మనోహర్ పెర్షాద్
జస్టిస్ మనోహర్ పెర్షాద్ (జ. 1904 జూలై 8, మరణించిన తేదీ తెలియదు) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి.
మనోహర్ పెర్షాద్ | |||
పదవీ కాలం 20 అక్టోబరు 1965 – 8 జూలై 1966 | |||
ముందు | పి.సత్యనారాయణరాజు | ||
---|---|---|---|
తరువాత | ఎన్.డి.కృష్ణారావు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 8 జూలై 1904 |
మనోహర్ పెర్షాద్ 1904, జూలై 8న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం హైదరాబాదులోని ముఫీదుల్ ఇనాం పాఠశాల, సూరత్, బ్రోచ్‌లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తర్వాత పూణేలోని సెయింట్ విన్ సెంట్ ఉన్నత పాఠశాలలో సాగింది. ఆ తర్వాత పూణేలోని డెక్కన్ కళాశాల, బొంబాయి న్యాయ కళాశాలల్లో సాగింది. 1927, డిసెంబరు 22న హైకోర్టులో వకీలుగా నమోదు చేసుకొని, 1941లో అడ్వొకేటు అయ్యాడు. ఈయన బార్‌లో ఒరిజినల్, అపెల్లేట్, సివిల్, క్రిమినల్ కేసులను వాదించాడు. 1946, నవంబరు 20న హైదరాబాదు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 1965, అక్టోబరు 20 నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 1966, జూలై 8న పదవీ విరమణ పొందాడు.
మనోహర్ పెర్షాద్ కమీషన్
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, 1968 ఏప్రిల్ 12న వెనుకబడిన తరగతుల కమిషనుకు అధ్యక్షుడిగా నియమించింది.[1] ఈ కమిటీ 1970, జూన్ 20న సమర్పించిన నివేదికలో ప్రభుత్వ సేవల్లో, విద్యాసంస్థల్లో వెనుకబడిన కులాలవారికి 30 శాతం రిజర్వేషన్లు ఉండాలని సిఫారసు చేసింది.