యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నూతన చైర్మన్ గా మనోజ్ సోనీ 2023 మే 16వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[1] 2017 జూన్ 28వ తేదీన యుపీఎస్సీలో సభ్యుడుగా చేరిన ఆయన ... 2022 ఏప్రిల్ 5వ తేదీ నుండి తాత్కాలిక చైర్మన్ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు[2]. ఇప్పుడు పూర్తిస్థాయి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. పలు యూనివర్సిటీలో వైస్ ఛాన్స్లర్ గా కూడా ఈయన పని చేశారు[3]. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, మొదలైన ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చైర్మన్ తో పాటు పదిమంది సభ్యులు ఉంటారు. భారత రాజ్యాంగంలో 14వ భాగంలోని 315 నుండి 323 వరకు గల ప్రకరణలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించి నిర్మాణం, సభ్యుల నియామకం, తొలగింపు, సంస్థ యొక్క స్వతంత్రత, విధులు, మొదలైన విషయాలను వివరిస్తుంది[4]. 1921 లోని లీ కమిషన్ 1926లో సమర్పించిన నివేదిక ఆధారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు రూపకల్పన చేశారు.

మూలాలు

మార్చు
  1. "కొత్త UPSC చైర్మన్ గా విద్యావేత్త మనోజ్ సోనీ". Sakshi Education. Retrieved 2023-08-22.
  2. telugu, NT News (2023-05-17). "యూపీఎస్సీ చైర్మన్‌గా మనోజ్‌ సోనీ ప్రమాణం". www.ntnews.com. Retrieved 2023-08-22.
  3. "UPSC: యూపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా డా.మనోజ్‌ సోనీ ప్రమాణస్వీకారం". EENADU. Retrieved 2023-08-22.
  4. "Constitutional Provisions | UPSC". upsc.gov.in. Retrieved 2023-08-22.