==&flag=A13FkV7koN1S9qKW9uKYOg==